Nalgonda SP Sharath Chandra Pawar: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజే స్తూ ఈ సంవత్సరం జిల్లా ప్రజలు శాంతి, భద్రత, ఆరోగ్యం, సుఖసం తోషాలతో ఉండాలని జిల్లా పోలీస్ శాఖ తరుపున ఆకాంక్షిస్తున్నట్లు జి ల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొ న్నారు.
గత సంవత్సరం జిల్లా ప్రజల సహకారంతో శాంతి భద్రతలను సమ ర్థవంతంగా నిర్వహించగలిగామని, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ ని ర్వహణ, మహిళలు మరియు పిల్లల భద్ర త, సైబర్ నేరాల నివార ణ, మత్తు పదార్థాల నియంత్రణ వంటి అంశా ల్లో ప్రజల సహకారం ప్రశంస నీయ మని తెలిపారు.
2026 సంవత్సరంలో ప్రజల ప్రాణా లు, ఆస్తుల రక్షణే పోలీస్ శాఖ ప్ర ధాన ధ్యేయంగా పనిచేస్తుందని తె లిపారు. నేరాల నివారణకు ముంద స్తు చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణకు విస్తృత బందోబ స్తు, మహిళ లు, వృద్ధులు, చిన్నారులు నిర్భయంగా జీవించే వాతా వరణం కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణలు అమలు చేయను న్నట్లు వెల్లడించారు. అలాగే, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై కఠిన చర్యలు, మత్తు పదార్థాల నియంత్రణకు ప్రత్యే క దాడులు, సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దే శించి ఆయన మాట్లాడుతూ చట్టాన్ని గౌరవించి పోలీస్ శాఖకు సహక రించాలని, మత్తు పదా ర్థాలు, అక్ర మ కార్యకలాపాలకు దూరంగా ఉం టూ నల్లగొండ జిల్లా ను డ్రగ్స్ రహిత జిల్లాగా రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్య తతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు, పోలీసుల సమ న్వయంతోనే శాంతియుత, సు రక్షిత సమాజాన్ని నిర్మించగలమని విశ్వాసం వ్యక్తం చేస్తూ, జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజల సేవ లో ఉంటుందని భరోసా ఇచ్చారు.
