Sunday, September 27, 2026
More
    HomeOpinionBrs MLA Harish Rao : బిగ్ బ్రేకింగ్, ఏఐసిసి అగ్రనేతలకు మాజీ మంత్రి హరీష్...

    Brs MLA Harish Rao : బిగ్ బ్రేకింగ్, ఏఐసిసి అగ్రనేతలకు మాజీ మంత్రి హరీష్ బ హిరంగలేఖ, తెలంగాణకిచ్చిన హామీలను గుర్తుచేస్తున్నాను

    📰 Generate e-Paper Clip

     

    Brs MLA Harish Rao ప్రజా దీవెన, హైదరాబాద్: జాతీ య కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతోపాటు ఆ పార్టీ అగ్రనేత లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌, కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, కర్ణాట క ముఖ్యమంత్రి సిద్దా రామయ్యకు మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు బుధవా రం బహిరంగ లేఖ రాశారు. హరీష్ రా వు రాసిన బహిరంగలేఖలోని ముఖ్యాంశాలు ఆయన మా టల్లోనే…

    తెలంగాణ క్యాబినెట్‌ను ఢిల్లీకి పి లిపించుకుని మీరు చేయ బోయే ‘సమీక్ష’ను చూస్తుంటే ప్రజాస్వా మ్యం సిగ్గుతో తల దించుకుంటోంది. స్వయం పాలన కోసం, స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలం గా ణ రాష్ట్రం ఇవాళ మీ ఢిల్లీ దర్బార్‌లో మోకరిల్లడం ఈ నేల ఆ త్మగౌరవాన్ని భంగపరుస్తున్నది.తెలంగాణ ప్రజలు ఓట్లేసి ఎన్నుకు న్నది ఒక స్వతంత్ర ప్రభుత్వాన్నా? లేక మీ ఢిల్లీకి గులాంగిరి చేసే సా మంత ప్రభుత్వాన్నా? అని ప్రజలు వా పోతున్నారు.

    ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ పనితీ రుపై సమీక్ష నిర్వహిస్తు న్న మీకు, ఎన్నికల సమయంలో తెలంగాణ కు వచ్చి ఇచ్చి న మీ హామీలను గు ర్తు చేస్తున్నాను. వంద రోజుల్లో అ మ లు చేస్తామని చెప్పి, ఇప్పటికే రెండేన్నరేండ్లు గడిచింది. మి గిలిన కొద్ది కాలంలో అయినా మీరు ఇచ్చి న హామీలకు క ట్టుబడి త్వరగా నెరవేర్చాలని, ఆ దిశగా మీ ముఖ్య మం త్రి కి హితబోధ చేయాలని కోరుతున్నాను.మొట్టమొదటి అసెం బ్లీ సమావేశాల్లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తా మని మీరు హా మి ఇచ్చారు.తీరా చూస్తే బిల్లు ‘నిల్లయింది’, ప్రజల విశ్వాసం ‘కిల్లయింది’.ఈ ప్రజా విద్రోహానికి క్షమాపణ లు చెబుతూ మీ సమీక్ష ప్రారంభించండి.

    సోనియాగాంధీ ఆరుగ్యారెంటీల అమలుకు మీరు స్వయం గా హామీ పడుతూ బాండ్ పేపర్లపై సంతకా లు పెట్టి ప్రజల ఓట్లు పొందారు. మీ ముఖ్యమంత్రి నిర్వాకం వల్ల ఆ బాండు లకు విలువ లేకుండా పో యింది. అవి నాలుకగీసుకో వడా ని కి కూడా పనికి రాకుండాపోయాయి. రాహుల్ గాంధీ వ రంగల్ రైతు డిక్లరేషన్ లో మీరు ఇచ్చిన హా మీ లను మీరే విస్మరించారు. వాటిని మీకు మళ్లీ గుర్తు చేస్తున్నాను. రా ష్ట్రంలోని రైతులందరికీ రెండు లక్ష ల రుణమాఫీ చేస్తామని, కౌలు రై తులకు కూడా రైతు భరోసా లబ్ది చేకూర్చుతామని, ఉపాధి హామి కూలీలకు ఏడాదికి 12వేలు ఇస్తా మని, అన్ని రకాల పంటలకు మ ద్దతు ధరతో పాటు బోనస్ చెల్లి స్తా మ ని, పంట బీమా కల్పిస్తామని నమ్మబలికారు.

