bc reservation percentage in telangana : బిగ్ బ్రేకింగ్, సర్వత్రా ఆసక్తి, ‘స్థాని కం’లో బీసీ రిజర్వేషన్ల ఖరారు,ఉత్తర్వులు జారీచేయనున్నప్రభుత్వం
bc reservation percentage in telangana: ప్రజా దీవె న, హైదరా బాద్: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నిక లకు సంబంధిం చి నెలకొన్న సందిగ్ధ తకు తెరపడనుంది. ప్రభుత్వ వర్గా ల నుంచి వెలువడిన విశ్వసనీయ సమాచారం మేరకు ఇంత కాలం మీ మాం సలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టకేలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముఖ్యమైన బీసీ రిజర్వేషన్ల అ మలు అంశం తేలడంతో ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఎట్టకేలకు బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కేటా యిస్తూ ఎన్నికలకు ముందు కు వె ళ్లాలని నిర్ణయించడమే కాకుండా ఆ మేరకు ఉత్తర్వుల విడు దలతో రిజర్వేషన్లు ఖరారు చేయనుంది.
ప్రభుత్వ వర్గాల నుంచి అందు తు న్న సమాచారం మేరకు రాష్ట్రం లో 31 జిల్లా పరిషత్ లకు గాను బీసీల కు 13 జిల్లాలు, ఎస్సీలకు 5, ఎస్టీ ల కు 3 కేటాయించనుoడగా జనర ల్ కేటగిరి లకు 10 జిల్లాలు రిజర్వ్ కా నున్నట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా వీటి లో మహిళలకు 50 శా తం రిజర్వేషన్లతో 14 జిల్లాలను కే టాయి స్తూ ప్రభుత్వం జీవో జారీ చేసేందుకు కసరత్తు ప్రారంభించిoది.
రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీ స్థానాలు 565 ఉండగా, ఎంపీటీసీ 5,7 63 స్థా నాలు, సర్పంచ్ 12,760 స్థానాలు ఉన్నాయి. అయితే జి ల్లాల కలెక్టర్లు వీటన్నింటికీ రిజర్వేషన్లు ఖరారు చేసే పనిలో ఇప్ప టికే నిమగ్నమై రిజర్వేషన్లు ఖరారు చేసి సమాచారా న్ని గోప్యంగా ఉంచనున్నారు. ప్రభు త్వం అధికారిక ఆదేశాలు వచ్చిన తర్వాతే విడుదల చేసేందుకు కలె క్టర్ లు సైతం రంగం సిద్ధం చేసి పె ట్టుకు న్నారు. హైకోర్టు ఆదేశాల మేర కు కాస్తా అటు ఇటుగా అక్టోబర్ నె లలో ఎన్నికలు నిర్వహించనుండ గా దీపావళి పండుగ లోపు ఎన్ని కలు ముగిసే అవకాశం ఉందని ఆయా వర్గాలు చెబుతున్నాయి.