Thursday, October 8, 2026
More
    HomeOpinionMinister Komatireddy Venkat Reddy : మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్ధుల ఖరారు మంత్రిదే

    Minister Komatireddy Venkat Reddy : మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్ధుల ఖరారు మంత్రిదే

    📰 Generate e-Paper Clip

     

    Minister Komatireddy Venkat Reddy:  ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థు ల టికెట్ కేటాయింపు విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దే తుది నిర్ణయమని నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి లు తేల్చి చెప్పారు.

    త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల నే పథ్యంలో ఆదివారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం లో అన్ని వార్డుల మాజీ కౌన్సిలర్లు, బూత్ ఇన్చార్జీలు, ముఖ్య నా యకులు, యూత్ కాంగ్రెస్ నాయకులతో నిర్వహించిన సమావేశం లో మాట్లాడారు.

    నల్లగొండ మున్సిపల్ వార్డు కౌన్సిల ర్ల పార్టీ టికెట్ కేటాయింపుకు సం బంధించి ఇప్పటివరకు ఎవ్వరికీ హా మీ ఇవ్వలేదని, మున్సిపా లిటీ ఎ న్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికె ట్ ఎవరికి వచ్చినా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిందేనని, అందు కు ప్రతి ఒక్కరూ కట్టు బడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

    నల్గొండ పట్టణంలో 48 వార్డులు ఉండగా రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కే టాయించిన తర్వాత గెలుపు అవ కాశాలు అధికంగా ఉన్నవారికే మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయక త్వంలో వార్డు కౌన్సిలర్ల అ భ్యర్థుల ఖరారు చేయబడుతుందని తెలిపారు.ఇప్పటికే రిజర్వేషన్ ఖరారు అయి నట్లు, సీట్లు కేటాయించినట్లు సో షల్ మీడియాలో కొందరు తప్పుడు పోస్టులు పెడుతూ అయోమయా నికి గురి చేస్తు న్నారని, అటువంటి వదంతులను ఎవ్వరు కూడా నమ్మవద్దని సూ చించారు.

    పట్టణంలోని ప్రతి వార్డులో మంత్రి కోమటిరెడ్డికి సంబంధించి సోష ల్ మీడియా గ్రూపు ఏర్పాటు చేసుకొ ని అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలను వివరించాలని, సోష ల్ మీడియాలో వ్యక్తిగత కార్యక్రమా లకు ప్రాధాన్యత ఇవ్వొద్దని సూచించారు.నల్లగొండ పట్ట ణంలో అన్ని వార్డుల లో పలు అభివృద్ధి కార్యక్రమాలు జ రుగుతు న్నాయని తెలిపారు. అం డర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరిగే ట ప్పు డు ప్రజలకు కొంత ఇబ్బందులు తలెత్తుతాయని, వీటిని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఉందన్నారు.

    మున్సిపాలిటీ ఎన్నికల ఓటర్ల జా బితాలో వార్డుల ఓటర్లు ఇతర వా ర్డులో, ఇతర వార్డుల ఓటర్ల జాబి తా మనవార్డులలో పడినప్పు డు వీటన్నింటినీ మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకువె ళ్లాల ని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో కూడా ఓటర్ల జాబితా పై మున్సిపాలిటీ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లి సవరించే విధం గా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.

    ఓటరు జాబితాపై అభ్యంతరాలకు సంబంధించి ఈరోజే చివరి రోజు కా వడంతో ఆయా వార్డుల మాజీ కౌ న్సిలర్లు, బూత్ ఇన్చార్జీలు, ముఖ్య నాయకులు మున్సిపాలిటీ అధి కారులకు ఫిర్యాదు చేయా లని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ పాల్గొ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.