Jagriti President Kavitha : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా కిష్టరాయినిపల్లె, నెల్లికల్ ప్రాం తాల్లో భూసేకరణ చేసిన 17 ఏళ్లు అవుతోందని, భూమి ఇచ్చిన వారి పరిస్థితి దయనీయంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. ప్రా జెక్టుల భూ సేకరణలో భూ ములు పోగొట్టుకున్న వారి కుటుంబంలో వారికి ఉద్యోగం ఇస్తామని కూడా ఇంతవరకు ఇవ్వలేదని విమర్శిం చారు. ఇన్నేళ్ల పాటు నిర్వాసితు లకు భూమి లేదు, ఉద్యోగం లేకుం డా ఉంటే వారి పరిస్థితి ఎలా ఉం టుందో అర్థం చేసుకోవచ్చని, ఈ వి షయం ప్రభుత్వానికి అర్థం కాకపోవ డం బాధాకరమని వ్యాఖ్యానించా రు. నల్లగొండ జిల్లా పర్యటనలో భా గంగా బుధవారం ఆమె నల్లగొండ జి ల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ప్రసూ తి వార్డ్ పరిశీలనతో పాటు స్థాని కంగా వివిధ రంగాల మేధావులతో సమావేశం నిర్వహించారు. అంత కుముందు ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో జాగృతి అధ్య క్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే.
బంగారు తెలంగాణ అంటే మారా ల్సింది పేదల జీవన పరిస్థితులు. కృష్ణా నది నీళ్లు తేవటంలో సీఎం రేవంత్ రెడ్డి ఇలాగే అలసత్వం వ హిస్తే నిర్వాసితులతో కలిసి ఆయ న ఇంటి ముందు ధర్నా కు పిలుపు నివ్వడం ద్వారా ముట్టడి కార్యక్ర మాన్ని చేపడతామని హెచ్చరించా రు. నిర్వాసితుల బాధ వర్ణనాతీ తంగా ఉంది. ఏడ్చేందుకు కన్నీళ్లు కూడా లేనంత దయనీయంగా ఉంది వాళ్ల పరిస్థితి.
నల్గొండ జిల్లా అంటేనే ఎంతో చరిత్ర కలిగిన జిల్లా, రాజ్యాలు, ప్రజా ఉ ద్యమాలు, విప్లవాత్మక ఆలోచనలు కలిగిన ప్రాంతం. ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఒకప్పుడు బౌద్ధం, జై నం తో పాటు అద్భుతమైన ఆలోచ న సరళి కలిగిన జిల్లా. ఉమ్మడి రా ష్ట్రంలో మా ఇక్కడి చరిత్రను గుం టూరుకు తీసుకెళ్లారు. ఉద్యమం స మయంలో దీనిపై మేము పోరాటం చేశాం.
నాగార్జున కొండ వద్ద ఉన్న స్థూపా న్ని కూడా గుంటూరు కు తీసుకెళ్లా రు. పానగళ్ లో ఉన్న ఎన్నో విగ్రహా లను అక్కడకు తీసుకెళ్లారు. తెలం గాణ వచ్చాక కూడా అవన్నీ రిటర్న్ రాలే. జాగృతి ఆధ్వర్యంలో తె లం గాణ చరిత్ర కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది. మేము ఇక్కడి చరి త్ర తెలుసుకునే క్రమంలో 60 వేల ఏళ్ల చరిత్ర ఈ ప్రాంతానికి ఉందని తెలిసింది. పచ్చల, ఛాయ సోమే శ్వరం ఆలయాలు ఇక్కడ ఉన్నా యి. ఇంకో పక్క సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. సాయుధ రై తాంగ పోరాటం చేయని ఇళ్లు ఇక్క డ లేదు.
ఆనాటి ఉద్యమ కారులు మల్లు స్వరాజ్యం గారిని ఇటీవలే మనం కోల్పోయాం. కానీ ఇప్పటికీ కూడా జిల్లాలో అదే చైతన్యం ఉంది. ఆలో చనపరులు, చైతన్య వంతులు కలి గిన జిల్లా ఇది. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి నియోజకవ ర్గం లో అన్ని ప్రాంతాలు తిరిగాను.
