Sunday, September 27, 2026
More
    HomeOpinionMinister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భా వోద్వేగం,నల్లగొండ నాజన్మభూమి, ఇక్కడి...

    Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భా వోద్వేగం,నల్లగొండ నాజన్మభూమి, ఇక్కడి ప్రతిగల్లీ నాగుండె చప్పుడు

    📰 Generate e-Paper Clip

    Minister Komatireddy Venkat Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కు మేయ ర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం నగ ర అభివృద్ధికి మంచి సంకే తమని రాష్ట్ర రోడ్డు, భవనాలు సి నిమాటో గ్రపి శాఖల మం త్రి కోమటిరెడ్డి వెం కట్ రెడ్డి అన్నారు. సోమవారం న ల్లగొండ నగర మేయర్ కా ర్యాల య సమావేశ మందిరంలో నగర మేయర్, డిప్యూటీ మేయర్, కా ర్పొరేట్ల ప్రమాణ స్వీకార కా ర్యక్ర మానికి ఆయన హాజరయ్యారు.

    అనంతరం మీడియా సమావేశం లో మాట్లాడుతూ నల్గొండ కార్పొ రేషన్ పరిధిలోని 48 మంది కార్పొ రేటర్లకు మంత్రి శుభాకాంక్షలు తెలి పారు. అధికారంలో ఉన్నంత కాలం కా ర్పొరేటర్లు ప్రజలకు అంకిత భావం తో సేవ చేయాలని మం త్రి సూచిం చారు. ఏ సమస్య వచ్చినా ముందుగా మేయర్ దృష్టికి, అవసరమై తే తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం 5వేల కో ట్ల రూపాయల ఫ్రీ కరెంటు బిల్లు చె ల్లించిందని, ఒక్కో కుటుంబానికి సుమారు 50 వేల రూ పాయల వ రకు కరెంటు బిల్లు భారం తగ్గించామని తెలిపా రు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక సౌకర్యాలు క ల్పి స్తున్నామని చెప్పారు. గతంలో ఎంపీగా తనకు ఉన్న పరి చయాల తో ఢిల్లీ నుంచి నిధులు తీసుకువ స్తానని హామీ ఇచ్చారు. 70 0 కోట్ల రూపాయలతో బైపాస్ రోడ్డు నిర్మా ణం చేపడుతున్నామని తెలిపారు.

    అభివృద్ధి ఇప్పుడు మీ చేతుల్లో ఉందని కార్పొరేటర్లకు స్ప ష్టం చేశారు. మేయర్‌తో సమన్వయం చేసుకుని నల్గొండ నగర అభివృద్ధికి క లిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ విభేదాలు పక్కనపె ట్టి అన్ని పార్టీల కార్పొరేటర్లు అభి వృద్ధి కోసం ఏకమవ్వాలని సూచించారు. మూడేళ్ల పా టు రాజకీయాలకు దూరంగా ఉండి, పూర్తిగా అ భివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. తన కు పదవులు ముఖ్యమేమీ కావని, అభివృద్ధే ముఖ్యమని స్పష్టం చేశా రు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.గెలిచిన ప్రతి ఒక్కరూ అ భివృద్ధి కోసం కృషి చేయాలని, మూడేళ్లలో నల్గొండ కార్పొరేషన్ జాతీయ స్థాయి అవార్డు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూ చించారు. నగరంలో శానిటేష న్ వ్యవస్థ సరిగా లేదని, వెంటనే మె రుగుపరచాలని అధికా రులకు ఆదేశించారు.

     

    నల్లగొండ నా జన్మభూమి, ఇక్కడి ప్రతి గల్లీ నాగుండె చప్పుడు..

    నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు నా కల, ఆ కల సాకార మై, ఇవాళ అభ్యర్థులు ప్రజాప్రతి నిధులుగా ప్రమా ణ స్వీకారం చేస్తుంటే నా మనసుగర్వంతో నిండి పోయిం దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండ నా జ న్మభూమి, ఇక్కడి ప్రతి గల్లీ నా గుండె చప్పుడన్నారు. నల్గొండను కేవలం ఒక పట్టణంగా కాదు, దేశం గర్వించేలా ఒక ‘క్లీన్ – గ్రీన్ – స్మార్ట్ సిటీ’ (Clean, Green & Smart City) గా తీర్చిదిద్దడమే నా జీవిత ఆశయం. రాజకీయాలకు తావు లే కుండా, మేము ఓడిపోయిన డివి జన్లలో సైతం అభివృద్ధి గంగా ప్ర వాహంలా సాగుతుందన్నారు. ప్రతి పేద వాడి ఇంటికి సంక్షేమం, ప్రతి వీ ధికి ఆధునిక వసతులు చేర డమే నా బాధ్యత అని పేర్కొన్నారు.

    నాటి ఫ్లోరోసిస్ వ్యతిరేక పోరాటం నుండి నేటి స్మార్ట్ సిటీ నిర్మాణం వరకు.. మీ ‘కోమటిరెడ్డి’ ఎప్పుడూ మీతోడుగానే ఉంటాడు. మనంద రం కలిసి నవ నల్గొండను నిర్మిద్దాం అని మంత్రి పేర్కొన్నారు.ఈ మీడి యా సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎంఐఎం ఎమ్మెల్సీ ఆఫన అలీ, నగర మే యర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ అలీ అమీర్, గ్రంథాల సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, మాజీ ము న్సి పల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి త దితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.