–సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
Collector Tejas Nandalal Pawar : ప్రజా దీవెన, సూర్యాపేట: భవిష్య త్తుకు పదవ తరగతి మొదటి అడు గని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. పదవ తరగతిలో మంచి మార్కులు, విషయపరిజ్ఞా నాన్ని సంపాదిస్తే ఇంటర్ తో పాటు, అన్నింటిలో రాణించేందుకు అవకా శం ఉంటుందన్నారు.మంగళవారం ఆయన సూర్యాపేట జిల్లా తిరుమ లగిరి మండల కేంద్రంలోని జిల్లా ప రిషత్ ఉన్నత పాఠశాలలో పదవ త రగతి విద్యార్థుల స్పెషల్ క్లాస్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అందరికీ పుస్తకాలు వచ్చాయా సి లబస్ ఎంతవరకు అయిందని హా స్టల్లో భోజనం బాగుందా చదు వు లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగారు.అనంతరం చదువు ప్రాధాన్యత, పదవ తరగతి ప్రాము ఖ్యతను ఆయన తెలియజేస్తూ ప దవ తరగతిలో మంచి మార్కులు వచ్చేందుకు బాగా కష్టపడి చదవా లని, జీవితంలో ఏదైనా సాధించేం దుకు పదవ తరగతి తొలిమెట్టు అ ని అన్నారు.
దీనివల్ల అనుకున్న కళాశాలలో ఇం టర్లో సీటు వస్తుందని, అంతేగా క ఏ దైనా ఉపాధి ,ఉద్యోగాలకు పదవ తరగతిని అడుగుతారని చెప్పారు. పరీక్షల పట్ల భయం లేకుండా చద వాలని, దానివల్ల తప్పులు లేకుం డా రాస్తే మంచి మార్కులు వస్తాయ ని, ఇందుకు భయాన్ని వదిలివేయా లని, ఏ రోజు పాఠాలు ఆరోజు సా యంత్రం తిరిగి ఒకసారి చదువుకో వాలని, పరీక్ష వాతావరణంలో చద వడం, అభ్యసనం చేయాలన్నారు.
ఒక అంశం పట్ల సమాచారం తెలిస్తే భయం అనేది ఉండదని, ఆత్మవి శ్వాసంతో చదవడం వల్ల అనుకు న్నది సాధించవచ్చన్నారు. జీవితం లో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్య సాధన కోసం కృషి చేయా లని ఆయన విద్యార్థులకు సూచిం చారు. అనంతరం ఇదే ఆవరణలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ మొ దటి సంవత్సరం విద్యార్థుల తర గ తి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లా డి బాగా చదువుకోవాలని చెప్పా రు. ఆయన వెంట ఎంఈఓ శాంత య్య తదితరులు ఉన్నారు.

