సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, ప్రాజెక్టులను మార్చడం వల్ల లిఫ్టు లు, పంపులు పెరిగాయే తప్ప ప్రయోజనం లేదు
CmRevanthReddy : ప్రజా దీవెన, హైదరాబాద్: కృష్ణా, గోదా వరి నదీ జలాలపై తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడటంలో ఎక్క డా రాజీ పడేది లేదని ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశా రు. నీటి హక్కులను కాపాడుకో వ డంలో గతంలో జరిగిన తప్పిదా ల ను సరిదిద్దుకుంటూ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళు తోందని చెప్పారు. కృష్ణా, గోదావరి నదీ జలాలు, పెండింగ్ ప్రాజెక్టు లపై జ్యోతీరావు పూలె ప్రజాభవన్‌లో నీటి పారుదల శాఖ మంత్రి ఉ త్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్య క్రమంలో ముఖ్యమంత్రితో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సు ఖేందర్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సలహా దారులు, ఎంపీ లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు నీటి పారు ద ల శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ, కృష్ణా, గోదావరి బేసిన్లలో గ తంలో జరిగిన తప్పిదాలను సరిది ద్దడానికి ప్రభుత్వం నిబద్ధత, క్రమశి క్షణతో కార్యక్రమాలను చేపడుతుం దని తెలిపారు. నదీ జ లాల విష యంలో సమగ్ర సమాచారాన్ని శాసనసభ ముందు ఉం చనున్నట్టు చెప్పారు. నదీ జలాల్లో జరిగిన అ న్యాయాన్ని సరిదిద్దా లన్న ఆలోచన తో తప్ప రాజకీయ లబ్ది పొందాలన్న ఆలోచన లేద న్నారు.
కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీలను కేటాయించారని, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీకి 512 టీఎంసీ లు, తెలంగాణకు 299 టీఎంసీ చాలని అ ప్పటి ప్రభుత్వం అంగీక రించిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. అంతర్జాతీయ జల వివా దాల ఒప్పందాల ప్రకారం నది పరీవాహన ప్రాంతం మేరకు తెలంగా ణకు 71 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 29 శాతం మేరకు నీటి వాటా దక్కా ల్సి ఉండగా, గత ప్రభుత్వం హయాంలో అందుకు భిన్నంగా ఏపీకి 66 శాతం, తెలంగా ణకు 34 శాతం జలాలకు అంగీకరించారని చెప్పారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నీ టిని తీసుకునే పాయింటును జూ రాల నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్‌కు మార్చడం వల్ల తెలంగాణ కు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ప్రస్తు తం ఆంధ్రప్రదేశ్ 13 టీ ఎంసీ తరలి స్తుంటే, తెలంగాణ 2.5 టీఎంసీ మాత్రమే తీసుకోగ లుగుతుంది. ప్రాజెక్టు ను మార్చడం వల్ల లిఫ్టులు, పంపులు పెరిగా యే తప్ప ప్రయోజనం లే దన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కనీ సం 2.5 టీఎంసీ నీటిని తరలించే మౌలిక సదుపాయాలు కూడా తె లంగాణకు లేవన్నారు.
శాసనసభలో సమగ్ర సమాచారం అందిస్తామని, పాలమూరు – రం గా రెడ్డి ఎత్తిపోతల పథకం ఏడేండ్ల వరకు అసలు డీపీఆర్ సమ ర్పించకుండానే 27 వేల కోట్ల రూపాయ లు ఖర్చు చేశారని చెప్పా రు. డీపీఆ ర్ రూపొందించకపోవడంతో దానికి పర్యావరణ అను మతులు కూడా రాలేదని, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రా జెక్టు నిర్మిస్తున్నారని న్యాయస్థానాల్లో కేసులు వేశారని అన్నారు.
దాంతో అప్పటి ప్రభుత్వం పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు సాగు నీటి ప్రాజెక్టు కాదని, 7.15 టీఎం సీల సామర్థ్యంతో తాగునీటి కో సం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని సుప్రీంకోర్టు లో అఫిడవిట్ సమర్పిం చారని గుర్తుచేశారు. తెలంగాణ నీటి హక్కులను దక్కించుకోవ డా నికి గతంలోనే అనేక వేదికల్లో రాష్ట్ర వాదన బలంగా వినిపించాల్సి ఉండగా, గత పాలకులు ఆ పని చేయలేదని చెప్పారు. కృష్ణా, గో దావరి జలాల విషయంలో కొన్ని అపోహలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే శాసనసభ ముందు సమగ్ర వివరాల ను అందించబోతు న్నట్టు చెప్పారు. రాష్ట్రానికి కీలక మైన ఈ అం శాలపై చర్చ సందర్భంగా సభ్యులందరూ పాల్గొనాలని ముఖ్యమం త్రి కోరారు.
బిఆర్ఎస్ వల్లే తెలంగాణా న దీ జలాలకు మరణశాసనం....నదీ జలాశయాలలో తెలంగాణా రాష్ట్రానికి మరణశాసనమే బిఆర్ ఎస్ ప్రభుత్వం రాసిందని రాష్ట్ర నీ టిపారుదల, పౌర సరఫరాల శా ఖా మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.ఆంద్రప్రదేశ్ లో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్ తో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీ ఆర్ హాలయ్-బలయ్ చేసుకుని తె లం గాణా రాష్ట్ర నీటి ప్రయోజ నాలను ఆంద్రప్రదేశ్ కు తాకట్టు పెట్టిన ఘన త నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కే ద క్కుతుందని ఆయన దుయ్యబట్టారు.
