Wednesday, September 30, 2026
More
    HomePoliticsDeputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీల క వ్యాఖ్య,...

    Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీల క వ్యాఖ్య, ప్రపంచస్థాయి వ్యవస్థల రూపకల్పనకు కేంద్రంగా తెలంగాణ

    📰 Generate e-Paper Clip

    –సైన్స్, ఆవిష్కరణలకు కేంద్రం హై దరాబాద్

    –పరిశోధనా సంస్థలు, పెట్టుబడి దారులకు స్వాగతం

    –ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం క ట్టుబడి ఉంది

    –ప్రకృతిని మించిపోవడం కాదు దా ని నుంచి నేర్చుకోవడం మన కర్త వ్యం

    — బయో ఇన్స్పైర్డ్ ఫ్రాంటీర్స్ 2025 అంతర్జాతీయ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

    Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: పండిట్ జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి హైదరాబాద్ సైన్స్ మరియు ఆవి ష్కరణలకు కేంద్రంగా విరాజిల్లుతోం దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం jrc క న్వెన్షన్ లో నిర్వహించిన Bioins pire ఫ్రాంటియర్స్ 2025 – ఇంట ర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ స్పేస్ ఎకా నమీ, బయోమిమిక్రి & ఎక్స్‌ట్రాటెరె స్ట్రియల్ రిసోర్స్ సదస్సులో ము ఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం ప్రసం గించారు. ప్రపంచ స్థాయి వ్యవస్థల రూపకల్పనకు కేంద్రంగా తెలంగాణ నిలిచింది అన్నారు. హైదరాబాద్ కు ప్రపంచ స్థాయి పరిశోధన సంస్థ లు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్త ల కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షా న ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు.

    ప్రపంచ స్థాయి మౌలిక వసతుల క ల్పనకు సీఎం రేవంత్ రెడ్డి నాయ క త్వంలోని తెలంగాణ ప్రభుత్వం క ట్టుబడి ఉందన్నారు.హైదరాబాదు నగరానికి ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేసిన శాస్త్రవేత్తలు, పరిశ్ర మ నాయకులు, ఆవిష్కర్తలకు ఆ యన స్వాగతం తెలిపారు.శాస్త్ర సు న్నితత్వం మరియు కల్పనాత్మకత కవిత్వం కలిసిన ఈ నగరం ఎప్పు డూ సృజనాత్మకతకు నిలయంగా నిలిచిందన్నారు.

    బయోఇన్స్పైర్డ్ ఫ్రాంటియర్స్ 20 25—జీవశాస్త్రం, సాంకేతికత, అం తరిక్ష అన్వేషణల మధ్య జరుగు తున్న ఈ ప్రపంచ స్థాయి సంభాషన భారత శాస్త్రీయ గమ్యాన్ని అర్థ శ తాబ్దానికి పైగా నిశ్శబ్దంగా మలిచిన ఈ నగరంలో జరుగుతుండటం గ ర్వకారణం అన్నారు.హైదరాబాద్‌కు సైన్స్ తో ఉన్న అనుబంధం లోతైన ది మరియు చిరకాలమైనది అన్నా రు. భారత తొలి ప్రధానమంత్రి పం డిట్ జవహర్‌లాల్ నెహ్రూ నాయక త్వంలో ఈ నగరంలో అనేక శాస్త్రీ య సంస్థలు పునాది వేసుకున్నా యని వివరించారు.నేషనల్ రిమో ట్ సెన్సింగ్ సెంటర్ (NRSC)—ము నుపటి NRSA—హైదరాబాద్‌ను భారతదేశపు “ఆకాశనేత్రం”గా మా ర్చింది. ఉపగ్రహ చిత్రాలను వ్యవసా యం, నీటి వనరులు, విపత్తు నిర్వ హణలో వినియోగిస్తూ మార్గద ర్శి గా నిలిచిందని తెలిపారు.

    రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) ఇక్కడ DRDL, D MRL, RCI వంటి ప్రతిష్ఠాత్మక ప్ర యోగశాలలను స్థాపించి, దేశానికి క్షిపణి, పదార్థ సైన్స్ లో నైపుణ్యా న్ని అందించిన తరతరాల శాస్త్రవేత్త లను తీర్చిదిద్ది ఘనత హైదరాబా ద్ కు సొంతం అన్నారు. ఇవే కాకుం డా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (B DL), మిశ్ర ధాతు నిగమ్ (MIDH ANI), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆ ఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) వం టి పబ్లిక్ రంగ సంస్థలు కూడా ఇక్క డే ఎదిగి, దేశానికి విమానయాన, లోహశాస్త్రం, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో బలమైన పునాది వేశాయి అని తె లిపారు.

