Minister Komati Reddy : ప్రజా దీవెన,దేవరకొండ: రాష్ట్రంలో పేద ప్రజలకు బాసటగా నిలిచే ప్ర భుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డి నాయకత్వంలో మా పాలన సా గుతుందనీ, కొడంగల్ లాగానే వెను కబడిన దేవరకొండను దత్తత తీసు కోవాలని, ఎమ్మెల్యే బాలు నాయక్, తాను కలిసి ముఖ్యమంత్రిని కో ర తామని రాష్ట్ర రోడ్లు భవనాలు, సి నిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రె డ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 6న నల్ల గొండ జిల్లా దేవరకొండలో ప్రజా పాలన ప్రజావిజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమం త్రి ఏ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప లు అభివృద్ధి పనుల శంకుస్థాప న జరగనుందని రాష్ట్ర రోడ్లు భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించా రు.గురువారం ఆయన నల్లగొండ జిల్లా దేవరకొండలో స్థానిక ఎమ్మె ల్యే బాలునాయక్ తో కలిసి బహి రంగ సభ ప్రాంగణాన్ని పరిశీలిం చా రు. హెలిప్యాడ్ నిర్మాణంతో పాటు, సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రజలు కూర్చునేందుకు సరిప డా కుర్చీలు,వచ్చిన వారికి త్రాగునీ రు లాంటి కనీస ఏర్పాట్లు అన్ని పక డ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. మెయిన్ డయాస్ తో పాటు సభ కోసం చేస్తున్న తాత్కాలి క నిర్మాణ ఏర్పాట్లలో పలు సూచన లు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా దేవరకొండ ప ర్యటన విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మం త్రి పిలుపునిచ్చారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనీ 12ని యోజకవర్గాల్లో అత్యంత వెనుకబ డిన ప్రాంతం దేవరకొండ అని మం త్రి పేర్కొన్నారు. ఈనెల 6న ప్రజా పాలన,ప్రజా విజయోత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ది పనులకు శంకుస్థా పన చేస్తారనీ పేర్కొన్నారు.ప్రజా ప్ర భుత్వం ప్రజల శ్రేయస్సు కోసం పని చేస్తున్నదనీ,గత ప్రభుత్వ నిర్లక్ష్యం తో తండాలలో అభివృద్ధి కుంటుప డిందనీ, కనీసం మంచినీళ్లు ఇవ్వలే దనీ మండిపడ్డారు. కమిషన్ల కోసం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పై పెట్టిన శ్రద్ధలో కొంచెం పెట్టిన SLBC పూర్త య్యేదని అన్నారు. 10ఏళ్లు పట్టిం చుకోలేదని,ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో SLBC పనులు తిరిగి ప్రా రంభించామని తెలిపారు.
దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగి 8మంది ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. అత్యంత అధునాతన టెక్నాలజీతో SLBC సొరంగం నిర్మాణ పనులు పూర్తి చే సి నిర్ణీత గడువులోగా గ్రావిటీ ద్వా రా నల్లగొండకు నీటికి తీసుకువస్తా మని చెప్పారు. నక్కల గండి,దిండి ప్రాజెక్టులు పూర్తి చేసి కృష్ణా నీటిని నింపుతామని,భూగర్భ జలాలు పెంచుతామని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకుం టున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకున్నా కోటి 50లక్షల మెట్రిక్ టన్నుల ధా న్యాన్ని పండించామన్నారు. సుం దిల్ల,అన్నారం,మేడిగడ్డ లో నీటిని నిల్వ చేస్తే కూలిపోయే ప్రమాదం ఉందని NDSA తెలిపిందని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.అంతే కాకుండా బిఆర్ఎస్ హయాంలో క నీసం రేషన్ కార్డు ఇవ్వాలన్న మన సు వారికి రాలేదనీ,మేము హామీ ఇ వ్వకున్న మేము రేషన్ కార్డుతో పా టు సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు
ఒకే ప్రాంగణంలో 3వేల మంది వి ద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణా లతో విద్యను అభ్యసించేలా ఒక్కో నియోజకవర్గంలో 200 కోట్లతో రా ష్ట్ర వ్యాప్తంగా 20వేల కోట్లతో యం గ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షి యల్ స్కూల్స్ లాంటి గొప్ప కార్యక్ర మాలు చేపడుతున్నామని అన్నా రు.మహిళా సాధికారత కోసం ప్రభు త్వం కృషి చేస్తోందని అన్నారు. మ హిళల ఉచిత బస్సు ప్రయాణం కో సం ప్రభుత్వం ఇప్పటి వరకు ఆర్టీసీ కి రూ. 8వేల కోట్లు చెల్లిందన్నారు.

