Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రముఖ బొట్టు గూడ ప్రభుత్వ పాఠశాలలో డిజి టల్ విద్య,వాల్డ్ఆఫ్ విద్యావిధా నంలో పేద విద్యార్థులకు నాణ్య మైన విద్య అందించేందు కు ప్రణా ళికా బద్దంగా ముందుకు సాగుతు న్నట్లు రోడ్లు భ వనాలు, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంక టరె డ్డి పేర్కొన్నారు. నల్లగొండలో రూ. 8 కోట్ల ప్రతీక్ ఫౌండేషన్ నిధు లతో నిర్మించిన బొట్టుగూడ పాఠ శాలను అత్యాధునిక సౌకర్యాకు, సాంకేతికతతో ప్రారంభించుకున్న ట్లు తెలిపారు. బొట్టుగూడ ప్రభు త్వ పాఠశాల పునరుద్ధరణ చిరకాల కోరిక అని ఈ సందర్భంగా ఆ యన కీలక వ్యాఖ్య చేశారు. చదు వుతోనే అభివృద్ధి సాధ్యం, అనుభ వాత్మక విద్యను అంది స్తామని, అ వసరంమేర బొట్టుగూడ స్కూల్ మరింత అభి వృద్ధికి కృషి చేస్తామ ని హామీ ఇచ్చారు. నల్లగొండ జిల్లా కేం ద్రంలో 8 కోట్ల రూపాయల ప్రతీ క్ ఫౌండేషన్ నిధులతో ని ర్మించిన బొట్టుగూడా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశా లను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించి మాట్లా డా రు. ఈ సందర్భంగా మంత్రి చేసి న వ్యాఖ్యలు ఆయన మా టల్లో నే…
బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాల నా చిరకాల కోరిక. 2500 గజాల స్థ లంలో అన్ని హంగులతో, డిజిటల్ విద్యావిధానం, వాల్డ్ఆఫ్ విద్యా విధానంలో పేద విద్యార్థులకు నా ణ్యమైన విద్య అందిస్తాం. పేదవా డు చదువుకోవాలి. చదువుతోనే అభివృద్ధి సాధ్యం.బొట్టు గూడా ప్ర భుత్వ పాఠశాల రొటీన్ పాఠశాల కాదు. ప్రపంచ స్థాయి పోటీని ఎదు ర్కొనే విధంగా ఇక్కడ విద్యా విధా నం ఉంటుంది. పాత సిలబస్ తో పా టు, సీబీఎస్ఈ సిలబస్ తెస్తా ను. సాంప్రదాయ విద్యా విధా నం కాకుండా అన్ని రకాల పోటీలు ఎదుర్కొనేలా విద్యార్థు లను తీర్చిదిద్దుతాం. అనుభవాత్మక విద్యను అందిస్తాం.
విద్యతోపాటు ప్రకృతి అనుసంధా నంతో ప్రకృతి వ్యవసా యం, మట్టి కుండల తయారీ ,కంప్యూటర్,ఏ ఐ,అన్ని రకాల నైపుణ్యాల అభివృ ద్ధికి ప్రత్యేక ఏర్పాట్లు. విద్యార్థుల సృజ నాత్మకతను పెంచేందుకు కృ షి. బొట్టు గూడా పాఠశాలలో ఇం డోర్ గేమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, యోగా సెంటర్ ఏర్పా టు చేసాం.
డిజిటల్ తరగతులతో పాటు, ప్రతి తరగతి గదిలోఏసిలు పెట్టించాం.అన్ని రకాల పోటీలు ఎదుర్కొనేలా విద్యార్థులను తీర్చిదిద్దుతాం. అ నుభవాత్మక విద్యను అంది స్తాం. విద్యా ర్థుల సృజనాత్మకతను పెం చేందుకు కృషి .45 కంప్యూటర్లు స్కూల్లో ఉన్నాయి. ఆణిముత్యాల లాంటి విద్యార్థులను, ఐ ఏఎస్, ఐ పీఎస్, సైంటిస్టులు తయారు చే స్తాం. పేదవాడి చదువు కోసం అం దరూ కృషి చేయాలి. బొట్టు గూడా పాఠ శాలకు ప్రవేశాలను బట్టి అవసరమైతే అదనపు భవనాలను కట్టిస్తా.
