Wednesday, October 7, 2026
More
    HomePoliticsMLA Harish Rao: జోర్డాన్ లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికు లను వెంటనే స్వదేశానికి తీసుకు...

    MLA Harish Rao: జోర్డాన్ లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికు లను వెంటనే స్వదేశానికి తీసుకు రావాల్సిoదే

    📰 Generate e-Paper Clip

    –22 నెలలు గడిచినా కాంగ్రెస్ గల్ఫ్ పాలసీ, NRI పాలసీకి అతిగతిలేదు
    –నాడు వలసలు వాపస్, కాంగ్రెస్ పాలనలో వలసలు మొదలు
    –అధికారంలో ఉన్నవారు 12 మం ది గల్ఫ్ కార్మికులను రప్పించాలి
    –మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్

    MLA Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: జోర్డాన్ లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులను వెంటనే స్వదేశానికి తీసుకు రావా ల్సిoదేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు.అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఆ 12మం ది గల్ఫ్ కార్మికులను రప్పించాలని ఉద్ఘాటించారు. శుక్రవారం ఆయన తన వ్యక్తిగత సామాజిక మాధ్య మం ఎక్స్ లో గల్ఫ్ బాధిత కార్మి కుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

    22 నెలలు గడిచినా కాం గ్రె స్ గల్ఫ్ పాలసీ, NRI పాలసీకి అతి గతిలే దు. నాడు వలసలు వాపస్, కాం గ్రె స్ పాలనలో వలసలు మొదల య్యాయి. ఉపాధి కోసం వెళ్లి జో ర్డాన్ లో చిక్కుకున్న 12 మంది వ లస కార్మికుల ఆవేదనను ప్రభు త్వం పట్టించుకోకపోవడం దుర్మా ర్గం. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, గల్ఫ్ బాధితులకు భరోసా ఇవ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తుండటం సిగ్గుచేటు.

    నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికులు దేశం కాని దేశంలో బి క్కుబిక్కుమంటూ బతుకుతున్నా రు. అక్కడే ఉండి బతికేందుకు చేతి లో డబ్బులు లేక, కంపెనీ అనుమ తి ఇవ్వకపోవడంతో తిరిగి స్వదేశా నికి రాలేక అనేక ఇబ్బందులు ఎ దు ర్కొంటున్నారు.వారికి అండగా నిల వాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లే దా. బిఆర్ఎస్ పాలనలో వలసలు వాపస్ అయితే, ఇప్పడు వలసలు మల్లా మొదలయ్యాయి.

    కాంగ్రెస్ పాలనలో ఉపాధి, ఉద్యో గాలు కరువై ఎడారి ప్రాంతాలకు వ లస పట్టే దుస్థితి వచ్చింది. అన్ని వ ర్గాల ప్రజలను మోసం చేసినట్లే కాం గ్రెస్ పార్టీ వలస కార్మికుల కుటుంబా లను సైతం దారుణంగా వంచించిం ది.అభయ హస్తం మేనిఫెస్టోలో గ ల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సంక్షేమం అంటూ అనేక హామీలు ఇచ్చింది త ప్ప, ఇప్పటి వరకు ఒక్కటీ అమలు చేయలేదు. ఏడాదిన్నర పాలన త ర్వాత గల్ఫ్ కార్మికుల సంక్షేమం, స మగ్ర ఎన్నారై పాలసీపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన అడ్వై జరీ కమిటీ ఏం చేస్తున్నట్లు.గల్ఫ్ కా ర్మికులు సంక్షోభంలో ఉంటే ఆ కమి టీ చైర్మన్, వైస్ చైర్మన్, గౌరవ స భ్యులు, సభ్యులు ఏం చేస్తున్నట్లు.

    మేనిఫెస్టోలో చెప్పిన ఎన్నారైల సం క్షేమ బోర్డు, గల్ప్ సంక్షేమ బోర్డులకు అతీ గతి లేదు.విదేశాల్లో ఉన్న వల స కార్మికుల సంక్షేమం కోసం ఏర్పా టు చేస్తానన్న టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ఇ ప్పటికీ దిక్కులేదు. ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రె డ్డి, బండి సంజయ్ లు చొరవ చూ పి జోర్డాన్ లో ఉన్న గల్ఫ్ కార్మికుల ను వెంటనే తెలంగాణకు రప్పించేం దుకు కృషి చేయాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామని పే ర్కొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.