–రాజ్యసభ సభ్యులు కేశ్రీ దేవ్ సిన్హా జ్వాల
Sardar Vallabhbhai Patel : ప్రజా దీవెన, నల్లగొండ: జాతీయ సమైక్యత, దేశభక్తి ని పెంపొందిం చడం, ప్రత్యేకించి జాతిని ఏకీకృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటే ల్ పాత్ర మరువలేనిది ఎంపీ, రాజ్య సభ సభ్యులు కేశ్రీ దేవ్ సిన్హా జ్వా ల అన్నారు.సర్దార్ వల్లభాయ్ పటే ల్ 150 వ జయంతి ని పురస్కరిం చుకొని ప్రజలలో జాతీయ సమైక్య తను, దేశభక్తిని పెంపొందించేం దు కుగాను కేంద్ర యువజన వ్యవహా రాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వ ర్యంలో మై భారత్ మరియు ఎన్ఎ స్ఎస్ సహకారంతో బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్. జి . కళాశాల మైదానంలోఏర్పాటు చేసి న “సర్దార్ @150 యూనిట్ మా ర్చ్” లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన పటేల్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పూర్తితో జాతి నిర్మాణంలో యువతను ప్రోత్సహిం చడం, యువత ఆలోచనలను ఆచ రణలో పెట్టి దేశ అభివృద్ధికి కృషి చే యాలని పిలుపునిచ్చారు. ఈ సం దర్భంగా యూనిట్ మార్చ్ కు హాజ రైన అధికారులు, విద్యార్థులు, స్వ చ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రమాణం చేశా రు.
ఈ యూనిట్ మార్చ్ నాగార్జున డి గ్రీ కళాశాల నుండి బయలుదేరి గడి యారం సెంటర్, ప్రతీక్ మెమోరియ ల్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వర కు కోనసాగింది.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్. ఆర్డీవో వై. అశోక్ రెడ్డి , డి.ఎస్.పి శివరాం రెడ్డి, జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి అక్బర్ అలీ, బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గోలి మధుసూదన్ రె డ్డి, మై భారత్ స్టేట్ సభ్యులు అను స్మాన్, ప్రసాద్ దాస్ , యూత్ కో- ఆ ర్డినేటర్ రాజే ష్,సాయి కృష్ణ తదిత రులు పాల్గొ న్నారు.

