Monday, September 28, 2026
More
    HomePoliticsChairman Srinivas Goud : బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ అల్టిమేటం, అప్పటి...

    Chairman Srinivas Goud : బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ అల్టిమేటం, అప్పటి వరకు ఎ న్నికలాపకపోతే అగ్గిపుట్టిస్తాం

    📰 Generate e-Paper Clip

    –బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్ష ణ కల్పించే వరకు ఆగాల్సిందే

    — రాహుల్ గాంధీ మాటలు తెలం గాణ లో నీటిమూటలయ్యాయి

    –ఎన్నికలు జరుపాలంటున్న కాం గ్రె స్, బిజెపి ఇద్దరు బీసీ వ్యతిరేకులే

    –బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు రా ష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

    Chairman Srinivas Goud : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన 42 శాతం బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ క ల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, అప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృ త్వం లో అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధాని నీ కలిసి బీసీ రిజర్వేషన్లపై ఒత్తిడి పెంచాలని, డిసెంబరు మొదటి వా రం నుండి జరిగే పార్లమెంట్ సమా వేశాలను వేదికగా చేసుకుని కేంద్రం పై రాష్ట్రం పోరాటం చేయాలని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీని వాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు.బుధవారం హైద రాబాదులోని లోయర్ ట్యాంక్ బం డ్ వద్ద ఉన్న డాక్ట ర్ బి.ఆర్ అంబే ద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బిసి జేఏసి అధ్యర్వంలో మెరుపు ధర్నాకుదిగా రు.

    ఈ ధర్నాకు ముఖయఅతిథిగా బిసి జే ఏ సి వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీని వాస్ గౌడ్, సంఘీభావంగా మాజీ స్పీకర్, టిఆర్ఎస్ శాసనమండలి ఫోర్ లీడర్ సిరికొండ మధుసూదన చారి హాజరు కాగా, బిసి జేఏసీ చీప్ కో ఆర్డినేటర్ గుజ్జా కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ జేఏసీ కోఆర్డి నేట ర్ కుల్కచర్ల శ్రీనివాస్ ముది రాజు, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అ ధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీ సీ యువజన సంఘం జాతీయ అ ధ్యక్షులు కనకాల శ్యాంకుర్మా మా ట్లాడారు.

    ఈ సందర్భంగా మొదటగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రె స్ అగ్ర నేత రాహుల్ గాంధీ మాట కు రాష్ట్రంలో విలువ లేకుండా పో యిందని, కులగన జరిగి ఎవరి వా టా వారికి దక్కాలన్న రాహుల్ గాం ధీ మాటలు తెలంగాణలో ఆచరిం చడం లేదన్నారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షులు రా మచంద్రరావులు బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించే బాధ్యత ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా విస్మ రించి, బిసి డిమాండ్ లకు పూర్తి వ్య తిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహించాలని డి మాండ్ చేయడం చాలా సిగ్గుచేట న్నారు

    కాంగ్రెస్, బిజెపి పార్టీలు పార్టీ పరం గా బీసీలకు 42 శాతం ఇస్తామని ప్ర కటించడాని బీసీ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, రాజకీయ పార్టీ లు ఇచ్చే బిచ్చం బీసీలకు వద్దని, ని జంగా బీసీల పై చిత్తశుద్ధి ఉంటే రా జ్యాంగ బద్ధమైన 42 శాతం వాటా ఇచ్చి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని సవరించి బీ సీ రిజర్వేషన్లు పెంచే వరకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉదృతం చేశామని, ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమా లు బీసీ శ్రేణులు నిర్వహించాయని, 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధిం చే వరకు బీసీల పోరాటాన్ని ఆపేది లేదని ఆయన తేల్చి చెప్పారు.

    మాజీ స్పీకర్, టిఆర్ఎస్ శాసనమం డలి పార్టీ ఫ్లోర్ లీడర్ సిరికొండ మ ధుసూదనాచారి మాట్లాడుతూ ప్ర జాస్వామ్యంలో ఎవరి వాటా వారికి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పై ఉన్నప్పటికీ, కాంగ్రెస్ బిజెపి పార్టీ లు లోపాయీకరంగా బీసీ రిజర్వేష న్లను ఆట కెక్కించి బీసీలను పచ్చి మోసం చేశాయని ఆయన దుయ్య బట్టారు

    కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీల కు 42 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ పెంచుతామంటే కసాయిని గొర్రెను నమ్మినట్టు బీసీలు కాంగ్రెస్ ను నమ్మి ఓటేసి గెలిపిస్తే, అధికారం లోకి వచ్చిన తర్వాత పార్టీ పరంగా ఇస్తామని చెప్పడం ఎంతవరకు స మంజసం అని ప్రశ్నించారు. బీసీ జేఏసీ చేస్తున్న ఉద్యమానికి ఒక బీ సీ బిడ్డగా తాను సంపూర్ణంగా అం డగా ఉంటానని కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాల మెడలో వంచి బీసీ రిజర్వేష న్లు సాధించేవరకు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని మధు సూదనా చారి సూచించారు.

    ఈ ఆందోళన కార్యక్రమంలో గం గ పుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ది టి మల్లయ్య, సంచార జాతుల సం ఘం అధ్యక్షులు వీరస్వామి, నంద గోపాల్, ఈడిగ శ్రీనివాస్ గౌడ్, పల్ల పు సమ్మయ్య, జాజుల లింగ గౌడ్, జోర్రీగల శ్రీనివాస్, భూదాని సదా నందం, దాస తారకేశ్వరి, కే గౌతమి, నరసింహ నాయక్, బూడిద మ ల్లి కార్జున యాదవ్, పానుగంటి విజ య్ గౌడ్, శివమ్మ, ఉదయ్ నేత, మ హేష్ మేరు, నర సింహ చారి, శ్రీని వాసచారి, లచ్చగౌడ్, వెంకటేష్, గ జ్జల సత్య గౌడ్, గంగిరెద్దుల నరసిం హ తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.