Wednesday, October 7, 2026
More
    HomeOpinionFinancialassistance poorstudent : మల్లేపల్లి చదువుల తల్లికి స్ఫూర్తిఫౌండేషన్ శ్రీవ్యాల్ ఆపన్నహస్తం

    Financialassistance poorstudent : మల్లేపల్లి చదువుల తల్లికి స్ఫూర్తిఫౌండేషన్ శ్రీవ్యాల్ ఆపన్నహస్తం

    📰 Generate e-Paper Clip

    మల్లేపల్లి చదువుల తల్లికి స్ఫూర్తిఫౌండేషన్ శ్రీవ్యాల్ ఆపన్నహస్తం

    Financialassistance poorstudent : ప్రజా దీవెన, కొండ మల్లేపల్లి: దేవర కొండ నియోజకవర్గం కొండ మల్లేప ల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ కి చెందిన చదువుల తల్లికి స్ఫూర్తి ఫౌండే షన్ ఆపన్న హస్తం అందిం చింది. కాలనీకి చెందిన అందుగుల సైద మ్మ, వెంకటయ్య దంపతుల రెం డో కుమార్తె తేజశ్రీ ఇటీవల విడుద లైన నీట్ ఫలితాల్లో ఉత్తమ ఫలితం సాధించి రామగుండం ప్రభు త్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది.

    కుటుంబ పరిస్థితుల నేపద్యంలో కళాశాలలో ఫీజు చెల్లించలేక కూ లి పనులకు వెళుతుంది. తేజశ్రీ అక్క ప్రవళిక కూడా మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ నాలుగవ సంవత్సరం చదువుతుం ది. చదువులో ముందంజలో ఉన్న తేజశ్రీ, ప్రవళిక చదువులు కొన సాగించడానికి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న క్రమంలో చండూరు ము న్సిపాలిటీ కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యా యుడు, సామాజిక కార్యకర్త గురిజ మహేష్ ని చదువుల ఆర్థిక సహకారం కోసం సంప్రదించారు.

    స్ఫూర్తి ఫౌండేషన్, హైదరాబాద్ స్థా పకులు శ్రీవ్యాల్ కి వీరి కుటుం బ ఆర్థిక ఇబ్బందులను, చదువుల పరిస్థితిని గురిజ మహేష్ వివ రించగా స్ఫూర్తి ఫౌండేషన్ శ్రీవ్యాల్ వీరి చదువుల సహకారం కోసం రూ. 8 2 వేలు ఆర్ధిక సాయం అందించా రు. ఈసందర్భంగా ప్రభు త్వ ఉపాధ్యాయులు సామాజిక కార్యకర్త గురిజ మహేష్ మాట్లా డారు.

    పేదరికం కారణంగా ఎంబిబిఎస్, ఐ ఐటీ లాంటి ఉన్నత చదువులు చ దువుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ఎవ రైనా ఉంటే ఆర్థిక సహాయం కోసం తన ఫోన్ నెంబర్ 91824 984 63లో సంప్రదించాలని కోరారు. ప్రతిభగల పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్య క్ర మంలో సామాజి క కార్య కర్త ప్రభుత్వ ఉపాధ్యాయులు గురిజ మ హేష్, అందుగుల సై దమ్మ, వెంకటయ్య ప్రవళిక, తేజశ్రీ పాల్గొన్నా రు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.