Tuesday, September 29, 2026
More
    HomeSportsMinister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్య, బ్యాడ్మింటన్ ఆటేకాదు, జీవితపా...

    Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్య, బ్యాడ్మింటన్ ఆటేకాదు, జీవితపా ఠం, గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలం గాణ

    📰 Generate e-Paper Clip

    Minister Sridhar Babu : ప్రజాదీవెన,హైదరాబాద్: బ్యాడ్మిం టన్ కేవలం ఒక ఆట మాత్రమే కాద ని, జీవితానికి ఎన్నో పాఠాలను నే ర్పే ఉత్తమ గురువు అని రాష్ట్ర ఐ టీ, పరిశ్రమల శాఖ మంత్రి, బ్యా డ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలం గాణ (బీఏటీ) అధ్యక్షుడు శ్రీధర్ బా బు అన్నారు. రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలోని హార్ట్‌ఫుల్‌నెస్ గోపీ చంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో బీ ఏటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యోనెక్స్ – సన్ రైజ్ 79వ సౌత్ జో న్ ఇంటర్ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాం పి యన్‌షిప్ – 2025” ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

    కోర్టు లో పడిన ప్రతిసారీ లేచి నిల బడే షటిల్ జీవితంలో మనకు ఎ దురయ్యే సవాళ్లను అధిగమించడా నికి మనకు గొప్ప స్ఫూర్తినిస్తుందని ఈ సందర్భంగా ఆయన వివరించా రు. ప్రకా ష్ పదుకొనె, పుల్లెల గోపీ చంద్, పీవీ సింధు, సైనా నెహ్వాల్, సాత్విక్, చి రాగ్, శ్రీకాంత్ వంటి దిగ్గ జ క్రీడాకారులు బ్యాడ్మింటన్లో మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారని కొనియాడారు. అలాంటి గొప్ప క్రీడా కారులను స్ఫూర్తిగా తీసుకొని కేవ లం పాయింట్ల కోసం మాత్రమే కా కుండా, దేశం కోసం ఆడాలని యు వ క్రీడాకారులకు సూచించారు.

    మీ క్రమశిక్షణే అసలైన కోచ్ అని, ని రంతర పరిశ్రమే అసలైన స్పాన్సర్ అని, ఆత్మ విశ్వాసం, గెలవాలనే ప ట్టుదలే మీ అసలైన బలం అని వా రికి మార్గ నిర్దేశం చేశారు. తెలంగా ణను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా మా ర్చేందుకు మా ప్రభుత్వం చిత్తశుద్ధి తో కృషి చేస్తుందన్నారు. అత్యుత్త మ క్రీడాకారులుగా ఎదిగేందుకు అ వసరమైన అన్నిరకాల ప్రపంచ స్థా యి సౌకర్యాలను రాష్ట్రంలో అభి వృద్ధి చేస్తున్నామన్నారు.

    ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ ఎ మ్మె ల్యే కె.శంకరయ్య, టీయూఎఫ్ఐ డీ సీ ఛైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, బీఏ టీ ప్రధాన కార్యదర్శి, బ్యాడ్మింటన్ నేషనల్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.