–కాంగ్రెస్ పార్టీ కేసులు, డబ్బు, గుం డాయిజం ప్రయోగించినా 40 శాతం పైగా సర్పంచ్ స్థానాలను గెలిచాo
— రైతులు ఎరువుల కోసం గోసప డుతుంటే యాప్‌లు, మ్యాప్‌ల పే రుతో డ్రామాలు ఆడుతున్నారు
–ప్రజలకిచ్చిన హామీలు ఎగ్గొట్టి మ నుమడి కోసం రూ. వందకోట్లతో ఫు ట్‌బాల్ ఆడిస్తారా
–ఓడిపోతామనే భయంతోనే రే వం త్ రెడ్డి కోపరేటివ్ ఎన్నికలు పెట్టడం లేదు
–రేవంత్ రేసింగ్ సీఎం కాదు, ఢిల్లీకి హైదరాబాద్‌కు చక్కర్లుకొట్టే ఫ్లయిం గ్ సీఎం
–వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే సర్పంచ్ ల బాధ్యత తీసుకుంటా
–సంగారెడ్డిసర్పంచ్ సన్మాన కార్యక్ర మoలోమాజీ మంత్రి హరీష్ రావు
Ex Minister Harish Rao : ప్రజా దీవెన, సంగారెడ్డి: ప్రపం చం లోనే రాజకీయాల్లో అబద్దాలు ఆడ డంలో నోబెల్ ప్రైజ్ ఇస్తే అది రే వం త్ రెడ్డికే ఇవ్వాలని,కాంగ్రెస్ పార్టీ 5 0 శాతంలోపే సర్పంచులు గెలిస్తే 6 6 శాతం గెలిచామని రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నాడని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ 10, 12 స్థానాలకు మించి గెలవదని ఆయ న జోస్యం చెప్పారు. ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ కావాలని ఎదురు చూస్తున్నారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని డబ్బులు పంచినా, గుండాయి జం చేసినా అద్భుతంగా ఎదిరించి గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచ్ లు, వార్డ్ మెంబర్లకు ఈ సందర్భం గా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గ పంచాయతీ ఎన్నికల్లో విజేతలకు జరిగిన సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసం గిం చారు.
ఈ సందర్భంగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..
ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ సత్తాను చాటాయి. కారు జోరు కాంగ్రెస్ బే జారు.ఎప్పుడైనా లోకల్ బాడీ ఎన్ని కల్లో అధికార పార్టీ 90 శాతం గెలిస్తే పది పైసలు ప్రతిపక్ష పార్టీలు గెలు స్తాయి.కానీ బీఆర్ఎస్ 40 శాతం అంటే 4వేలకు పైగా సర్పంచ్ స్థా నాలను గెలిచింది.
సంగారెడ్డిలో 34 సర్పంచులు గెలిస్తే అందులో 27 గెలిచామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడని, బీఆర్ఎస్ తర పున గెలిచిన సర్పంచులను కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకున్నారు రే వంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ముఖానికి ఎరువులు ఇచ్చే తెలివి లేదు. పంట పండాలంటే నీళ్లు కావాలి. కరెంటు కావాలి. ఎరువులు కావాలి.
రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అ ప్పులు కావాలి మ్యాపులు కావాలి అంటున్నాడు. ఎరువు బస్తాలు కా వాలంటే యాప్ లో కొట్టండి అంటు న్నాడు. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా నీ మొఖానికి వ్యవసాయం చేసావా రై తుల కష్టం మీకు తెలుసా. కేసీఆర్ హయాంలో కరెంటు ఫుల్లు. నీళ్లు ఫుల్లు. ఎరువులు ఫుల్లు.
రేవంత్ రెడ్డి వచ్చినంక రెండుసార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు, కరెంటు 1 4 గంటలు కూడా వస్తలేదు, ఎరు వుల కోసం లైన్ లో నిలబడి నిలబ డి గోసపడుతున్నారు.కేసీఆర్ ఉన్న ప్పుడు ఎరువుల లారీలను ఊర్లకే పంపి రైతులకు అందించాడు. రేవం త్ రెడ్డి వచ్చినంక ఎరువుల కోసం గంటల తరబడి లైన్ లో నిలబడా ల్సిన దుస్థితి. ఇప్పుడు కొత్తగా యా ప్ లో బుక్ చేసుకోవాలి అంటున్నా డు.
యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు. రెండు పంటల రైతుబంధు ఎగ్గొట్టిండు. రు ణమాఫీ సగం మందికి కూడా చేయ లేదు. మున్సిపాలిటీల టైం అయి పోయి సంవత్సరం అవుతున్నా ఎ న్నికలు పెట్టట్లేదు.జడ్పీటీసీ, ఎంపీ టీసీ ఎన్నికలు ఎందుకు పెట్టట్లేదు రేవంత్ రెడ్డి.రేవంత్ రెడ్డికి ఓడిపో తాననే భయం పట్టుకుంది.
కోపరేటివ్ ఎలక్షన్ పెట్టమంటే కూ డా కాంగ్రెస్ నాయకులను నామి నేట్ చేసుకుందామని జీవో ఇచ్చిం డు. రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే, నువ్వు రైతులకు మేలు చేసెటోడివే అయితే కోపరేటివ్ ఎన్నికలు పెట్టు.
