Sunday, September 27, 2026
More
    HomePoliticsHarish Rao : అసెంబ్లీలో హరీష్ రావు ప్రశ్నల వ ర్షం, మూసీ సుందరీకరణ ఖర్చుపై...

    Harish Rao : అసెంబ్లీలో హరీష్ రావు ప్రశ్నల వ ర్షం, మూసీ సుందరీకరణ ఖర్చుపై శ్వేత పత్రం విడుదల చేయాలి

    📰 Generate e-Paper Clip

    –లక్ష కోట్లాలక్షన్నర కోట్లా అసలు అoచనా ఎంతో చెప్పాలి

    –నిర్వాసితులకు 2013 భూసేకర ణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చా రా

    –పేదల ఇళ్లు కూల్చితే బుల్డోజర్లకు అడ్డంగా నిలబడతాం

    Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతు న్న మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుందో ప్రభుత్వం చె ప్పాలని, ఒకసారి ముఖ్యమంత్రి ల క్ష కోట్లని, మరోసారి లక్షా 50 వేల కో ట్లు అని పలుసార్లు పరస్పర వి రుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని అసలు మూసీ సుందరీకరణ మీద ప్రభుత్వం ఎంత ఖర్చు చేయాల నుకుంటుందో స్పష్టం చేయాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు డిమాండ్ చే శారు. పిల్లలకు స్కాలర్‌షిప్‌లు ఇ వ్వమంటే డబ్బులు లేవు, కోసుకు తింటారా అని అంటున్నారు. రిటైర్డ్ ఎంప్లాయిస్‌కి బెనిఫిట్స్ ఇవ్వమంటే డబ్బులు లేవు అంటున్నారు. మరి మూసీ సుందరీకరణ మీద మాత్రం లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు.

    మూసీ సుందరీకరణలో ఇప్పటివర కు ఎన్ని నివాసాలు కూల్చారు? కూ ల్చిన నివాసాలకు 2013 భూ సేక రణ చట్టం కింద కంపెన్సేషన్ ఇచ్చా రా? వేజ్ లాస్ చెల్లించారా? లేదా కే సీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో వారిని అసైన్మెంట్ చేసి చే తులు దులుపుకున్నారా అని అ న్నారు. 2013 భూసేకరణ చట్టం ప్ర కారం ఒక్కో కుటుంబానికి రూ.14 లక్షల డబ్బు ఇవ్వాలని, వాళ్ల పాత ఇంటికి ఆర్ అండ్ బి ఎస్టిమేట్ చేసి ఆ డబ్బులు చెల్లించాలి. అలాగే సే లబుల్ రైట్స్ తో కూడినటువంటి 20 0 గజాల స్థలం, ఇల్లు ఇవ్వాలి. ఇవి ఇచ్చారా? ఇవ్వలేదా? ఒకవేళ ఇస్తే ఎప్పటిలోగా ఇస్తారని నిలదీ శారు.

    ప్రభుత్వం ఐడెంటిఫై చేసిన కూల్చ వలసిన ప్రభుత్వ, ప్రైవేటు కట్టడా లు ఎన్ని? ఎంత భూమిని ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరిస్తు న్నారని మంత్రి సమాధానం చెబు తూ హెచ్‌ఎండబ్ల్యూఎస్ నీటిని హి మాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లో పంపింగ్ చేయడానికి పట్టిందని, మూసీ నదిలో ఎప్పటికప్పుడు వి డుదల చేయడానికి రెండున్నర టీ ఎంసీలు రిజర్వ్ చేయడం జరిగింద న్నారు.

    స్వచ్ఛమైన గోదావరి జలాలను మూసిలో వదులుతామన్నారు. అసలు ఈ రెండున్నర టీఎంసీల గోదావరి జలాలు ఎక్కడి నుంచి తెస్తున్నారని, కాళేశ్వరంలో భాగ మైన మల్లన్న సాగర్ నుండి ఆ గో దావరి నీళ్లను తెస్తున్నారా? లేక ఎ క్కడి నుంచైనా గాలిలో నుండి తె స్తున్నారా? ఆ రెండున్నర టీఎంసీ లు ఎక్కడి నుంచి వస్తున్నాయో సమాధానం చెప్పాలన్నారు. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లను కూలగొడితే బీఆర్ఎస్ పార్టీ తీవ్రం గా వ్యతిరేకిస్తుందన్నారు.

    గతంలో చెప్పినట్లుగా బుల్డోజర్లకు అడ్డంగా పడుకుని అయినా అడ్డు కుంటామని, ఖాళీ స్థలాలు చాలా ఉన్నాయి. ఆ ఖాళీ స్థలాల్లో మూసీ సుందరీకరణ పనులు చేపట్టండి. కానీ, మూసీ పేరిట పేదల ఇండ్లు కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించా రు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.