    ఈ దశాబ్దాల ప్రజా పెట్టుబడి, శాస్త్రీ య స్పూర్తి కలయికతో రూపుదిద్దు కున్న ఈ పరిసర వ్యవస్థే హైదరాబా ద్‌కు ప్రత్యేకమైన “సైన్స్ డీఎన్‌ఏని ఇచ్చింది,అది క్రమశిక్షణతో కూడిన ది, సృజనాత్మకమైనది, నిశ్శబ్దంగా కానీ స్పష్టమైన ఆశయాలతో కూ డిందన్నారు.ఈ వారసత్వాన్ని నేటి యువ ఆవిష్కర్తలు కొత్త ఉత్సాహం తో ముందుకు తీసుకెళ్తున్నారని డి ప్యూటీ సీఎం ఆనందం వ్యక్తం చే శారు.స్కైరూట్ ఏరోస్పేస్, ఇక్కడే హైదరాబాద్‌లో జన్మించి, భారతదే శంలోనే ప్రైవేట్ రంగం ద్వారా రాకె ట్ ప్రయోగాలు సాధ్యమని నిరూ పించింది. వారి విజయం కేవలం ఉత్పత్తి కాదు, ఒక కొత్త ఎకోసిస్ట మ్‌ను సృష్టించింది: ప్రొపల్షన్ ఇంజనీర్లు, కాంపోజిట్ నిపుణులు, స్పేస్ సరఫరాదారులు అనే కొత్త తరాన్ని పెంచింది అని వివరించారు.

    ధ్రువ స్పేస్, మరో హైదరాబాద్‌ ఆ ధారిత సంస్థ, ఉపగ్రహ రూపకల్పన నుండి తయారీ, ప్రయోగం, గ్రౌండ్ స్టేషన్‌ల వరకు సంపూర్ణ పరిష్కా రాలను చూపుతుంది, మనం ప్రపం చ స్థాయి వ్యవస్థలను మన రాష్ట్రం లోనే రూపకల్పన చేయగలమని చూపిస్తోందని తెలిపారు.ఇవన్నీ చుట్టూ రోబోటిక్స్, పదార్థ శాస్త్రం, 3D ప్రింటింగ్ రంగాల్లో కొత్తగా ఎదు గుతున్న సంస్థలు కలిసి భారత అం తరిక్ష ఆర్థిక వ్యవస్థకు కొత్త రూపా న్ని ఇస్తున్నాయి అన్నారు.

    ఇవి ఒంటరిగా పని చేయడం లేదు. ఇవి హైదరాబాద్‌లోని IIT Hyder abad, IIIT Hyderabad, BITS Pilani, University of Hyder ab ad, T-Works వంటి సంస్థలతో బ లమైన అనుసంధానం కలిగి ఉన్నా యని తెలిపారు. ఇదే తెలంగాణా మోడల్ ఆఫ్ ఇన్నోవేషన్,ప్రభుత్వ సంస్థలు పునాది వేస్తాయి, స్టార్టప్‌ లు దానిపై నిర్మిస్తాయి, విశ్వవిద్యా లయాలు ప్రతిభను పెంపొందిస్తా యని వివరించారు.

    ఈరోజు హైదరాబాద్ భారతదేశం లోని అత్యంత విభిన్న సాంకేతిక ఎకోసిస్టమ్‌లలో ఒకటిగా నిలిచింది—IT, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, రక్ష ణ, ఇప్పుడు అంతరిక్ష సాంకేతికత లో ప్రపంచ నాయకులకు ఆతిథ్యం ఇస్తోంది అన్నారు.అదిబట్లలో ఏ రోస్పేస్ మాన్యు ఫా క్చరింగ్, ఈ- సిటీలో ఎలక్ట్రానిక్స్, జీనోమ్ వ్యాలీ లో ఫార్మా, షంషాబాద్ సమీపంలో ని మొబిలిటీ వ్యా లీలో రవాణా సాంకేతికతలు. ప్రతి క్లస్టర్‌లో మూ డు విలువలు ప్రధానంగా ఉంటా యి. ఆవిష్కరణ,తయారీ, సుస్థి రత అని వివరించారు.

