Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: ఎందరో త్యాగధనుల పోరాటం ఫలితంగా సాధిం చుకున్న భారత దేశం 19 50, జనవరి 26 నుండి గణతంత్ర రాజ్యాంగ ఏర్పాటయ్యిందని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించు కొ ని సోమవారం అయ న నల్గొండ జిల్లా పరిషత్ జిల్లా కలె క్ట ర్ కార్యాలయాలు, జిల్లా కేంద్ర స హకార బ్యాంకు ఆవరణ లో జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇండియాను 1950 నుండి రిపబ్లిక్ గా చేయడం జరిగిందని ,ఆ రోజు నుండి రాజ్యాంగాన్ని అమలు చేసుకోవడం జరుగుతు న్న దని, దాని గుర్తుగానే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వ హించుకుంటున్నామని తెలిపారు .భారత దేశ స్వాతంత్రం ఎందరో త్యాగదనుల ఫలితం అని ఈ సందర్భంగా వారంద రికీ ఆయన నివాళులర్పించారు. గణతంత్ర దేశంగా రూపు తీ ద్దుకున్న భారత దేశంలో పేద ప్ర జ ల సంక్షేమానికి కేంద్ర ,రాష్ట్ర ప్రభు త్వాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తు న్నాయని, ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప థకాలను పేద ప్రజలందరికీ అందించేలా ఉద్యోగులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అప్పుడే మనం సాధిం చుకున్న స్వాతంత్రానికి ఫలితం ఉంటుందన్నారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీని వాస్ ,జిల్లా పరిషత్ సీఈ వో శ్రీనివాసరావు, కలెక్టర్ కార్యాలయ ఏవో మోతిలాల్, డిసి సి బ్యాంక్ సీఈవో, జిల్లా సహకార అధికారి పత్యా నాయక్, ఇతర అధికారులు, ఉద్యో గులు, తదితరులు ఉన్నారు.

