Union Minister Pralhad Joshi : ప్రజా దీవెన, నల్లగొండ: ఆహార భ ద్రతలో భాగంగా దేశంలోని 80 కో ట్ల మంది పేద ప్రజలకు ప్రతినెల 5 కిలోల ఉచిత బియ్యాన్ని ఇస్తున్న ట్లు కేంద్ర ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, ప్ర జా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు.గురువారం అయన నల్గొండ జిల్లా కేంద్రంలోనూతనంగా నిర్మించిన భారత ఆహార సంస్థ డి విజనల్ కార్యాలయాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భాన్ని పురస్కరిం చుకొని ఏర్పాటు చేసిన సమావేశం లో కేంద్ర మంత్రి మాట్లాడారు.
కోవిడ్ మహావిపత్తులో ఏ ఒక్కరూ ఆకలితో చనిపోకూడదన్న ఉద్దేశం తో ఆహార భద్రత కింద పేదలంద రికి 5 కిలోల చొప్పున 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నా మని ,ఇది 2030 వరకు ఇది కొన సాగించాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించినట్లు తెలిపారు. ప్రపంచంలో ఏ దేశంలో ఇంత పెద్ద మొత్తంలో పేదలకు ప్రతినెల 5 కి లోల బియ్యం ఇవ్వటం లేదన్నా రు. ఆస్ట్రేలియా,జర్మనీ యూరోపి యన్ దేశాలలో సైతం ఇలాంటి ప ద్ధతి లేదని, భారత ప్రజా పంపిణీ వ్యవస్థను చూసి ఇతర దేశాలు ఆ శ్చర్యపోతున్నాయని, ప్రపంచంలో నే భారత ఆహార భద్రత పథకం మోడల్ గా తీసుకురావడం జరిగిం దని వెల్లడించారు.
ప్రపంచ బ్యాంకు సైతం ఇటీవల ని వేదికలో భారత దేశంలో అత్యంత ఎక్కువ మందికి ఆహార భద్రత కిం ద ఉచిత ఆహారం పంపిణీ చేస్తున్న విషయాన్ని పేర్కొన్నట్లు వెల్లడిం చారు.ధాన్యం సేకరణ పై కేంద్ర మం త్రి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా రెండు కోట్ల 50 లక్షల మె ట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నా మని, ప్రస్తుతం 915 లక్షల మెట్రిక్ టన్నుల నిలువ సామర్థ్యం దేశంలో ఉందని, తెలంగాణతో కలిపి 2023 – 24 సంవత్సరంలో 2.25 లక్షల కో ట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలలో జమ చే సిందని తెలిపారు. ప్రతినెల తెలం గాణకు 1.11 లక్షల మెట్రిక్ టన్ను ల ఆహార ధాన్యాలను కేటాయిస్తు న్నామని,1 లక్ష మెట్రిక్ టన్నుల బి య్యం, 3370 మెట్రిక్ టన్నుల గో ధుమలను కేటాయిస్తున్నట్లు తెలి పారు.
ఆహార భద్రత వ్యవస్థను పటిష్టం చే సేందుకు రేషన్ కార్డులన్నిటిని డి జి టలైట్ చేయడం జరిగిందని తెలి పారు.నల్గొండ జిల్లా ధాన్యం ఉ త్ప త్తి, ధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రంలోనే ప్రముఖ పాత్ర పోషిస్తు న్నదని, ప్రస్తుతం నూతనంగా ప్రా రంభించిన ఎఫ్ సి ఐ డివిజనల్ కా ర్యాలయ ఆవరణలో ఉన్న గోదాం లో 62 వేల మెట్రిక్ టన్నుల నిలువ సామర్థ్యం ఉందని, ప్రభుత్వం భూ మి ఇస్తే మరో ఎఫ్‌సిఐ గోదామును నల్గొండ జిల్లాలో ప్రారంభించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించా రు. 2014 -15 నుండి తెలంగాణ లో ధాన్యం సేకరణను 600% పెం చినట్లు చెప్పారు.
ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ద్రవ్య వ ల్బణంతో బాధపడుతున్నాయని, ఇండియాలో కేవలం 25 శాతం మా త్రమే ఉందని,పియం సూర్య ఘర్ ముక్త్ బిజిలి పథకం కింద 20175 ఇండ్లకు 20 వేల కోట్లరాయితీ తో ప థకాన్ని అమలు చేయడం జరిగింద ని తెలిపారు.రైతులు వరి వైపే కా కుండా ఆయిల్ సీడ్స్ ,వాణిజ్య పం టలు పండించాలని కోరారు. కోవిడ్ సమయంలో ప్రజా పంపిణీ వ్యవస్థ కు సంబంధించి తెలంగాణకు రావా ల్సిన సబ్సిడీ 343 కోట్ల రూపాయ ల బకాయిలను వెంటనే విడుదల చేస్తామని చెప్పారు.అలాగే సిఎం ఆర్ డెలివరీకి సంబం ధించి 10 సం వత్సరాల నుండి పెండింగ్‌లో ఉన్న 1 400 కోట్ల రూపాయల మంజూరు కు సరైన రికార్డులు సమర్పిస్తే పరి శీ లించి వాటిని కూడా మంజూరు చే స్తామని తెలిపారు.
రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుద ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాని కి 2024- 25 సంవత్సరానికి సం బంధించి బాయిల్డ్ రైస్ లక్ష్యాన్ని పెంచాలని, పదేళ్ల నుండి పెండింగ్‌లో ఉన్న 1400 కోట్ల రూపాయలను సీ ఎంఆర్ బకాయిలు చెల్లించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధిం చి సబ్సిడీ 343 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని, 202 4- 25 ఖరీఫ్ సీఎంఆర్ డెలివరీ కా లపరిమితిని 60 రోజులు పెంచాల ని, 24 -25 సంబంధించి యసంగి 120 రోజులకు పెంచాలని, తెలంగా ణకు అదనపు రేక్ ల సౌకర్యాన్ని క ల్పించాలని, దీనివల్ల రైసు మూ మెంట్ కు సులభం అవుతుందని, 2025- 26 కు సంబంధించి ధాన్యం సేకరణ టార్గెట్ ను 80 లక్షల మెట్రి క్ టన్నుల నుండి పెంచాలని, ప్రస్తు త ఎఫ్‌సిఐ గోదాంలో లక్ష మెట్రిక్ ట న్నుల సామర్థ్యం వరకు పెంచాలని కోరారు.
దేశంలో తెలంగాణ ఖరీఫ్‌లో 150 ల క్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పం డించిందని, 80 లక్షల మెట్రిక్ ట న్నులు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్నదని, ఇ దివరకే 29 వేల కోట్ల రూపాయల ను ధాన్యం కొనుగోలుపై ఖర్చు చే యడం జరిగిందని ,రైతులు పండిం చిన చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో 8800 ధా న్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిం చామని, ఆహార భద్రత కింద ప్రతి ఒక్కరికి 6 కిలోల నాణ్యమైన స న్న బియాన్ని ఇస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లా బత్తాయి పంటకు ప్రసిద్ధి చెందింద ని, అందువల్ల జిల్లాలో 2500 మెట్రి క్ టన్నుల సామర్థ్యం కలిగిన బత్తా యి కోల్డ్ స్టోరేజ్ మంజూరు చేయా లని, ధాన్యానికి సంబంధించి ప్రైవే టు ప్రభుత్వ భాగస్వామ్యంలో లక్ష మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదామును మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. నల్గొండ పా ర్లమెంట్ సభ్యులు కుందూరు రఘు వీర్ రెడ్డి ,భారత ఆహార సంస్థ ఈ డి వనిత శర్మ మాట్లాడారు.
ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జిల్లా కలె క్టర్ ఇలా త్రిపాఠి, రెవెన్యూ అద న పు కలెక్టర్ జె.శ్రీనివాస్, భారత ఆ హార సంస్థ జిల్లా మేనేజర్ రాజు, ఎ ఫ్సిఐ అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



