Muncipal elections results : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ ము న్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చా టింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం ప్ర శాంతంగా ముగిసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రి య లో భాగంగా తొలుత ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లె క్కింపు మొదలు కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను ప్రదర్శించిం ది. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన సత్తాచాటింది. మొత్తంగా 1 16 మున్సిపాలిటీల్లో ప్రధాన పోరు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య నెలకొంది.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అత్యధిక స్థానాల్లో సాధించ గా ఉమ్మడి నల్లగొండ జిల్లా వరకు వచ్చే సరికి ఈ జిల్లాలో మొత్తం 17 మున్సిపాలిటీలు ఉండగా ఆయా మున్సిపాలి టీల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క తిరుమలగిరి మున్సిపాలిటీ మిన హా పూర్తి స్థాయిలో మున్సిపాలిటీ లను కైవసం చేసుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తిరుమలగిరి ము నిసిపాలిటీ పరి ధిలో మాత్రమే బీ ఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానా ల్లో తమ సత్తా చాటడం విశేషం.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు హవా జోరుగా కొన సాగింది. అందరూ ఊహించిన విధంగానే అధి కార కాంగ్రెస్ పార్టీ వైపే ఓటర్లు మొగ్గు చూపారు. ఉమ్మడి జి ల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీలకు గాను 16 మున్సిపా లిటీల పరిధిలో జోరు కొనసాగిoచింది. ప్రధానంగా నల్లగొండ మున్సిపల్ కా ర్పొరేషన్ లో 27 డివిజన్ స్థానాలతో మేయ ర్ స్థానాన్ని కైవసం చేసుకోగా ఆలేరు,భువనగిరి, చౌటు ప్ప ల్, మోత్కూరు, పోచంపల్లి, యాదగిరిగుట్ట, హుజూర్నగర్,
కోదాడ, నేరేడుచర్ల,సూర్యాపేట, తిరుమలగిరి, చండూర్, చి ట్యాల,దేవరకొండ,హాలియా,మిర్యాలగూడ,నందికొండలను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోగా ఒక్క తిరుమలగిరి ము న్సిపాలిటీని మాత్రం బి ఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది.

ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వరకు వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీకి ఈ జిల్లా కంచుకోట అనే విషయం తెలిసిందే. ఈ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇ చ్చిం దని చెప్పవచ్చు. పలు మునిసిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీ తన సత్తా చాటి ఏకంగా 9 మునిసిపాలిటీల్లో బీఆర్ఎస్ హ వా చాటింది. చేర్యాల, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, జోగి పేట, గడ్డపోతారం, గు మ్మడిదల,ఇంద్రేశo, ఇస్నాపూర్,
జిన్నారం,జహీరాబాద్ మున్సిపాలిటీలను బిఆర్ఎస్ కైవ సం చేసుకోగా కోహిర్, నారాయణ్‌ఖేడ్, సదాశివపేట్, సంగా రెడ్డి, మెదక్,నర్సాపూర్,రామాయంపేట, తూప్రాన్ మున్సి పాలిటీలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది.

అదే విధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మునిసిపాలిటీలు కైవసం చేసుకుంది. కానీ నారాయణపేట మునిసిపాలిటీ మాత్రం బీజేపీ ఖా తాలో పడింది. ఇక అలంపూర్, అమరచింత మునిసిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది.భూత్పూర్, దేవరకద్ర, కోస్గి, మద్దూరు, మ క్తల్, నారాయ ణపేట, ఆత్మకూరు, కొత్తకోట, పెబ్బేరు, వనప ర్తి, కల్వకుర్తి, కొల్లా పూర్, నాగర్‌కర్నూలు, షాద్‌నగర్, కొడం గల్, ఆమనగల్ మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుచుకోగా అ లంపూర్ లో కాంగ్రెస్ 5, బీఆర్ఎస్ 5 గెలుచుకోవడంతో హం గ్ పరిస్థితి ఏర్పడింది. గద్వాల్ , అయిజ వడ్డేపల్లి (10) ఇత రులు 8 వార్డు ల్లో గెలుపొందారు. కాంగ్రెస్ (1), బీ ఆర్ఎస్ (1) గెలుచుకుంది. అదే వి ధంగా అమరచింత (10) : హంగ్ కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 3, బీజేపీ 3, ఇతరులు గెలుపొందారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ జిల్లా లో కాంగ్రెస్ పార్టీ అత్య ధిక మునిసి పాలిటీలను తన ఖాతాల్లో వేసు కుంది. కేవలం రెండు మునిసిపా లి టీల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగు ర వే సింది. కేసముద్రంలో మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి సమానంగా అభ్యర్థులు విజయం సాధించారు. జన గామ (బిఆర్ఎస్) స్టేషన్ ఘన్పూర్, నర్సంపేట,వర్ధన్నపేట, హనుమకొండ, పరకాల, మరిపెడ, మహబూబాబాద్, భూ పాలపల్లి, ములుగు కాంగ్రెస్ ఖాతాలో పడగా డోర్నకల్, కేస ముద్రo హంగ్ (కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 8) ఏర్పడింది. కాగా తొర్రూర్ ము న్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వచ్చే సరికి చొప్పదండి, హుజూ రాబాద్, ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, మె ట్పల్లి, రాయికల్, వేములవాడ, మంథని,పెద్దపల్లి, సుల్తానాబాద్ లను కాంగ్రెస్ కైవసం చేసుకోగా జమ్మికుంట, సిరిసిల్ల మున్సిపాలి టీలపై బీఆర్ఎస్ జెండారెపరెపలాడింది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏదులా పురం, కల్లూరు, మధిర, సత్తుపల్లి వైరా, అశ్వారావుపేట, ఇల్లెందు ఆరు మున్సిపాలి టీలలో అధికార కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లక్షె ట్టిపేట, భైంసా, ఖానాపూర్, నిర్మ ల్,చెన్నూరు, మున్సిపాలిటిలను గెలుచుకోగా ఆదిలాబాద్ బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. అదే సమయంలో ఆసిఫా బాద్ బిఆర్ ఎస్ గెలుచుకోగా కాగజ్ నగర్ లో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 10 గెలుచు కోవడంతో హంగ్ , బెల్లంపల్లిలో కూడా కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 14 గెలుచు కో వడంతో ఆరెండు ము నిసిపాలిటీల్లో హాంగ్ అనివార్య మైంది. కాగా క్యాతనపల్లి ము న్సి పాలిటీ లో మాత్రం బీఆర్ఎస్ పా గా వేసింది.
ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, మొయినాబాద్, శం కర్పల్లి, పరిగి,తాండూర్, వికారాబాద్, అలియాబాద్ ము న్సిపాలిటీల్లో అధి కార కాంగ్రెస్ విజయకేతనం ఎగుర వేయ గా ఇబ్రహీంపట్నం, మూడు చింతలపల్లి,ఎల్లంపేటల్లో బీఆర్ ఎ స్ ఖాతా తెరిచిoది. అదే క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వ చ్చే సరికి ఆర్మూరు,భీమ్‌గల్, బోధన్, బాన్సు వా డ, బిచ్కుంద,కామారెడ్డి,ఎల్లారెడ్డి మున్సిపాలిటీలను కాంగ్రె స్ పార్టీ హస్తగతం చేసుకుంది.