హుజుర్ నగర్ లో సిమెంట్ ఫ్యాక్ట రీలలో కొలువు కోసం కొట్లాట అనే కార్యక్రమాలు చేశాం. ప్రతి మండల కేంద్రంలో బతుకమ్మ ఎత్తుకొని నేను తిరిగాను. అలాంటి ఈ జిల్లాకు ఇ ప్పుడు జాగృతి జనం బాట కార్య క్ర మంలో భాగంగా వచ్చాను.
నేను ఇక్కడకు ఎందుకు వచ్చానో ఈ జిల్లా ప్రజలకు చెప్పాల్సిన బా ధ్యత నాపై ఉంది. నీళ్లు, నిధులు, నియామాకాలు అనే నినాదంతో తెలంగాణ తెచ్చుకున్నాం. గత ప దే ళ్లలో చాలా విజయాలు సాధించాం. కానీ ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. తెలంగాణ వచ్చాక మన నీ ళ్లు మనకు వస్తాయని అందరం అ నుకున్నాం. కానీ నల్గొండ జిల్లాకు కృష్ణా నీళ్లు పూర్తి స్థాయిలో వచ్చా యో లేదో అందరం ఆలోచించాలి.
మాధవ రెడ్డి ప్రాజెక్ట్, కృష్ణా, మూసీ, దిండి, ఎస్ఎల్ బీసీ ప్రాజెక్ట్ లతో జిల్లాకు నీళ్లు రావాలి. మూడున్నర లక్షలు , అదే విధంగా ఎస్సారెస్సీ తో కొంత కాళేశ్వరం, దేవాదుల ద్వా రా కొంత నీళ్లు రావాలి. కానీ జిల్లా కు నీళ్లు అంటే కృష్ణానది మీదనే ఎ క్కువ ఆధారపడాల్సిన పరిస్థితి.
మరి బీఆర్ఎస్ పదేళ్లు, కాంగ్రెస్ రెం డేళ్లు పన్నెండేళ్లలో కృష్ణానది నీళ్లు తెచ్చుకున్నామా ఆలోచన పరులు ఆలోచించాలి.
నాగార్జున సాగర్ డ్యామ్ ఇక్కడే కనబడుతుంది. కానీ చుట్టు ఉన్న ఐదు మండలాలకు నీళ్లు రావు.
నెల్లికల్లు ప్రాజెక్ట్ పూర్తైతే 5 మండ లాలకు నీళ్లు వస్తాయి. కానీ ఇప్పటి వరకు ఎవరు పూర్తి చేయలేదు. బీఆర్ఎస్ ను ఇదే అంశంలో విమ ర్శించి కాంగ్రెస్ అధికారంలోకి వ చ్చింది. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఎందుకు పనులు చేయటం లేదు.
బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా సరే సమస్యలు మాత్రం అలాగే ఉ న్నాయి. అందుకే ప్రభుత్వాన్ని అ డి గే వాళ్లు ఉండాలి. వారిపై ఒత్తిడి పె ట్టినప్పుడే పనులు అవుతాయి. ఇక్కడి సుంకిశాలను హైదరాబాద్ నీటి అవసరాలకు సెకండ్ అల్టర్ నే ట్ అని గతంలో కేటీఆర్ గారు ప్రా రంభించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైనింగ్ వాల్ కొట్టుకు పో యిన పరిస్థితి. కనీసం ఆ విషయా న్నిబయటకు కూడా చెప్పలేదు.
ఎంప్లాయిస్ తీసిన వీడియో ద్వారా ఆ విషయం బయటకు తెలిసింది.
దీంతో ఆగమేఘాల మీద అధికారు లను తీసేశారు. ఎంక్వైరీ వేశామ న్నారు. విచారణ కమిటీ కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని సూచించింది. కానీ కాంట్రాక్టర్ ను ఏ మీ చేయలే. మంత్రులు ఉత్తమ్ కు మార్ రెడ్డి, వెంకట్ రెడ్డి ఒక్క మాట అనలే. ఇక మేఘాతో సీఎం ఫెవికల్ బంధం తెలిసింది. ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఇలాగే ఎన్ని ఏళ్లు పనులు చేసుకుంటూ పోతా రు.
