District Collector Chandrashekhar : ప్రజా దీవెన, దేవరకొండ: ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఇబ్బంది లే కుండా వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. శ నివారం దేవరకొండ ఏరియా ఆసు పత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా త నిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఔట్‌పే షెంట్ విభాగం, ఇన్‌పేషెంట్ వార్డు లు, ఎమర్జెన్సీ విభాగం, లేబొరేట రీ, ఫార్మసీ, ప్రసూతి విభాగం ఎస్ ఎన్ సి వి వార్డు భోజనశాల, స్టోర్ రూమ్ తదితర సౌకర్యాలను కలెక్ట ర్ పరిశీలించారు.
విధుల్లో ఉన్న నర్సులు, డాక్టర్లతో మాట్లాడి రోగులకు అందిస్తున్న వై ద్య సేవలపై వివరాలు అడిగితె లు సుకున్నారు. ఆసుపత్రిలో రోగు ల కు అందుబాటులో ఉన్న బెడ్లు, ఆ క్సిజన్ సౌకర్యం, వైద్య పరికరాల పని తీరును పరిశీలించారు. ఆస్ప త్రి సిబ్బంది హాజరు పట్టికను పరిశీ లించారు. ఎవరెవరు లీవ్ లో ఉ న్నారు ? ఎవరెవరు హాజరయ్యా రని? సూపరింటిండెంట్ ను అడిగి తెలుసుకున్నారు.
ఎమర్జెన్సీ వార్డులోని రోగులతో జి ల్లా కలెక్టర్ ముఖాముఖి మాట్లా డా రు.పెద్దబాయి తండాకు చెందిన బ లరాంతో మాట్లాడుతూ ఆరోగ్యం ఎలా ఉంది? ఏమైంది ?హాస్పిటల్ కి ఎందుకు వచ్చారని అడగగా జ్వరంతో హాస్పటల్ కు వచ్చానని ఆస్పత్రి వైద్యులు సిబ్బంది బాగానే చూసుకుంటున్నారని చెప్పారు. జ నరల్ వార్డు ఫిమేల్ కాన్పుల వార్డు తిరిగి హాస్పటల్ సౌకర్యాలు ఏ వి ధంగా అందుతున్నాయని ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఏ మైనా సమస్యలు ఉన్నాయా, డా క్టర్లు ఇబ్బంది పెడుతున్నారా? మం దులు సరిగా ఇస్తున్నారా? మంచి గా చూసుకుంటున్నారా? అని అడి గారు.
హాస్పెటల్ లో సౌకర్యాలు మంచి గా కల్పిస్తున్నారని చెప్పారు. కా న్పుల వార్డులో భోజనం ఎలా ఉం దని, మంచిగా పెడుతున్నారా? గు డ్డు పెడుతున్నారా? డాక్టర్లు ఎన్ని సార్లు చూస్తున్నారు? చిన్న పిల్లల కు దోమలు కుట్టకుండా కిటికీలను మూసివేయాలని బాత్రూం కూడా శుభ్రంగా ఉంచాలన్నారు. అనంత రం జిల్లా కలెక్టర్ కిచెన్ పరిశీలించా రు. వంటలు వండే వంట సామాగ్రి నూనె కారం అల్లం కందిపప్పులు పసుపు అన్ని పరిశీలించారు. మె నూ ప్రకారం భోజనం పెట్టాలని చె ప్పారు.
ఆస్పత్రి సిబ్బందికి సెలవులు ఆన్లై న్లో చేసుకోవాలని అందరూ బయో మెట్రిక్ వాడాలని ఆన్లైన్ ద్వారానే సెలవులు పొందాలని ఆఫ్లైన్ ద్వా రా పొందే అవకాశం లేదన్నారు .ఐసియూ వార్డును జనరల్ వార్డు ను సపరేట్ చేయాలి ఐసియూ వా ర్డును జాగ్రత్త వాడండి మందుల కొ రత లేకుండా మూత్ర శాలలు శు భ్రంగా ఉంచలన్నారు.
ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశిం చారు.ఆసుపత్రి ప్రాంగణం పరిశు భ్రంగా ఉంచాలని, రోగులు మరి యు వారి సహాయకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది మరింత బాధ్యతతో పనిచేయాల ని కలెక్టర్ సూచించారు.ముఖ్యంగా గర్భిణీలు, చిన్నారులు, వృద్ధులకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎమర్జె న్సీ కేసుల్లో నిర్లక్ష్యం లేకుండా తక్ష ణ చికిత్స అందించాలని ఆదేశిం చారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి త హసిల్దార్ మధుసూదన్ రెడ్డి, ఏ రి యా హాస్పిటల్ సూపరింటెండెంట్ రవి ప్రకాష్, డాక్టర్ శంకర్, డాక్టర్ మోతిలాల్, నర్సింగ్ సూపర్డెంట్ అంబాదేవి కలెక్టర్ వెంట ఉన్నారు.