    ISRO అనుబంధ సౌకర్యాలు, టెలీ మెట్రీ కేంద్రాలు, ఇన్క్యూబేషన్ స్థ లాలు హైదరాబాద్‌ను భవిష్యత్తు అంతరిక్ష మిషన్లకు ప్రధాన కేంద్రంగా నిలిపాయి అని డిప్యూటీ సీఎం తె లిపారు. అవి చంద్రయానం కావొ చ్చు, భూమి పరిశీలన కావొచ్చు, లే దా అంతరిక్ష వనరుల వినియోగం కావొచ్చు అన్నారు. ఈ కాన్ఫరెన్స్ థీమ్—“బయోఇన్స్పైర్డ్ ఫ్రాంటియ ర్స్”—మనకు ఒక లోతైన విషయం గుర్తు చేస్తుంది:ప్రకృతే అసలు ఇంజ నీర్ అని డిప్యూటీ సీఎం విశ్లేషించా రు.అత్యంత అందమైన రెక్కలు, క వచాలు, న్యూరల్ నెట్వర్క్స వంటి వి ప్రకృతిలో ఇమిడి ఉన్నాయి అ న్నారు. మన కర్తవ్యం ప్రకృతిని మించి పోవడం కాదు, దానినుంచి నేర్చుకోవడం అని వివరించారు.

    తెలంగాణా ప్రభుత్వం ఈ తత్త్వాన్ని తన అభివృద్ధి దృక్పథంలో భాగం చేస్తోంది, బయోమిమెటిక్ డిజైన్, గ్రీన్ బిల్డింగ్ కోడ్స్, నీటి నిర్వహణ, శుద్ధ ఇంధనం రంగాల్లో దీన్ని ప్రో త్సహిస్తోందని వివరించారు. అంత రిక్షంలోకి విస్తరించేప్పుడు కూడా మనం ఈ వినయాన్ని తీసుకెళ్లాలి, ఆవిష్కరణ, సంరక్షణ రెండూ కలిసి రెండు కాళ్ళ మాదిరిగా నడవాల న్నారు.

    భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ రా బోయే దశాబ్దంలో విపరీతంగా పెర గబోతోంది. ఆ వృద్ధికి తెలంగాణా లాంచ్‌ప్యాడ్‌గా ఉండాలని తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది అన్నారు. ప్రపంచంలోని పరిశోధనా సంస్థలు, పెట్టుబడిదారులు, ఆవి ష్కర్తలను హైదరాబాద్‌కి ఆహ్వాని స్తున్నాము అన్నారు. సహాయక వి ధాన వాతావరణం, ఇన్క్యూబేషన్ సపోర్ట్, ప్రపంచ స్థాయి మౌలిక వస తులు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నారు.

    హైదరాబాద్ ఈరోజు కేవలం ఒక గమ్యం కాదు, ఒక మనస్తత్వం: వి చారణాత్మకమైనది, ఆత్మవిశ్వా సంతో కూడినదన్నారు.ఈ రోజు ఇ క్కడ మొదలైన చర్చలు భవిష్య త్తులో భూమి మీదా, అంత రిక్షం లోనూ మంచిని నిర్మించే భాగ స్వా మ్యాలుగా మారాలని కోరుకుం టు న్నానన్నారు.

    తెలంగాణా ఎల్లప్పుడూ ప్రభుత్వ సంస్థలను ప్రేరే పించే, స్టార్టప్‌లు ఆవిష్కరించే, ప్ర పంచ శాస్త్రం కలిసే ప్రదేశంగా ఉంటుందని స్పష్టం చేశా రు. జ్ఞానం మరియు అన్వేషణ మ ధ్య వంతెనగా, భూమి మరియు ఆ కాశం మధ్య సేతువుగా హైదరా బా ద్ మహానగరం ఎప్పటికీ నిలవాల ని డిప్యూటీసీఎం ఆకాంక్షించారు.

    ఈ సమావేశంలో ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్, GEOPAQ సీఈవో ఎం అబ్బాస్, లీడ్ స్పాన్సర్ సుజిత్ తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.