ఎందుకు నామినేట్ చేస్తున్నావ్. ను వ్వు ఎరువులు ఇయ్యలేదు. ను వ్వు రుణమాఫీ చేయలేదు. రైతు బంధు ఎగ్గొట్టినవ్. బోనస్ డబ్బు లు ఇయ్యలేదు. పంటల బీమా చే యలేదు కనుక ఎలక్షన్ పెట్టట్లేదు.
మనం కూడా ప్రజల్లోకి పోదాం. ఎవ రికీ భయపడాల్సిన అవసరం లేదు. 15వ ఆర్థిక సంఘం డబ్బులు 85 శాతం ఢిల్లీ నుంచి గల్లికే వస్తాయి. రేవంత్ రెడ్డి, మంత్రులు ఆపలేరు. ఎమ్మెల్యే ఆపలేడు. డైరెక్ట్ సర్పం చుల ఎకౌంట్ లో పడతాయి. స ర్పంచ్ ఎంత పవర్ఫుల్ అంటే ఎ మ్మెల్యేకి చెక్ పవర్ లేదు. మంత్రికి చెక్ పవర్ లేదు. ముఖ్యమంత్రికి చె క్ పవర్ లేదు. కానీ గ్రామ సర్పం చ్ కు చెక్ పవరుంది.ధైర్యంగా పని చే యండి. త్వరలో గెలిచిన సర్పం చ్లకు శిక్షణ కార్యక్రమాలు పెడతాం.
సర్పంచ్ విధివిధానాలు, బాధ్య త లపై ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడదాం. ఏమున్నా రెండేళ్లే కాంగ్రెస్ ప్రభు త్వం ఉంటది. మీరు ఐదేళ్ల కోసం సర్పంచ్ గా గెలిచారు. మీ పద వీకాలంలో మల్ల మూడేళ్లు బీఆ ర్ఎస్ ప్రభుత్వంలోనే ఉంటారు.
మీరు ప్రజలకు ఇచ్చిన పనులు వీ లైనంతవరకి చేయండి. బీఆర్ఎస్ ప్రభుత్వం రాంగనే నేను దగ్గరుండి మీ పనులు చేయించే బాధ్యత నా ది. ప్రజలకు అందుబాటులో ఉం డాలి. తలలో నాలుకలా ఉండాలి.
ఓడిపోయిన వారికి భవిష్యత్తు ఉం టది. గెలిచిన వారికి బాధ్యత ఉం టుంది. ఎదిగిన కొద్దీ ఒదగాలి. ఓ పికతో ఉండాలి. నిన్నటి వరకు దం డం పెట్టి ఓటు అడిగి గెలువంగానే మారిపోకూడదు. మొన్న రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడిండు. రేవంత్ రె డ్డి.. ఆయన మనుమడు సోకు తీ ర్చుకోవడానికి 100 కోట్లు ఖర్చు పె ట్టి ఫుట్బాల్ ఆడిండు.
సింగరేణి కార్మికుల 10 కోట్ల డబ్బు ను ఫుట్బాల్ మ్యాచ్ కి పెట్టిండు. గవర్నమెంట్ ఖజానా నుంచి ఐదు కోట్లతో ఫుట్బాల్ గ్రౌండ్ కట్టుకున్నా డు సొంతంగా. నీ సొంత డబ్బుతో కట్టుకో రేవంత్ రెడ్డి. ప్రభుత్వ సొ మ్ముతో జల్సాలు చేయడం కాదు.
సింగరేణి సీఎస్సార్ డబ్బులతో కే సీఆర్ స్కూళ్లు కట్టించిండు. రోడ్లు ఏ పించిండు. మెడికల్ కాలేజీలు పె ట్టించిండు.
కొత్త జిల్లాలు చేయాలి. కొత్త మెడిక ల్ కాలేజీ చేయాలి. మండల కేంద్రా నికి రోడ్లు వేయాలని కేసీఆర్ పని చేసిండు. రేవంత్ రెడ్డి ఏమో అం దాల పోటీలు పెట్టాలి. ఫుట్బాల్ మ్యాచ్ ఆడాలి. గ్లోబల్ సమ్మిట్ పేరుతో సోకులు చేయాలి. ఢిల్లీకి హైదరాబాద్ కి చక్కర్లు కొట్టాలి.
కేసీఆర్ ప్రతిక్షణం నా తెలంగాణ ఎట్ల పైకి రావాలని తపనపడ్డాడు.
అందాల పోటీలతో, ఫుట్బాల్ పోటీ లతో మనకేమైనా వచ్చిందా, ఊర్ల లో వీధి దీపాలు పోతే చేయడానికి డబ్బులు లేవు. కేసీఆర్ గెలిచిన వెంటనే 200 ఉన్న పెన్షన్ ని 2000 చేసిండు. 4000 ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఉన్న 2000 కూడా స క్కగా ఇస్తలేడు.రేవంత్ రెడ్డి రేసింగ్ సీఎం కాదు ఫ్లయింగ్ సీఎం. యూ రియా కూడా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభు త్వం.


