GHMC Merger Decision : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గా ణ కోర్ అర్బన్ ప్రాంతం పరిధిలో ఉ న్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించిం ది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం పలు కీ లక నిర్ణయాలు తీసుకుంది.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల, బయట ఓఆర్ఆర్‌ను ఆనుకొని ఉన్న మొ త్తం 27 అర్బన్ లోకల్ బాడీస్ (ము న్సిపాలిటీలు, కార్పొరేషన్లను) జీహె చ్ఎంసీలో విలీనం చేసేందుకు మం త్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందుకోసం జీహెచ్ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపల్ చట్టాలకు అవసరమైన సవరణలు చేయాలని నిర్ణయించింది.మంత్రిమండలి నిర్ణ యాలను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి , జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా కు వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రుల వ్యాఖ్య లు వారి మాటల్లోనే…హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కే బుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం. GHM C పరిధిలో అండ ర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకు దాదాపు రూ. 14, 725 కోట్ల ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచ నా. నగరంలో విద్యుత్ సర్కిళ్ల వారి గా మూడు విభాగాలుగా ఈ ప్రా జెక్టు చేపట్టాలి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఎన్పీడీ సీ ఎల్, ఎస్పీ డీసీఎల్ (NPDCL, SP DCL) రెండు డిస్క మ్‌లతో పాటు కొత్తగా మూడో డి స్కమ్ ఏర్పాటు. రాష్ట్రంలోని వ్యవ సాయ విద్యుత్ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగే షన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సుర క్షిత మంచి నీటి పథకాలు, హైదరా బాద్ మెట్రో వాటర్ సప్లయ్ సీవరేజ్ బోర్డ్ పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కమ్ పరిధిలోకి వస్తాయి.
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డి మాండ్, రాబోయే పదేండ్లకు అవస రమయ్యే విద్యుత్ సరఫరా, ఉత్ప త్తి అంచనాలను పరిగణలోకి తీసు కుని పునరుత్పాదక విద్యుత్ విని యోగం పెంచేందుకు కేంద్ర ప్రభు త్వం తెచ్చిన నిబంధనల ప్రకారం, రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచాలని నిర్ణయం.
అందులో భాగంగా 5 ఏళ్ల కాలపరి మితి ఒప్పందాలతో 3 వేల మెగా వాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు వీలైనంత తొందరగా టెండర్లు పిల వాలి. సోలార్ పవర్ తరహాలోనే పంప్డ్ స్టోరేజ్ పవర్ వినియోగం పెం చడానికి 5 ఏళ్ల కాలపరిమితి ఒ ప్పందాలతో 2 వేల మెగావాట్ల పం ప్డ్ స్టోరేజీ పవర్ కొనుగోలుకు టెండ ర్లు పిలవాలి.
పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్లను నెలకొ ల్పేందుకు ముందుకు వచ్చే కంపెనీ లు, పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు ఆమోదం. ఇప్పటికే డిస్కమ్‌ల వద్ద ఉన్న ఎంఓయూల ను కూడా పరిశీలించాలనినిర్ణయం.
రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాల ని నిర్ణయం. అందుకు ఆసక్తిని వ్యక్తీ కరించే కంపెనీలకు అవసరమైన భూమి, నీటిని ప్రభుత్వం కేటాయి స్తుంది. ఈ ప్లాంట్లలో ఉత్పత్తి చేసే విద్యుత్‌ను ముందుగా రాష్ట్ర డిస్క మ్‌లకే అమ్మాలనే షరతుతో ప్ర భు త్వం ఒప్పందం చేసుకుంటుంది.
రాష్ట్రానికి వచ్చే కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ లో కొత్త పరిశ్రమలకు అవసరమైన విద్యు త్తును సొంతంగా ఉత్పత్తి చేసు కు నేందుకు అవకాశం కల్పించడం.
కొత్త పరిశ్రమలు క్యాప్టివ్ పవర్ జన రేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే వెం టనే అనుమతి ఇవ్వాలి. ఇందులో విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యానికి సం బంధిత ఎలాంటి గరిష్ఠ పరిమితి లే దు.
రామగుండం థర్మల్ పవర్ స్టేషన్‌లో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్‌ను ఎన్టీపీసీ అధ్వర్యంలో చేపట్టాలి. పాల్వంచ, మక్తల్‌లోనూ ఎన్టీపీసీ అధ్వర్యంలో విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశా లను పరిశీలించాలి.భద్రాద్రి కొత్త గూడెం జిల్లా దుమ్ముగూడెం మండ లం పెద్ద నల్లబెల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ బీసీ యంగ్ ఇండియా ఇంటిగ్రే టేడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మా ణానికి 20.28 ఎకరాల ప్రభుత్వ స్థల కేటాయింపు.
ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామం లో స్పోర్ట్ స్కూల్ ఏర్పాటు చేసేం దుకు 40 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు. రాష్ట్రంలో 56 ఏటీసీ లకు అదనంగా జూబ్లీహిల్స్‌తో పా టు రాష్ట్రంలో కొత్తగా 6 ఐటీఐలను ఏటీసీలుగా మార్పు.