నిన్న దేవరకొండలో వెల్ఫేర్ స్కూల్ కు వెళ్లాం. బీఆర్ఎస్ హయాంలోనే ఆ స్కూల్ కు 5 ఎకరాలు కేటాయిస్తే రెండు ఎకరాలు కబ్జా అయ్యింది. పడుకునే చోటనే పిల్లలు చదువుకు నే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ ను ఇ వే అంశాలపై తిట్టి తిట్టి కాంగ్రెస్ అధి కారంలోకి వచ్చింది. కానీ స్కూల్స్, వెల్ఫేర్ హాస్టల్స్ ను పట్టించుకోవ టం లేదు. కలెక్టర్లు వారానికి ఒకసా రి సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో నిద్ర చేయాలని సీఎం చెప్పారు. ఎక్కడై నా కలెక్టర్లు ఆ మాటను పట్టించుకు న్నారా, సీఎం మాట అంటే కలెక్టర్ల కు లెక్క లేదు.
ఈ రోజు ఉదయం మేము మెటర్న టీ హాస్పిటల్ కు వెళ్లాం. ఒక్కో బెడ్ మీద ఇద్దరు పేషెంట్లను, పిల్లలను పడుకోబెట్టారు. డాక్టర్లు, నర్సుల ఓ పికకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. సౌకర్యాలు లేకపోయినా వారు పని చేస్తున్నారు. కానీ రాజకీయ నాయ కులుగా మనం ఫెయిల్ అవుతు న్నాం. హాస్పిటల్ డెవలప్ మెంట్ అ థారిటీ అని ఒకటి ఉంటుంది. రోజు వారీ అవసరాలకు ఇక్కడి హాస్పి ట ల్ లక్షా 20 వేల ఖర్చు ఉంటుంది.
హాస్పిటల్ డెవలప్ మెంట్ అథారిటీ వద్ద డబ్బులు లేవు. సూపరిండెంట్ వద్ద పెట్టి క్యాష్ లేదు.
ప్రతిదానికి పైకి లేఖ రాస్తూ డబ్బు లు రావాలంటే జరగాల్సి న డ్యామే జ్ అప్పటికే జరిగిపోతుంది. పిడి యాట్రిక్ లో విభాగంలో ఓ బిడ్డ పరి స్థితి దయనీయంగా ఉంది. ఎంఆర్ ఐ లేకపోవటంతో డాక్టర్లు కూడా ఆ చేతన స్థితిలో ఉండిపోయారు. నీ లోఫర్ హాస్పిటల్ కు వెళ్లాల్సిన ప రిస్థితి. తల్లితండ్రుల వద్ద రూపాయి లేదు. మా జాగృతి తరఫున వారిని నీలోఫర్ కు పంపించే ఏర్పాటు చే శాం. కానీ ఎంతమందికి ఈ పరిస్థి తి. ప్రభుత్వపరంగా సిస్టమ్ ఛేంజ్ కావాలి.
ఇవి రాజకీయాలు ఎంత మాత్రం కా వు. లాస్ట్ ఇయర్ లో రాజకీయాలు చేద్దాం. ప్రభుత్వ హాస్పిటల్ లో ఎపి డ్యూరెల్ లేని పరిస్థితి. బిడ్డలను క న్నా వారికి నొప్పి లేకుండా ఈ మం దు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రభు త్వ ఆస్పత్రిలో ఆ మందు లేకపోవ టంతో ఇంకా ఆటవిక కాలం మాది రిగా మహిళలు ప్రసవ వేదన పడు తున్నారు.
వారు బిడ్డలను కనేటప్పుడు పడే వేదన మరో జన్మ ఎత్తినట్లుగా ఉం టుంది. ఈ విషయంలో నేను మహి ళలకు క్షమాపణ చెబుతున్నా. గత ప్రభుత్వం లో ఉన్నప్పుడు నాకు కూడా ఎపిడ్యూరెల్ హాస్పిటల్ లో ఉంచాలన్న ఆలోచన రాలేదు. హె ల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సిం హా జెంటిల్ మెన్. మిడియా ద్వారా ఆయనకు రిక్వెస్ట్ చేస్తున్నా. కచ్చి తంగా హాస్పిటల్ లో ఎపిడ్యూరెల్ ఉంచాలని కోరుతున్నా. మీ ద్వా రానైనా ఒక మంచి మార్పు రావా లని విజ్ఞప్తి చేస్తున్నా.
