Monday, September 28, 2026
More
    HomePoliticsCongress Leader Gummula Mohan Reddy : పదవొచ్చినా రాకపోయినా మంత్రి నాయకత్వంలో ఉత్సాహంతో పనిచేస్తా

    Congress Leader Gummula Mohan Reddy : పదవొచ్చినా రాకపోయినా మంత్రి నాయకత్వంలో ఉత్సాహంతో పనిచేస్తా

    📰 Generate e-Paper Clip

    — సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుమ్ముల మోహన్ రెడ్డి

    Congress Leader Gummula Mohan Reddy : ప్రజా దీవెన,నల్లగొండ :కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన యువ చైతన్య ర్యాలీ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నిం పడమే కాకుండా ప్రత్యర్థుల గుండె ల్లో దడపుట్టించిందని నల్గొండ పట్ట ణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ గుమ్ముల మోహన్ రెడ్డి అ న్నారు.

    సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువ చైతన్య కార్యక్రమానికి నల్గొండ నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా 3 వేల మందికి పైగా కాంగ్రెస్ శ్రేణులు హాజరయ్యారని తెలిపారు.

    ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. తనకు ఏ పదవి వచ్చినా రాకపోయినా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కోసం అదే ఉత్సాహంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. యువ చైతన్య ర్యాలీతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అపోహలు పూర్తిగా తొలగిపోయాయని పేర్కొన్నారు.

    కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేస్తున్నారని, ముఖ్యంగా యువకులు చురుకుగా ముందుకు వస్తున్నారని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో నల్గొండ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు.

    గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ అభ్యర్థులకు 60 శాతం సీట్లు కేటాయించగా, ఆ ఎన్నికల్లో పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు 70 శాతం కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించారని తెలిపారు. రానున్న స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఇదే ఉత్సాహంతో పనిచేసి అధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

    ఆర్టీసీ చైర్మన్ పదవి కోరుకున్నప్పటికీ అది దక్కకపోయినా, కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా తన రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని గుమ్ముల మోహన్ రెడ్డి తెలిపారు. బీజేపీ మాదిరిగా మతతత్వ రాజకీయాలు చేయమని, పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని స్పష్టం చేశారు.

    కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన యువ చైతన్య ర్యాలీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు.

    ఈ సమావేశంలో నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, ఆర్టీఏ డైరెక్టర్ కూసుకుంట్ల రాజిరెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు జహంగీర్ బాబా, మామిడి కార్తీక్, గాలి నాగరాజు, కంచర్ల ఆనంద్ రెడ్డి, కేవీఆర్ సతీష్, కొప్పు నవీన్, పిల్లి యాదగిరి, పెరిక మహేష్, రంజిత్, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.