    ఇప్పుడు ఈ హామీలన్నీ నీటి మూ టలు అయ్యాయి. రుణ మాఫీ సగం మందికి ఎగ్గొట్టారు, రెండు పంటలకు రైతు భరో సా ఎగ్గొట్టారు, పంట బోనస్ ఒక పంటకే పరిమి తం చేసారు, పంట బీమా అటకెక్కించారు.నమ్మిన రైతులను నట్టేట ముంచిన మీ ప్రభుత్వ నయవం చనపై సమీక్ష చేస్తారా? ప్రి యాంక గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి న మొదటి ఏ డాదిలోనే రెండు లక్ష ల ఉద్యోగ నియామకాలు చేస్తామ ని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి క్ర మం తప్పకుండా ఖాళీలు భర్తీ చే స్తామని, నిరుద్యోగులకు 4000 భృతి ఇస్తామని, 18ఏళ్లు పై బడి న ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూ టర్లు ఇస్తామని స రూర్ నగర్ స్టేడి యంలో ఆర్బాటంగా ప్రకటించారు. అంతే సౌకర్యంగా విస్మరించారు.ఇందులో ఏ ఒక్క హామి అమలు కాక పోగా, నిరుద్యోగుల మీద ద మనకాండ జరుపుతున్నది ఘ న త వహించిన మీ రేవంతు ప్రభుత్వం.

    యువత, నిరుద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేసి, వాళ్ల భవి ష్యత్తుతో చ లగాటం ఆడుతున్న మీ కాంగ్రెస్ ప్ర భుత్వ మో సపూరిత వైఖరికి మీరు బాద్యులు కాదా? దీనిపై సమీక్ష చే స్తారా? ప్రజలకు సమాధానం చె బుతారా? మల్లికార్జున ఖర్గే ఎస్సీల రిజర్వేషన్లు 18శాతానికి పెంచు తామని, అన్ని ప్రభు త్వ ప్రొక్యూ ర్మెంట్లలో, కాంట్రాక్టుల్లో ఎస్సీలకు 18శాతం, ఎస్టీ లకు 12శాతం రిజ ర్వేషన్లు కల్పిస్తామని చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో అనేక హామీలు గుప్పించారు. అమలు చే య క తప్పించారు.దళిత బిడ్డలను దగా చేసి ఓట్లు దండు కున్న మీ నమ్మక ద్రో హంపై ఏమని సమీక్ష చేసుకుంటా రు. ఇంకా చెప్పాలంటే 420 హామీలను ప్రస్తావించాలి, వాటన్నిం టి ప రిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉం ది.రాష్ట్రంలో ప్రజలు నానా రకాల పాట్లు పడు తున్నా రు. సజావుగా ఎరువులు కూడా సప్లై చేయలేని మీ కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల రైతులు అనేక తిప్పలు పడ్డారు.

    ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ, పాలన గాలికి వదిలేస్తూ ఢి ల్లీకి చక్కర్లు కొడుతున్న ముఖ్యమంత్రి వై ఖరితో తెలం గాణ బతుకు తెల్లారి పోతున్నది. ప్రశ్నించే గొంతులను అణిచివే స్తూ పరమ బూతు, రోత ప్ర సంగాలతో చెలరేగి పోతున్న ముఖ్యమంత్రిని చూసి సభ్య సమాజం తలదించుకుంటు న్నది. ఇచ్చిన హా మీలు నెరవేర్చకపోగా బిఆర్ఎస్ సర్కారు అందించిన సంక్షేమ పథ కాలకు తిలోదకాలు ఇచ్చి, ప్రజా ప్ర యోజనాలను కాలరాస్తున్న మీ ముఖ్యమంత్రి తీరు రాష్ట్రా నికి గ్రహపాటుగా మారింది.

    బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసి న కేసీఆర్ కిట్, న్యూట్రీ షన్ కిట్, ద ళిత బంధు, బీసీ బంధు, కంటి వెలుగు, చేపల పంపిణీ, గొర్రెల పం పిణీ, మన ఊరు మన బడి, సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం, రంజాన్ తోఫా, క్రి స్మస్ తోఫా, పల్లె ప్రగతి, పట్టణ ప్రగ తి వంటి అనేక సంక్షేమ పథకాల ను వచ్చిరాగానే నిలి పేసాడు. ప్రజా సంక్షేమ దీపాన్ని మలిపేసాడు.ఫీజు రియిం బర్స్ మెంట్ నిధులు విడుదల చేయక 20లక్షల మంది ఎ స్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యా ర్థు ల భవిష్యత్తును ప్రశ్నా ర్థకంగా మా ర్చింది మీ కాంగ్రెస్ పాలన కేసీఆర్ పాలనలో చ దువులమ్మ గుడులుగా పేరుపొందిన గురుకులాల్లో నేడు చావు డప్పు మోగిస్తున్నది మీ కాంగ్రెస్ ప్రభుత్వం.