ఇవ్వాళ మేము హాస్పిటల్ కు పో తాం అనగానే జిల్లా మంత్రి కూడా హాస్పిటల్ విజిట్ కార్యక్రమం పెట్టు కున్నారంట. మేము వెళ్లే వరకు కూ డా ఆయన హాస్పిటల్ విజిట్ చే యాలన్న ఆలోచన ఎందుకు రా లేదో.ఆయన వెళ్లిన తర్వాతనైనా హాస్పిటల్ లో ఏమైనా మార్పులు వస్తాయో చూడాలి. మా పిల్లలు నా ప్రొగ్రామ్స్ కోసం కొన్ని ఫ్లెక్సీలు పెడి తే అరెస్ట్ చేయించారంట. మంత్రి కో మటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్న నాతో నీకు ఏమీ పంచాయితీ ఉందన్నా.
పోలీసులకు చెప్పి మా పిల్లలను వదిలేయమనండి. ఇప్పుడు మేము రాజకీయాలు చేయాలని రాలేదు.
రాజకీయాలు చేసే సమయంలో క చ్చితంగా చేస్తాం. ఈ జిల్లాలో మీకు గట్టి పోటీదారులను పెడతాం. మా జాగృతి కార్యకర్తలతో పెట్టుకోవద్దు. జాగృతి కార్యకర్తలతో పెట్టుకున్నో ళ్లు బాగుపడలేదు.
నల్లగొండ జిల్లాలో 13 ల క్షల 44 వేే ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేశారు. మిర్యాలగూడ రై స్ మిల్లుల హబ్ కావటంతో సగం ధాన్యం వాళ్లే కొనే పరిస్థితి ఉంది.
మిగిలినవి 6 లక్షల మెట్రిక్ టన్నులే. వాటిని ప్రభుత్వం కొనాలి. ఇందు కోసం వెయ్యి కొనుగోలు కేంద్రాలు కావాలి. కానీ ఇప్పటి వరకు 375 కేంద్రాలు మాత్రమే తెరిచారు. కనీ సం లక్ష మెట్రిక్ టన్నులను కూడా ఇప్పటి వరకు కొనలేదు. బోనస్ త ప్పించుకునేందుకే రైతుల నుంచి ధా న్యం కొంటలేరు. వెంటనే ధాన్యం కొ నుగోలు చేయాలని ప్రభుత్వాన్ని నే ను డిమాండ్ చేస్తున్నా.
అదే విధంగా సుంకిశాల ప్రమాదం పై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి
ఎస్ఎస్ బీసీ టన్నెల్ ప్రమాదం పై ఏం చర్యలు తీసుకున్నారో మంత్రి ప్రజలకు చెప్పాలి. కృష్ణా నది రైడ్ సైడ్ కెనాల్ మీటర్ రీడింగ్ ఏపీ చే తిలో ఉంటే లెప్ట్ సైడ్ కేంద్రం ఆధీ నంలో ఉంది. కాంగ్రెస్ అధికా రంలో కి వచ్చాక కేంద్రానికి మన ప్రాజెక్ట్ బాధ్యతను అప్పగించారు. ఇప్పు డు మీటర్ రీడింగ్ తెలుసుకోవా ల న్న తెలుసుకోలేని పరిస్థితి. వెంటనే కోమటి రెడ్డి మీటర్ రీడింగ్ తెప్పిం చుకోవాలి. లెప్ట్ కెనాల్ ను మన ఆధీనంలోకి తేవాలి. లేదంటే ప్రతి రీడింగ్ కు ఆంధ్రావాళ్లను అడుక్కో వాల్సిన పరిస్థితి వస్తుంది.
అదే విధంగా ఎస్ ఎల్ బీసీ ఎ ప్పు డు పూర్తి అవుతుందో చెప్పాలి. దా ని మీద ఆధారపడిన నక్కల గండి పరిస్థితి ఏంటీ?మెథ్యా నాయక్, న క్కల గండి ప్రాంతాలను మంత్రి వి జిట్ చేయాలి. దిండి పరిస్థితి అ యితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు అధికారంలోకి వచ్చిన అదే పరిస్థితి. భూదాన్ భూముల విష యంలో అనేక విమర్శలు చేసి కాం గ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పు డు ఆ భూములను రీక్లెయిమ్ చే యాలి. రెండేళ్లలో ఏం కార్యాచరణ చేశారో చెప్పాలి. మిర్యాల గూడ వ ద్ద దామర్లచర్ల యాదాద్రి పవర్ ప్లాం ట్ లో ఐదు యూనిట్లు నడవాలి.
