Monday, September 28, 2026
More
    HomePoliticsNalgonda Collector Ila Tripathi : బిగ్ బ్రేకింగ్, వర్షాలకు తెగిన కాలు వకట్టను కాలినడకన...

    Nalgonda Collector Ila Tripathi : బిగ్ బ్రేకింగ్, వర్షాలకు తెగిన కాలు వకట్టను కాలినడకన పరిశీలించిన నల్లగొండ జిల్లా కలెక్టర్

    📰 Generate e-Paper Clip

    Nalgonda Collector Ila Tripathi : ప్రజా దీవెన, కొండ మల్లేపల్లి: నల్ల గొండ జిల్లాలో గత నెల కురిసిన భా రీ వర్షాల కారణంగా పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (చెరు వు) కింద దెబ్బతిన్న పనులన్నిం టిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం ఆమె ఇంజనీరింగ్, రెవిన్యూ అధికారుల తో కలిసి కొండ మల్లేపల్లి మండలం, పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వా యర్ (పాత చెరువు)ను పరిశీలిం చారు. ఒకటవ వీయర్ నుండి 5వ వీయర్ వరకు కాలినడకన పర్యటి స్తూ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కిం ద వర్షాలకు తెగిపోయిన కాలువ లు ,దెబ్బ తిన్న , రహదారి,బాట, క ట్ట పరిస్థితిని పరిశీ లించారు. భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్ పూ ర్తిస్థాయిలో నిండి పేర్వాల రిజర్వా యర్ నిండి పొంగి ప్రవహించి ప్రమా ద స్థాయికి చేరుకోగా దానికి అనుకొ ని ఉన్న రెండు తాండాలు హీర్యా తండా, సింగ్యా తండా ప్రజలను ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించిన విషయం తెలిసిందే.

    పెండ్లిపాకల బ్యాలెన్సింగ్ రిజర్వా యర్ కింద దెబ్బతిన్న పనుల పున రుద్ధరణకు జిల్లా యంత్రాంగం ఎఫ్ డిఆర్ కింద ప్రతిపాదనలు పంపించ డం జరిగింది. అయితే భారీ వర్షా ని కి తెగిపోయిన, దెబ్బతిన్న కాలు వ లు,కట్టతో పాటు,కట్టమీద నుండి హీర్యా తండా, సింగ్యా తండా, అ లాగే మరో రెండు తాండాలైన గుడి తండా, కారోబార్ తాండలు, బ్యా లెన్సింగ్ రిజర్వాయర్ స్థిరీకరణ, సా మర్థ్యం , ఎత్తు పెంచితే మునకకు గురయ్యే విస్తీర్ణం, గ్రామాలు, తది తర వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మా ట్లాడుతూ భారీ వర్షాల కారణంగా పెండ్లిపాకల రిజర్వాయర్ కింద దె బ్బతిన్న కాలువలు, కట్ట,రహదారి పనులన్నింటిని పునరుద్ధరించేం దు కు చర్యలు తీసుకుంటామని చె ప్పారు. అలాగే పెండ్లి పాకాల బ్యా లెన్సింగ్ రిజర్వాయర్ సమగ్ర వివ రాలను అడిగి తెలుసుకున్నారు.

    కాగా ప్రస్తుత పెండ్లిపాకల బ్యాలె న్సింగ్ రిజర్వాయర్(పాత) నీటి నిలువ సామర్థ్యం 251.5 ఎఫ్ఆ ర్ ఎల్ ఉండగా,హీర్య తండా, గుడి తండా, పత్యా తండాలు పూర్తి రిజ ర్వాయర్ సామర్థ్యానికి బయట ఉ న్నప్పటికీ ప్రస్తుత కట్ట సామర్థ్యాన్ని పెంచి నీటి నిలువ సామర్థ్యం పెం చి తే ఇవన్నీ మునకకు గురయ్యే అవ కాశం ఉందని ఇంజనీరింగ్ అధికా రులు కలెక్టర్ కు వివరించారు.

    ప్రస్తుతం పెండ్లిపాకల రిజర్వాయర్ ( చెరువు)సామర్త్టం 0.54 టీఎంసీ ల మేర ఉండగా, దీనిని 2.2 టీఎం సీలకు పెంచినట్లయితే ఈ నాలుగు తం డాలు మునకకు గురయ్యే అవ కాశం ఉందని ఇంజనీరింగ్ అధికా రులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువ చ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పెండ్లిపాక ల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఎత్తు పెంచి నీటి నిలువ సామర్థ్యం పెం చేందుకుగాను, 1204 కోట్ల రూపా యలకు పరిపాలన అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిం దే.

    ఇందులో భాగంగా 2771 ఎకరా లు భూసేకరణ అవసరం కాగా, ఇ ప్ప టివరకు 1917 ఎకరాలు పూర్తి చే యడం జరిగింది. 854 ఎకరాల కు అవార్డు పాస్ అయినప్పటికీ చె ల్లిం పులు చేయవలసి ఉంది.ఈ రిజ ర్వాయర్ పూర్తయితే గ్రావిటీ ద్వారా నల్గొండ జిల్లాలోని ఆయకట్టుకు సా గునీరు అందించేందుకు అవకాశం కలుగుతుంది.

    రెవెన్యూ ఆదనపు క లెక్టర్ జే. శ్రీని వాస్ ,దేవరకొండ ఆర్ డిఓ రమ ణారెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ భద్రు, ఎ గ్జిక్యూటివ్ ఇంజనీర్ నెహ్రూ, నా యక్ ,డిఈ రాములు, ఏఈ ఈ భా స్కర్ రావు, శ్రవణ్, సతీష్ తదితరు లు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.