Thursday, October 8, 2026
More
    HomePoliticsCM Revanth Reddy : మిర్యాలగూడ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం, రైతాంగo యూరియా కో సం...

    CM Revanth Reddy : మిర్యాలగూడ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం, రైతాంగo యూరియా కో సం ఉదారత, సీఎంకు రూ.2కోట్లు అందజేత 

    📰 Generate e-Paper Clip

    CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: నల్ల గొం డ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బ త్తుల లక్ష్మారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలోని రైతులకు ఉపయోగపడే కార్యక్ర మం చేపట్టాలని భావించిన ఆయన తన కుమారుడి వివాహ రిసెప్షన్ కో సం ఖర్చు చేయాలనుకున్న రూ. 2 కోట్ల రూపాయల చెక్కును ముఖ్య మంత్రికి అందించారు.

    గురువారం ముఖ్యమంత్రి శ్రీ ఎ. రే వంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసం లో కలిసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, నల్గొండ లోక్‌సభ సభ్యులు కుందూరు రఘు వీర్ తో కలసివచ్చి ముఖ్యమంత్రిని కలిసి చెక్కును అందించారు. ఆ డ బ్బును మిర్యాలగూడ నియోజక వ ర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయా లని విజ్ఞప్తి చేశారు.

    నియోజకవర్గంలో దాదాపు లక్ష మంది రైతులకు ఒక్కొక్కరికి ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అం దజేయాలని కోరారు. లక్ష్మారెడ్డి తన కుమారుడు సాయి ప్రసన్న వివాహ రిసెప్షన్ మిర్యాలగూడలో నిర్వ హించాలని భావించినప్పటికీ దాన్ని రద్దు చేసుకుని ఆ డబ్బును రైతుల కు ఉపయోగపడే కార్యక్రమం చే యాలన్న నిర్ణయానికి వచ్చారు. రై తులకు ప్రయోజనం కలిగించే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని, వారి కుటుంబ సభ్యులను ముఖ్య మంత్రి అభినందించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.