70సంవత్సరాలుగా విద్యను అభ్య సించి ఎన్నో ఉన్నత శిఖ రాలకు ఎం దరినో చేర్పించిన బొట్టుగూడ స్కూల్ కు నూత న రూపు ఇచ్చాం. నల్లగొండలో ప్రధానమైన ప్రకాశం బజార్ కే ప్రకాశవంతం తీసుకు వ చ్చింది ఈకోమటిరెడ్డి ప్రతీక్ ప్రాథ మిక ఉన్నత పాఠశాల. చదువులం టే భయభ్రాంతుల వు తున్న విద్యా ర్థులు ఈ పాఠశాలలో ఇష్టంగా చ దువుకునే విధంగా వసతులు క ల్పించాం. 8కోట్ల వ్యాయామంతో ఏ ర్పాటు చేసిన ఈ పాఠశాలలో ఏ ఐ టెక్నాలజీ కు పోటీపడే విధంగా అడ్వాంటేజ్ వసతులు ఉన్నాయి.
బొట్టుగూడ పాఠశాల కోసం మా నాయకులు అధికారులు నిర్మాణం కోసం ప్రాణం పెట్టారు. ఇప్పటికీ ఇంజనీరింగ్ లో ఉన్న విద్యార్థులు ఇంగ్లీష్ రాక ఇబ్బందులు పడుతుం డ్రు. ఉద్యోగాల కోసం రికమండేషన్ చే సిన గాని ఇంగ్లీష్ లో అ నుభవం లే దని చాలామందికి రిజెక్ట్ చేస్తుం డ్రు. ఈరోజు ఫ్యూచర్ సిటీలో స్పో కెన్ ఇంగ్లీష్ కు ప్రియారిటి ఇస్తు న్నా ము. ఉస్మానియా తర్వాత ఏ దైనా మంచి విద్యాసంస్థ యూనివర్సిటీ ఉందoటే నలగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆ విధంగా వైయస్సార్ హయాంలో నిర్మిం చాను. అణగారిన వర్గాల కో సం కుల మతాలకు అతీతంగా ఇం టిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం అవు తున్నాయి. ఫ్యూచర్ సిటీ లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము.
మినిస్ట్రీ ఉన్నా లేకున్నా నా సేవ కొనసాగుతూనే ఉంటుం ది.ఎన్నోసార్లు నాకు ఆశీర్వదించిన నలగొండ ప్రజల కోసం ఈ జీవితం అంకితం.ఎవరు అడగకున్న నల్ల గొండకు కార్పొ రేషన్ చేశాను. నేను ఎంపీగా ఉన్న పరిచయాల్లో ఇప్పు డు నేను అడిగితే నల్లగొండకు కేం ద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధం గా ఉంది.
నాకు ఉత్సాహం ఉంటే మ ళ్లీ పోటీ చేస్తాను, లేదంటే కోమ టిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాలలో ఒక రూమ్ లో ఉంటూ ఇక్కడ చదువుతున్న ప్రతి ఒక్క పిల్లాడిని నా కొడుకు లాగా భావించి చదివించుకుంటాను. నా కు అవకాశం ఉంటే వి ద్యాశాఖ మంత్రిగా తీసుకొని కార్పొరేట్ పా ఠశాలలను మూ సివేయాలని ఉం ది. విద్యను కార్పొరేట్ చేసేసి వ్యా పారం చేస్తుండ్రు.అధికారులు అం దరూ మీ పిల్లలని ప్రభుత్వ పా ఠ శాలలో చేర్పిస్తేనే విద్యావ్యవస్థ మె రుగుపడుతుందని స్పష్టం చేశారు.
అంతకు ముందు జిల్లా కలెక్టర్ బ డుగు చంద్రశేఖర్ మాట్లా డారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ ,ఎ మ్మెల్సీ శంకర్ నా యక్, లైబ్రరీ చైర్మన్ ఆఫీజ్ ఖాన్, అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




