Revanth Cabinet Decision : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుం డా సర్వత్రా ఆసక్తికరంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేనట్లే కనబడు తోంది. గడిచిన రెండు మూడు నెల లుగా రేపు మాపు అంటూ ఉ త్కం ఠ భరిత వాతావరణాన్ని నెలకొ ల్పుతోన్న స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం కావడం తేలిపోవ డంతో ఆశావాహులు ఉసూరు మం టున్నారు.ఎన్నికలకు సంబంధించి ఒక అడుగు ముందుకు పడితే నా లుగు అడుగులు వెనకకు పడడం ఇటీవల కాలంలో సర్వసాధారణ మైంది.ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిం చ తలపెట్టిన ప్రజాపాలన వారోత్స వాలు పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ మంత్రివర్గ సమావేశం తీర్మానించడంతో మళ్లీ ఆ గమ్య గోచర పరిస్థితి నెలకొంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సా హం చూపుతోన్న ఆశావాహుల్లో నిరుత్సాహం నిలువెల్లా నిండిదంటే అతిశయోక్తి కాదు.
తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజాపాల న వారోత్సవాలు నిర్వహించాలని సోమవారం జరిగిన మంత్రివర్గ స మావేశంలో నిర్ణయించారు. ఈ వారోత్సవాలలో ప్రజల నుండి దర ఖాస్తులు స్వీకరించడం, ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన క ల్పించడం వంటి కార్యక్రమాలు చే పట్టే అవకాశం ఉందని, అందుకే ప్రజాపాలన వారోత్సవాల తర్వాతే ఎన్నికల నిర్వహించేందుకు ప్ర భు త్వం పథకం ప్రకారం ఆ తర్వాతే ఎన్నికలు అంటూ నిర్ణయం తీసుకో వడం పట్ల రాజకీయ పరిశీలకులు పెదవి విరుస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికే ష న్ విడుదలై తెలంగాణలోని స్థా నిక సంస్థల పదవీకాలం ఇప్పటికే ముగి యడంతో ఎన్నికల నిర్వహణ అని వార్యంగా మారిన విషయం విధిత మే. ఇప్పటికే ఎన్నికలకు సంబంధిం చి ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే రిజర్వేషన్ల పెంపు సరికా దంటూ హైకోర్టు ఆ నోటిఫికేషన్ను కొట్టేసిన విషయం కూడా తెలిసిందే. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ఇటీవల ప్రభుత్వం బీసీలకు రిజర్వే షన్లను పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చే సింది. దీనికి అనుగుణంగా ఎన్నిక ల సంఘం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎ న్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే రిజర్వేషన్లు 50శాతానికి మించడానికి వీలు లేదంటూ హైకో ర్టు వాటిని కొట్టేసింది.
తెలంగాణ హైకోర్టు నిర్ణయంతో స్థా నిక ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. అయితే మరోవైపు ఈ నె ల 24లోగా ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని హైకోర్టు ప్రభు త్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కేబినెట్ డిసెంబర్ 9 త ర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహిం చాలని నిర్ణయించడం గమనార్హం. మరోవైపు గ్రామాల్లో ఇప్పటికే ఎన్ని కల సందడి మొదలైంది. ఆశావా హులు ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ప్రస్తుత కేబినెట్ ని ర్ణయంతో డిసెంబర్లో స్థానిక ఎన్ని కల షెడ్యూల్ విడుదలకు ప్రభు త్వం సిద్ధమవుతుందన్న సంకేతా లు వెలువడుతున్నాయి.