కానీ రెండు యూనిట్లు మాత్రమే ప నిచేస్తున్నాయి. మిగతావి ఎప్పుడు పూర్తి చేస్తారు.వీర్లపాలెం వారికి ఇం టికో ఉద్యోగం అని బీఆర్ఎస్ చె ప్పింది.కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వంగా కాంగ్రెస్ ఆ పని పూర్తి చేయాలి. వారికి పరిహారం కూడా ఇవ్వాలి. మిర్యాలగూడలో భారీగా రైస్ మిల్లులు ఉన్నాయి. వాళ్లంతా ఎఫ్.సి.ఐ ద్వారా వంద మెట్రిక్ టన్నుల గోడౌన్ ఉండాలని కోరుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
అమెరికా, ఆఫ్రికా వాళ్లను ఇక్కడి వచ్చి వ్యాపారం చేయాలని సీఎం కోరుతున్నారు. మిర్యాలగూడను కూడా అదే స్ఫూర్తితో ఇండస్ట్రీ హబ్ చేయాలి. ఇక్కడ చాలా సమ స్యలను స్థానికులు చెప్పారు. మే ము కమిటీలు వేసుకొని వాటి మీద పోరాటం చేస్తాం. మీ ఆడబిడ్డగా నే ను చెప్పేది ఒక్కటే. ఫ్రెంచ్ విప్లవం స్ఫూర్తిగా తెలంగాణ పోరాటం చే శాం. స్వేఛ్చ, సమానత్వ, సౌభ్రా తృత్వం నినాదాలతో ఫ్రెంచ్ విప్లవ సక్సెస్ అయ్యింది. భూమి, భుక్తి, వి ముక్తి పేరుతో జరిగిన పోరాటం కూ డా విజయ తీరాలను ముద్దాడింది.
అదే విధంగా నీళ్లు, నిధులు, ని యామాకాల నినాదంతో తెలంగాణ తెచ్చుకున్నాం. భౌగోళిక తెలంగాణ కాకుండా సామాజిక తెలంగాణ రా వాలి. అందుకోసమే మా పోరాటం. అవకాశం, అధికారం, ఆత్మగౌరవం మా విధానం. సమాజంలో ఇంకా అ వకాశాలు రాని వారికి అవకాశం రా వాలి. తద్వారా అధికారం, ఆత్మగౌ రవం దక్కాలి. మైనార్టీ, ఆడబి డ్డ లు, బీసీలు ఎంత మంది ఉన్నారు? వారిలో ఎంత మందికి అధికారం దక్కింది?
బడా వ్యాపారవేత్తల్లో ఎస్సీ, ఎస్టీలు ఎంత మంది ఉన్నారో చూడండి.
అందరికీ గౌరవం దక్కాలంటే సా మాజిక తెలంగాణ రావాల్సిందే.
అందుకు అనేక మార్గాల్లో పోరాటం చేయాల్సి ఉంటుంది. బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల్లోనే కాదు చట్ట సభల్లోనూ రిజర్వేషన్లు రావాలి.
ఎస్సీ, ఎస్టీ లకు రాజ్యాంగ బద్ద రక్ష ణ ఉండటంతో కొంతమంది ఎమ్మె ల్యేలు, ఎంపీలు అవుతున్నారు.
కానీ కులవివక్ష లేకుండా వారికి ఆ త్మగౌరవం దక్కాలి.యాదాద్రిలో ముఖ్యమంత్రి పైన ఛైర్ లో కూర్చొ ని దళిత మంత్రులను కింద ఛైర్ కూ ర్చొపెట్టిన వివక్షపూరిత ఘటన మ నం చూశాం. ఎస్సీ, ఎస్టీ, మహిళ లు, డబ్బులు లేని యువత పై వివ క్ష ఉండకూడదు. మళ్లీ విద్యాసం స్థల్లో స్టూడెంట్ ఎలక్షన్స్ రావాలి.
