BIG BREAKING : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం పై తెలంగాణ స్పీకర్ నిర్ణయంపై స ర్వత్రా ఉత్కంఠ భరిత వాతావర ణం నెలకొంది. తెలంగాణలో మొ త్తంగా పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన విషయం విదితమే. అయితే నిన్నటి రోజున బుధవారం ఐదుగురు ఎమ్మెల్యేలు క్లీన్ చిట్ ఇ స్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు వె లువరించగా మరో ఐదుగురు ఎ మ్మెల్యేల భవితవ్యం పై మరికొద్ది సే పట్లో మలివిడత తీర్పు వెలువరిం చేందుకు రంగం సిద్ధమైంది.
ఐదుగురి ఎమ్మెల్యేల అనర్హత పిటి షన్లపై బుధవారం నిర్ణయం సుస్ప ష్టం చేసిన స్పీకర్ గురువారం మరో ఐదుగురు ఎమ్మెల్యేల భవితవ్యంపై నిర్ణయం ప్రకటించేందుకు తెలంగా ణ అసెంబ్లీ స్పీకర్ గడ్డంప్రసాద్ కు మార్ సిద్ధమవుతున్నారు. ఫిరా యింపు ఎమ్మెల్యేలలో మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీ నివాస్రెడ్డి, కాలె యాదయ్య, సంజ య్లపై తీర్పు ఇవ్వనుoడగా తమ అఫిడవిట్ సమర్పించని ఎమ్మెల్యే లు దానం నాగేందర్, కడియం శ్రీహ రి అనర్హత పిటిషన్లపై ఇంకా విచా ర ణ పూర్తి కాలేదని, అయినప్పటికీ మిగిలిన ముగ్గురితో పాటు ఈ ఇద్ద రి అనర్హతపై కూడా నిర్ణయం తీసు కునేందుకు సమాలోచనలు జరుపు తున్నట్లు సమాచారం. అయితే
స్పీకర్ నోటీసులకు జవాబు ఇచ్చేం దుకు కడియం శ్రీహరి, దానం నాగేం దర్ మరింత గడువు కోరినట్లు తె లుస్తోంది.
ఈ నేపద్యంలో ఐదుగురు ఫిరా యింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ తీర్పు పై అస్పష్టత కొనసాగుతోంది. తాజాగా ముగ్గురు ఎమ్మెల్యేల కేసు తో పాటు సమాధానం చెప్పని ఇద్ద రు ఎమ్మెల్యేల విషయంలో కూడా గురువారం జడ్జిమెంట్ ఇవ్వాలని స్పీకర్ నిర్ణయించుకున్నట్లు విశ్వస నీయవర్గాల ద్వారా తెలియవస్తోం ది. ఇప్పటి వరకు పిటిషనర్లకు స్పీక ర్ కార్యాలయం నుంచి మాత్రం ఎ లాంటి సమాచారం ఇవ్వలేదని కూ డా తెలుస్తుంది.
ఇదిలా ఉండగా ఇప్పటివరకు స మాధానం ఇవ్వని ఎమ్మెల్యే కడి యం శ్రీహరి స్పీకర్ నోటీసులకు బుధవారం రాత్రి వివరణ ఇచ్చా రని, ఈ క్రమంలో ఆయన ఇచ్చిన సమాధానంపై శుక్రవారం వరకు కౌం టర్ దాఖలు చేయాలని పిటిషనర్ వివేకానందగౌడ్కు నోటీసులు పం పారు. అయితే, ఎమ్మెల్యేల అనర్హ త పిటిషన్లపై రేపటితో సుప్రీంకోర్టు గడువు ముగియనున్న క్రమంలోనే మిగిలిన అందరి ఎమ్మెల్యేల కేసు లో శుక్రవారమే ఒకే దఫా తుదితీ ర్పు వెల్లడిద్దామన్న అభిప్రాయంతో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమా చారం.
