Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్య, బ్యాడ్మింటన్ ఆటేకాదు, జీవితపా ఠం, గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలం గాణ
Minister Sridhar Babu : ప్రజాదీవెన,హైదరాబాద్: బ్యాడ్మిం టన్ కేవలం ఒక ఆట మాత్రమే కాద ని, జీవితానికి ఎన్నో పాఠాలను నే ర్పే ఉత్తమ గురువు అని రాష్ట్ర ఐ టీ, పరిశ్రమల శాఖ మంత్రి, బ్యా డ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలం గాణ (బీఏటీ) అధ్యక్షుడు శ్రీధర్ బా బు అన్నారు. రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలోని హార్ట్ఫుల్నెస్ గోపీ చంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో బీ ఏటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోనెక్స్ – సన్ రైజ్ 79వ సౌత్ జో న్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాం పి యన్షిప్ – 2025” ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
కోర్టు లో పడిన ప్రతిసారీ లేచి నిల బడే షటిల్ జీవితంలో మనకు ఎ దురయ్యే సవాళ్లను అధిగమించడా నికి మనకు గొప్ప స్ఫూర్తినిస్తుందని ఈ సందర్భంగా ఆయన వివరించా రు. ప్రకా ష్ పదుకొనె, పుల్లెల గోపీ చంద్, పీవీ సింధు, సైనా నెహ్వాల్, సాత్విక్, చి రాగ్, శ్రీకాంత్ వంటి దిగ్గ జ క్రీడాకారులు బ్యాడ్మింటన్లో మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారని కొనియాడారు. అలాంటి గొప్ప క్రీడా కారులను స్ఫూర్తిగా తీసుకొని కేవ లం పాయింట్ల కోసం మాత్రమే కా కుండా, దేశం కోసం ఆడాలని యు వ క్రీడాకారులకు సూచించారు.
మీ క్రమశిక్షణే అసలైన కోచ్ అని, ని రంతర పరిశ్రమే అసలైన స్పాన్సర్ అని, ఆత్మ విశ్వాసం, గెలవాలనే ప ట్టుదలే మీ అసలైన బలం అని వా రికి మార్గ నిర్దేశం చేశారు. తెలంగా ణను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా మా ర్చేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధి తో కృషి చేస్తుందన్నారు. అత్యుత్త మ క్రీడాకారులుగా ఎదిగేందుకు అ వసరమైన అన్నిరకాల ప్రపంచ స్థా యి సౌకర్యాలను రాష్ట్రంలో అభి వృద్ధి చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో షాద్నగర్ ఎ మ్మె ల్యే కె.శంకరయ్య, టీయూఎఫ్ఐ డీ సీ ఛైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, బీఏ టీ ప్రధాన కార్యదర్శి, బ్యాడ్మింటన్ నేషనల్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.