లేదంటే కొత్త నాయకత్వం రావటం కష్టం. కొత్త వాళ్లు రావాలంటే స్టూ డెంట్ యూనియన్ ఎన్నికలు ఉం డాలి. కొత్త నాయకత్వం లేకపో వ టంతో ఇప్పుడున్న నాయకుల వా రసులు, బంధువులే రాజకీయాల్లో కి వస్తున్నారు. నియోజికవర్గాల పు నర్విభజన అయితే రాష్ట్రంలో 65 నుంచి 69 మంది ఆడబిడ్డలు చట్ట సభల్లోకి వస్తారు. గతంలో మేము లీడర్ అనే ప్రొగ్రామ్ చేశాం. ఇప్పు డు కూడా నాయకత్వానికి సంబం ధించి ఆడబిడ్డలకు ట్రైయినింగ్ ఇ స్తాం.జిల్లాల్లో నాయకులను తయా రు చేసి వారిని ఎంపావర్ చేస్తాం. దీర్ఘకాలిక, తక్షణ సమస్యలు ఇలా రెండింటిపై పోరాటం చేసేలా మా ప్ర ణాళిక ఉంటుంది. జనంబాటకు జ ర్నలిస్టులు, డిజిటల్ మీడియా మిత్రులు ఎంతో సహకరిస్తున్నారు. ఎక్కడికి వెళ్లిన తమ ఇంటి ఆడబి డ్డ మాదిరిగా హారతి ఇస్తూ ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. వారం దరికీ నా ధన్యవాదాలు.
ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తేవటమే మా లక్ష్యం. ప్రాజెక్ట్ ల వ ద్ద నిర్వాసితుల పరిస్థితి దయనీ యంగా ఉంది. మీ ఉమ్మడి జిల్లా మంత్రులు ప్రజల వద్దకు వెళ్లి వారి దుఖాన్ని చూడాలని కోరుతున్నా.
తప్పు బీఆర్ఎస్ చేసినా, కాంగ్రెస్ చేసినా తప్పు తప్పే. బీఆర్ఎస్ త ప్పు చేస్తేనే కాంగ్రెస్ ను గెలిపించా రు. మీరు తప్పు చేస్తే వేరే వాళ్లను గెలిపిస్తారు. అందుకే ప్రభుత్వం తక్ష ణం ప్రజా సమస్యలపై స్పందిం చా లి. జూబ్లీహిల్స్ ఎన్నికలు రెఫరెం డం అని సీఎం చెప్పుకున్నారు.
కానీ అక్కడ ఎవరు గెలిచినా ఫరక్ పడదు. 15 రోజులు మాత్రం రాజ కీ య పార్టీలకు ఎంటర్ టైన్ మెంట్ అయ్యింది. ప్రజల సమస్యలు వీస మెత్తు కూడా తీరవు. జూబ్లీహిల్స్ ఎన్నికలు పూర్తవటం నాకు సంతో షంగా ఉంది. కనీసం ఇప్పుడైనా అ ధికారపక్షం, ప్రతిపక్షం ప్రజల సమ స్యలపై దృష్టి పెడుతుంది. నల్గొండ లో కనీసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు. మరో 30 ఏళ్లలో జనాభా డ బుల్ అవుతుంది. రోగాలు పెరుగు తాయి. ఇక్కడి మంత్రి గట్టిగా అడిగి పనిచేయించుకునే నాయకుడని మేము అనుకుంటున్నాం. మరి మంత్రి నల్గొండలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేయటం పై దృష్టి పెట్టాలి. ఇక ఈ ప్రాంతంలో చాలా సమస్యలు మా దృష్టి వచ్చాయి.
వాటి పరిష్కారం కోసం మా నా య కులంతా పనిచేస్తాం. ఇక పత్తి రైతు పరిస్థితి దయనీయంగా ఉంది.
20 శాతం తేమ ఉన్న సరే పత్తి కొ నుగోలు చేయాలి.ఎకరానికి ఏడు క్వింటాళ్లే కొంటామన్న రూల్ తీసే యాలి. ఇప్పటికే ఈ సమస్యపై వ్య వసాయ మంత్రి, కేంద్ర మంత్రికి లేఖ రాశామని కవిత భావోద్వేగంతో మీ డియా సమావేశంలో మాట్లాడారు. సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ జా గృతి నాయకులు సయ్యద్ ఇస్మా యిల్, నవీన్ తదితరులు ఆమె తో ఉన్నారు.




