–ఎంబీఏ ఓరియంటేషన్ కార్యక్ర మంలో వక్తలు
MBA Orientation Program : ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఎంబీఏ లో నూతనంగా చేరిన విద్యార్థుల కు, ప్రోగ్రాం ఉద్దేశాలు అవకాశాలపై అవగాహన పెంపు కొరకు ఓరియం టేషన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి వక్తలుగా ఉస్మాని యా విశ్వవిద్యాలయ పూర్వ ఆచా ర్యులు సూర్యనారాయణ, ప్రము ఖ మోటివేషనల్ స్పీకర్ మరియు కార్పొరేట్ ట్రైనర్ వేముగంటి ర మేష్ హాజరై విద్యార్థులను ఉద్దేశిం చి ప్రసంగించారు.
తరగతి గది నుండి కార్పొరేట్ రం గం వైపు అనే అంశంపై వేముగంటి రమేష్ మాట్లాడుతూ విద్యార్థులకు ఉచ్చుకతను మరియు ఆసక్తిని కలి గించే ప్రశ్నలను ఇవ్వడం ద్వారా స్వీ య అధ్యయనం, పరిశీలన పెంపొందించవచ్చన్నారు. నిత్య వి ద్యార్థులుగా పుస్తక పఠనంతో పా టు సామాజిక అంశాలను నిశి తం గా పరిశీలించడం అధునాతన సాం కేతికతను అంది పుచ్చుకొని ముం దుకు సాగాలన్నారు.
కృత్రిమ మేధ పరిజ్ఞానం పెం పొం దించుకుంటూ, వ్యక్తీకరణ సా మ ర్థ్యాన్ని పెంచుకుంటూ ఉన్నత ల క్ష్యాలను అదిరోహించాలని సూ చించారు.అనంతరం పూర్వ ఆచా ర్యులు ఏ సూర్యనారాయణ, ఓ యూ మాట్లాడుతూ అభ్యసనం జీవితకాల జరగాల్సిన ప్రక్రియ అ ని, సమయపాలన మరియు విమ ర్శలను అవకాశాలుగా మలుచు కుంటూ, విద్యార్థులు నూతన ఆవి ష్కరణలపై దృష్టి సారిస్తూ ముం దు కు నడవాలని సూచించారు. అనం తరం వివిధ విభాగాల అధి కారులు ఎంబీఏ లోని అంశాలను విద్యార్థు లకు వివరిస్తూ విశ్వవిద్యా లయం లోని విద్యార్థులకు గల సదు పా యాలు, అవకాశాలను వివరిం చారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సి పాల్ ఆచార్య శ్రీదేవి, విభాగ అధి పతి డా సబీనా హెరాల్డ్, ఆచా ర్య సరిత, ఆచార్య శ్రీ లక్ష్మీ, డా రమే ష్, డా శ్వేత, డా ప్రవళిక, డా లక్ష్మీప్రభ, డా అనురాధ, డా జ్యోతి, డా స్వప్న, డా హరీష్ కుమార్ తది తర అధ్యాపకులు అధికారులు పా ల్గొన్నారు.