రాయలసీమ ఎత్తిపోతల పధకం కోసమే పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల పధకం నీటి సామర్ధ్యాన్ని ఒక్క టి.యం.సి కి కుదించా రని ఆయన మండిపడ్డారు.బుధవారం ప్రజాభవన్ లో జరిగిన ప వర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మం త్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బి.ఆర్.ఎస్ పాలనలో తెలంగాణా రాష్ట్రానికి జ రిగిన నష్టాన్ని ఆధారలతో సహా సో దాహరణంగా వివరించారు.ఈ కా ర్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ.రే వంత్ రెడ్డి,రాష్ట్ర మంత్రివర్గ సభ్యు లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్ర తినిధులు పాల్గొన్నారు.
కృష్ణా జలాశయాలలో 763 టియం సి ల నీటిని తెలంగాణకు కేటా యిం చాల్సిందే నని ఆయన పేర్కొన్నా రు.కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యు నల్ లో స్వయంగా తాను పాల్గొని రాష్ట్రం తరపున గట్టి వాదనలు వి నిపిస్తున్నామని అంతిమంగా విజ యం తమకే దక్కు తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకాన్ని జూ రాల నుంచి శ్రీశైలం కు ఎందుకు మార్చారని ఆయన ప్రశ్నించారు. జూరాల వద్ద నీటి లభ్యత ఉన్నప్పుడు శ్రీశై లంకు మార్చాల్సిన అవస రం ఎందుకు వచ్చిందని ఆయన ని లదీశారు.
బిఆర్ఎస్ పార్టీ నేతలు చెబుతున్న ట్లుగా పాలమూరు-రంగారెడ్డి ఎ త్తి పోతల పధకం 90 శాతం ,పూర్తి అయిందనడం సత్యదూరమని ఆ యన స్పష్టం చేశారు.ఇప్పుడున్న ప రిస్థితుల్లో ప్రాజెక్టును పూర్తి చే యా లి అంటే 80 వేల కోట్ల పై చిలుకు ఖర్చు చేయాల్సి ఉంటుం దని అందుకు బి.ఆర్.ఎస్ పాలకులు అధి కారంలో ఉన్నప్పుడు నీ టిపారుదల రంగం పట్ల చూపిన నిర్లక్ష్యమే కార ణమన్నారు.2015 లో ఈ ప్రాజెక్టు ను పూర్తి చేయడానికి 35 వేల కో ట్లు అంచనా వేశా రని ఆయన గుర్తు చేశారు. 2022 లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడా నికి గాను నాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి సమ ర్పించిన డిపిఆర్ లో 55 వేల కోట్లు అవుతుందని ఇచ్చిన రిపోర్ట్ ను ఆయన గుర్తుచేశారు.ఇందులో భూసేకరణ తో పాటు కా లువల నిర్మాణం పొందు పరచ లేదన్నారు.
పదేళ్ల బి.ఆర్.ఎస్ పాలనలో పాల మూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథ కానికి ఖర్చు పెట్టింది కేవలం 27 వే లు కోట్లు మాత్రమే నని ఆయన తె లిపారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల వ్య వధిలోనే 7 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు.2013 ఆగస్టులో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం జా రీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పి ఆర్ ఎల్ ఐ సి ప్రాజెక్టును రాష్ట్ర విభజ నకు ముందు ఉన్న పాత ప్రాజెక్టు గా పరిగ ణనలోకి తీసుకుని ఉంటే ట్రిబ్యునల్ లో నీటి ప్రాధాన్యత దక్కి ఉం డేదన్నారు.అదే జూరాల వ ద్ద కొనసాగితే ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండేది కాదని,రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంతటి భారం పడేది కాదని ఆయన పేర్కొన్నారు.
దానికి తోడు ఇక్కడే యధావిధిగా కోనసాగి ఉంటే అనుమతుల పే రు తో ఆలస్యం జరిగి ఉండేది కాదన్నా రు. జి. ఓ నెంబర్ 34 ప్రకా రం జూ రాల నుంచి ఆన్ లైన్,ఆఫ్ లైన్ పద్ద తిలో నీటి నిల్వలకు ట్రిబ్యునల్ అంగీకారం ఉన్నందున ప్రాజెక్టు వేగ వంతంగా పూర్తి అ య్యి ఉండేది కాదన్నారు.90 టి.యం.సి లతో పాలమూరు, రంగా రెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం క ట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.నదీ జలాశయాలలో తె లం గాణా నీటి హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణ బ ద్ధులై పని చేస్తుందని ఆయన చెప్పారు.
కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ లో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వి నిపిస్తున్న సమర్ధవంతమైన వా ద నల పై ఆంద్రప్రదేశ్ మాజీ ము ఖ్య మంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడుకి రాసిన లేఖనే నదీ జ లాల విషయంలో తెలంగా ణ రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతను నిరూపిస్తుం దని ఆయన చెప్పారు. కృష్ణా జలా శయాల వివాదంలో ట్రిబ్యునల్ తీర్పు తెలంగాణాకు అ నుకూలంగా వస్తుందన్న నమ్మకం తమకు ఉందన్నారు.
బ్రిజేష్ కుమార్ కృష్ణా జలాల వివా దాల ట్రిబ్యునల్ తీర్పు మరో 8 నేల లో వచ్చే అవకాశం ఉందన్నారు. అంతర్ రాష్ట్ర జలాల వివా దంలో సెక్షన్-3 తెలంగాణా రాష్ట్రానికి బ లం చేకూరనుందన్నా రు. పదేళ్ల బి ఆర్ ఎస్ పాలనలో నీటిపారుదల రంగం నిర్లక్ష్యానికి గురి కావడంతో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొం డ జిల్లాల రైతాంగం నష్ట పోయింద ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నదీ జలాల అం శంపై బి.ఆర్.ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు అర్ధరహి తమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టి పారేశారు.


