Tuesday, September 29, 2026
More
    HomeOpinionTelangana municipal elections: బిగ్ బ్రేకింగ్, పురపోరుకు మోగిన సైరన్, మున్సిపల్ ఎన్నికల నోటిఫి కేషన్...

    Telangana municipal elections: బిగ్ బ్రేకింగ్, పురపోరుకు మోగిన సైరన్, మున్సిపల్ ఎన్నికల నోటిఫి కేషన్ విడుదల, రేపటి నుంచే నా మినేషన్ లు 

    📰 Generate e-Paper Clip

     

    Telangana municipal elections: ప్రజా దీవెన, హైదరా బాద్: తెలంగాణలో ఎప్పుడెప్పుడా అనుకుంటున్న పురపో రుకు ఎట్టకేలకు సైరన్ మోగించింది ఎన్నికల సంఘం. రా ష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని రా ష్ట్రoలోని 11 6 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు సంబం ధించి న నోటిఫికే షన్ విడుదల చేశారు. ఎన్నికల సంఘం విడుద ల చేసిన నోటిఫికేషన్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడత లో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది.

    ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల జనవరి 28వ తేదీ నుంచి మున్సిపల్ ఎన్నికలకు సం బంధించి నామినేష న్లు స్వీకరించనున్నారు. నామినేషన్ లు దాఖలు చేయడానికి జనవ రి 30 వరకు రెండు రోజుల పా టు అవకాశం కల్పించారు. అలాగే 31 వ తేదీన నామినేషన్ ల పరిశీలన చేయనుండగా నామినేషన్ల ఉపసంహరణకు ఫి బ్రవరి 3వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. ఫిబ్రవరి 11వ తే దీన పోలింగ్ నిర్వహించి 13 వ తేదీన కౌంటింగ్ నిర్వహించ నున్నారు. ఫిబ్రవరి 16వ తేదీన చైర్ పర్సన్స్, మేయర్ల ఎన్ని క ప్రక్రియ చేపడతారు.

    రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలి టీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగనుండగా ఈ ఎన్నికల్లో మొ త్తంగా 52. 43 లక్షల మంది ఓట ర్లు తమ ఓటు హక్కును వినియో గించు కోనున్నారు. మున్సిపాలిటీ ల్లోని మొత్తం 2,996 వార్డులకు ఎ న్నికలు నిర్వహిస్తుండగా 8203 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పా టు చేయనుoడగా ఓట్ల కౌంటింగ్ కోసం 136 కౌంటింగ్‌ కేంద్రా లు ఏర్పాటు చేస్తారు.

    తక్షణమే ఎన్నికల కోడ్ అమలు..

    మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలై న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అ మల్లోకి వచ్చింది. ఎ న్నికల కోడ్ నిబంధనలను ఉల్లం ఘిం చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎ న్నికల అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ నేప థ్యం లో పోలీసులు సైతం ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చే స్తున్నారు.

    పురపోరు ఎన్నికల వివరాలు ఇలా..

    —జనవరి 28న నామినేషన్ల స్వీకర ణ ప్రారంభం

    –జనవరి 30న నామినేషన్లు దాఖ లు చేసేందుకు చివరి తేదీ

    –జనవరి 31న నామినేషన్ ల పరి శీలన

    –ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసం హరణకు తుది గడువు

    — ఫిబ్రవరి 11న ఎన్నికల పోలింగ్‌

    –ఫిబ్రవరి 12న అవసరమైన చోట రీపోలింగ్‌

    –ఫిబ్రవరి 13 న పోలింగ్ ఓట్ల లెక్కింపు

    –ఫిబ్రవరి 16 న మున్సిపల్ పాలక వర్గాల ఎన్నిక

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.