Monday, September 28, 2026
More
    HomePoliticsSP Sharath Chandra Pawar : నల్లగొండఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక సూచన,చలికాలం పొగమం...

    SP Sharath Chandra Pawar : నల్లగొండఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక సూచన,చలికాలం పొగమం చుతో డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలి 

    📰 Generate e-Paper Clip

    SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన,నల్లగొండ బ్యూరో:చలి కాలం తీవ్రత పెరగడంతో రోడ్లపై పొ గమంచు ఘనంగా ఏర్పడుతోంది. దీనివల్ల వాహనాలు, పాదచారు లు, జంతువులు, రోడ్డు సిగ్నల్స్ స్ప ష్టంగా కనిపించక ప్రమాదాల ప్రమా దం ఎక్కువగా ఉన్నట్టు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ముందున్న వాహనాల దూరం అం చనా వేయడంలో కూడా డ్రైవర్లు ఇ బ్బంది పడే అవకాశముందని చె ప్పారు. ప్రమాదాలను నివారించడా నికి డ్రైవర్లు పాటించవలసిన ము ఖ్య జాగ్రత్తలు ఎస్పీ సూచించారు. ప్రమాదాల నివారణకు డ్రైవర్లు పా టించాల్సిన సూచనలు ప్రయాణం ప్రారంభం ముందుగానే చేయండి

    పొగమంచు వల్ల ప్రయాణంలో ఆల స్యం కావచ్చు కాబట్టి ముందుగానే బయలుదేరి, తొందరపడకుండా డ్రై వ్ చేయాలన్నారు.

    అతివేగం, ఓవర్‌టేకింగ్‌ ను నివారిం చండి, తక్కువ విజిబిలిటీ కారణం గా ఓవర్‌టేక్ చేయడం ప్రమాదక రమని, వేగం కొద్దిగా తగ్గించాలని, హై బీమ్ కాకుండా లోబీమ్ లైట్లు ఉపయోగించండని సూచించారు. హై బీమ్ కాంతి పొగమంచులో ప్రతి బింబించి ముందు కనిపించనం దు న ఫాగ్ లైట్లు ఉంటే తప్పనిసరిగా ఆన్ చేయాలని, ముందున్న వాహ నంతో సురక్షిత దూరం పాటించాల ని సడన్ బ్రేక్ వేసినప్పుడు ఢీ కొట్టే ప్రమాదం తగ్గుతుందని చెప్పారు.

    లేన్ క్రమశిక్షణను పాటించండిలేన్ మార్చడం తగ్గించాలని, సరిగ్గా లైన్ల లో నడపడం విజిబిలిటీ లోపాన్ని తగ్గిస్తుందని, వాహనం కిటికీలు కొ ద్దిగా దించండి దీంతో అద్దాలపై మ బ్బు కూరుకుపోవడం తగ్గి,డ్రైవర్‌కు దృశ్యం స్పష్టంగా కనిపిస్తుందన్నా రు. పొగమంచు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాసేపు ఆగండి ముందు న్న వాహనాలు, రోడ్డు స్పష్టంగా కని పించకపోతే డ్రైవ్ చేయకుండా ఆ గి, పరిస్థితి మెరుగుపడిన తరువా త ప్రయాణం కొనసాగించాలన్నా రు. అద్దాలు, వైపర్లు శుభ్రంగా ఉం చండి డిఫ్రాస్టర్, వైపర్‌లను వాడు తూ ముందు మరియు వెనుక అద్దా లను క్లియర్‌గా ఉంచాలి.వేళ్ల ముం దే ఇండికేటర్లు ఇవ్వండి, మలుపు తీసేవేళ లేదా లేన్ మార్చే సమ యంలో వెనుక వాహనాలకు సిగ్న ల్ ముందుగానే ఇవ్వాలన్నారు.

    సడన్ బ్రేక్‌లు వేయకండి చలికాలం లో రోడ్లు తడిగా ఉండడం వల్ల వా హనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంటుందని, బ్రేక్‌లను నెమ్మదిగా అ ప్లై చేయాలని, చలి కాలంలో ప్రతీ డ్రైవర్ ఈ సూచనలను తప్పనిసరి గా పాటిస్తే ప్రమాదాలను గణనీ యంగా తగ్గించవచ్చని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.