Wednesday, October 7, 2026
More
    HomePoliticsDistrict Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆదేశం, పే రూరు వంతెన...

    District Collector Ila Tripathi : నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆదేశం, పే రూరు వంతెన పునరుద్ధరణకు అం చనాలు రూపొందించాలి 

    📰 Generate e-Paper Clip

    District Collector Ila Tripathi : ప్రజా దీవెన, నాగార్జున సాగర్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కార ణంగా తెగిపోయిన హాలియా మం డలం, పేరూరు వంతెన తాత్కాలిక పునరుద్ధరణకు అంచనాలు రూ పొందించి సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశిం చారు.శుక్రవారం ఆమె నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డితో కలిసి పేరూరు గ్రా మ శివారులో తెగిపోయిన వంతె న ను పరిశీలించారు.

    ఇంజనీరింగ్ అధికారులు, గ్రామస్తు లతో వివరాలను అడిగి తెలుసుకు న్న తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ వంతెన తెగిపోవడం వల్ల ప్రజల రవాణాకు,రాకపోకలకు ఇబ్బందు లు కలగకుండా తక్షణమే తాత్కాలి క చర్యలు చేపట్టాలని,ఇందులో భాగంగా పేరూరు వంతెనకు తా త్కాలిక మరమ్మతులు చేపట్టేందు కు అంచనాలు రూపొందించాలని, అలాగే శాశ్వత ప్రాతిపదికన హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదన లు సమర్పించాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.

    కాగా 40 సంవత్సరాల కు పూర్వం నిర్మించిన ఈ వెస్టడ్ కాజ్ వే పై అ టువైపు నుండి మదారిగూడెం, ఇ టువైపు పేరూరు గ్రామాలను కలు పుతుంది .అయితే చుట్టుపక్కల ఉన్న ఏడేనిమిది గ్రామాల ప్రజలు కూడా ఈ వంతెన తెగిపోవడం కార ణంగా రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి రాగా ,ఆమె స్థానిక శాసనస భ్యులతో కలిసి వంతెనను పరిశీ లించి తక్షణ చర్యలకు ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశా రు.అనంతరం హాలియా తహసిల్దా ర్ కార్యాలయంలో ఇదే విషయంపై మరోసారి శాసన సభ్యులతో కలెక్ట ర్ చర్చించారు.

    జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తా త్కాలిక వంతెనకు తక్షణ చర్య లు చేపట్టాలని శాసన సభ్యులు కుం దూరు జయవీర్ రెడ్డి సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎమ్మె ల్యే లు నాగార్జునసాగర్ నియోజక వర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షే మ కార్యక్రమాలపై చర్చించా రు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారా యణ అమిత్ ,ఆర్ అండ్ బి ఎగ్జి క్యూటివ్ ఇంజనీర్ రాజేందర్,డి ఈ సతీష్,ఏ ఈ సాయి రెడ్డి, ము న్సిప ల్ కమిషనర్ రామ్ దుర్గా రెడ్డి, త హసిల్దార్ రఘు, ఎంపీడీవో సు జా త, మార్కెట్ కమిటీ చైర్మన్ తు మ్మ లపల్లి చంద్ర శేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.