Tuesday, September 29, 2026
More
    HomePoliticsMinister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, అంధకారాన్ని తొలగించి...

    Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని బోధించే గొప్ప వ్యక్తి గురు వు

    📰 Generate e-Paper Clip

    Minister Komatireddy Venkat Reddy :

    ప్రజా దీవెన, నల్లగొండ: భారత దేశా న్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయు ల పాత్ర కీలకమని రాష్ట్ర రోడ్లు, భ వనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అ న్నారు.అంధకారాన్ని తొలగించి అ జ్ఞానం స్థానంలో జ్ఞానాన్ని బోధించే గొప్ప వ్యక్తి గురువన్నారు. అలాంటి గురువుల ద్వారా సమాజానికి అ వసరమయ్యే భావి భారత పౌరుల ను తీర్చిదిద్దే విద్యా వ్యవస్థను పటి ష్టం చేసేందుకు తెలంగాణ ప్రభు త్వం ముందుందన్నారు.

    ఉపాధ్యాయ దినోత్సవం, దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరిం చుకొని శుక్రవారం నల్గొండ జిల్లా కేం ద్రంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి ఆయన ము ఖ్య అ తిథిగా హాజరై ఉత్తమ ఉపా ధ్యా యులను సన్మానించారు. ఉత్త మ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీతలకు ఆ యన శుభాకాంక్షలు తెలియజే స్థూ సమాజంలో అమ్మా,నాన్నల త ర్వా త స్థానం గురువుకి ఇచ్చారని, గు రువు గొప్పతనాన్ని డాక్టర్ సర్వే ప ల్లి రాధాకృష్ణ దేశానికి చాటిచెప్పా రని, ఆయన చేసిన సేవలు మ రు వలేనివన్నారు.

    తెలంగాణ విద్యార్థులు ప్రపంచంలో నే పోటీపడే విధంగా ఒక్కొక్కటి 20 0 కోట్ల రూపాయలతో యంగ్ ఇం డియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ను నిర్మిస్తున్నామని, మొట్టమొదటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులు నల్గొండలోనే ప్రారంభమ య్యాయని తెలిపారు.డిఎస్ సి ద్వారా ఉపాధ్యాయుల నియామకా న్ని చేపట్టి విద్యావ్యవస్థను పటిష్టం చేశామని, పాఠశాలలు, విద్యాసం స్థలలో మౌలిక వసతుల కల్పన, ఉ పాధ్యాయులకు శిక్షణ వంటి కార్య క్రమాలను నిర్వహించి మెరుగైన బోధన అందించేందుకు చర్యలు తీ సుకున్నామన్నారు.

    నల్లగొండ పార్లమెంటు సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడు తూ విద్యార్థులను మంచి పౌరు లు గా తీర్చిదిద్ది సమాజానికి అం దించే బాధ్యత గురువులపై ఉందని, అ లాంటి గురువులు సమాజంలో గొ ప్పవారన్నారు. తల్లిదండ్రుల త ర్వా త స్థానం గురువుదని, ప్రభుత్వం వి ద్యారంగాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నదని, ప్రత్యే కించి రాష్ట్ర రో డ్లు, భవనాల శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రభుత్వ పా ఠశాలను దత్తత తీసుకొని ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా కార్పొరేట్ తర హాలో సొంత నిధులు వెచ్చించి ని ర్మిస్తుండడం పట్ల ఆ యన మం త్రిని అభినందించారు. ప్రైవేట్ పాఠ శాలలకు దీటుగా వి ద్యను అందిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చే స్తున్నదని, విద్యార్థులను ప్రత్యేకిం చి మారుమూల ప్రాంత విద్యార్థుల కు మంచి విద్యను అందించాలని ఉపాధ్యాయులతో కోరారు.

    జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లా డుతూ నల్గొండ జిల్లాలో ఉపాధ్యా యుల కృషి వల్లనే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 12 శాతం వి ద్యార్థుల నమోదు పెరిగిందన్నారు. ఉపాధ్యాయుల కృషితోనే జిల్లాలో ఎక్కడ లేని విధంగా భవిత కేంద్రా లు విజయవంతంగా నిర్వహిస్తు న్నామని, దీని ద్వారా మానసిక వి కలాంగుల పిల్లలకు ఎంతో ఉపయో గకరమని అన్నారు. తాను జిల్లా క లెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రారంభమైన ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలెక్షన్లను విజయవంతం చేయడంలో ఉపా ధ్యాయుల పాత్ర మర్చిపోలేనిదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతిస్తున్నదని, ఇం దులో భాగంగానే జిల్లాలో విద్యా భివృద్ధికి గాను మైనింగ్ ద్వారా వ చ్చే నిధులలో 70 శాతం విద్యాశాఖ కి 30 ఖర్చు పెట్టాలని నిర్ణయించ డం జరిగిందని అన్నారు. ఉపాధ్యా యులు మంచి విద్యను అందిస్తే వి ద్యార్థుల గుండెల్లో నిలిచిపోతార న్నారు.

    ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఎం తో ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపా రు.మరో ఎమ్ ఎల్ సి నెల్లికంటి స త్యం మాట్లాడుతూ సమాజానికి ది శా, దశ, నిర్దేశం చేసేది ఉపాధ్యా యుడేనని అన్నారు. అవార్డులతో నిమిత్తం లేకుండా ఉపాధ్యాయులు నిరంతరం విద్యార్థుల భవిష్యత్తు ను తీర్చిదిద్దడం పై దృష్టి సారించా లని కోరారు. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అ డిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ ఆర్డి ఓ వై. అశోక్ రెడ్డి, డిఈఓ బిక్షపతి, మా ర్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, హా లి యా మార్కెట్ కమిటీ చైర్మన్ చం ద్ర శేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు, త ది తరులు ఈ కార్యక్రమానికి హాజర య్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.