    మొదటి ఏడాదిలోనే మీరు ఇస్తా మన్న రెండు లక్షల ఉద్యో గాలకు ఎప్పుడు నోటిఫికేషన్లు ఇస్తారని రెండేళ్ల తర్వాత ప్ర శ్నించిన పాపా నికి, చదువుల తల్లి నిలయమైన లైబ్రరీలోకి పోలీసుదళాలను పం పి, నిరుద్యోగుల వీపులు పగులగొ ట్టిన మీ ప్రభుత్వ పాపాలకు ని ష్కృతి ఏమిటో నిజాయి తీ గా సమీక్షించండి.స్కీంలేవి లేకపోగా స్కాములు మాత్రం మూడు పూవులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి. జా బుల క్యాలెండర్ లేదు గానీ, స్కాముల క్యాలెండర్ సరిగ్గా అమలవుతుంది.

    హిల్ టీపీ స్కాం, సింగరేణి స్కాం, సోలార్ పవర్ స్కాం, సివి ల్ సప్లై స్కాం, ఎన్టీపీసీ ఫ్లై యాష్ స్కాం, ఇ సుక స్కాం, ఎక్సై జ్ స్కాం, ఆర్టీసీ స్కాం, అమృత్ స్కాం, కేఎల్ఎస్ ఆర్ స్కాం, లగచర్ల-హెచ్ సీ యూ ల్యాండ్ స్కాం, పీజీ మెడికల్ సీట్స్ స్కాం, పూటకో కుంభకోణంతో ప్ర జాధనాన్ని లూటీ చేస్తు న్నది మీ ప్ర భుత్వం.క్రోనీ కాపిటలిజంకు తెలంగాణను కాపి టల్ గా మార్చింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం. అక్రమంగా అ ను యాయులకు టెండర్లు కట్టబెడుతూ వేల కోట్ల రూపాయ లను దొడ్డి దారిన దండుకుంటున్నది మీ దోపిడీ ప్రభుత్వం. తెలంగాణ ప్రజా ధనం ఇవాళ జాతీయ కాంగ్రెస్ పార్టీ రాజ కీయ అవసరాలకు ‘ఎరు వు’గా మారుతోంది. ఆ అవినీతి భా రం మోయలేక తెలంగాణ సామా న్యుడి నడుము విరి గిపోతోంది. ఈ సమీక్షలో మీరు అడిగేది ప్రజలకు ఇచ్చిన మాటల గురించా? లేక మీ కు అందుతున్న వాటాల గురిం చా?

    ఇందిరమ్మ రాజ్యమా? ఇండ్లు కూ ల్చే రాజ్యమా? దేశమం తా బుల్ డోజర్ సంస్కృతిని వ్యతిరేకిస్తు న్నామని మీరు నీతులు చెబుతుం టే, ఇక్కడ మీ ముఖ్యమంత్రి పేదల ఇళ్ల ను బుల్ డోజర్లతో కూల్చి వే యిస్తున్నారు. ఢిల్లీలో ఒక మా ట, గల్లీలో ఒక చేత.. ఈ డబుల్ స్టాం డర్డ్స్ మీకే చెల్లింది. దీనిపై సమీక్ష చేయాలని కోరుతున్నాను. మీరందరూ ఎన్ని కల సమయంలో తెలంగాణకు వచ్చి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకున్నారు.

    ఎన్నికలు అయిపోగానే ముఖం చాటేసి ఇ చ్చిన హామీలను అటకెక్కించారు.రేపు ఢిల్లీలో ‘రెండున్నరేండ్ల రేవంతు పాల న వైఫల్యాలు- అమలు కాని హామీల’పై ప్రధానంగా చర్చ జరపాలని డిమాండ్ చేస్తున్నాం.ఆరు గ్యారెంటీలు, 420 హామీల అ మలు విషయంలో రేవం త్ రెడ్డికి డై రెక్షన్ ఇవ్వ డంతో పాటు, స్కాంలపై స్పందించి తగిన చర్యలు తీసుకో వాలని కోరుతున్నాం. తెలంగాణ పోరాటాల గడ్డ ఇది ఎన్న టికీ ఢిల్లీకి గులాం కాదు.ఈ గడ్డ ఆత్మగౌరవాన్ని తాకట్టు పె ట్టాలని చూస్తే మీ కాంగ్రెస్ ను చరిత్ర క్షమించదని హరీష్ రావు వ్యాజ్యానించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.