Tuesday, September 29, 2026
More
    HomePoliticsBig Breaking : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ పోలీస్ జా గిలాల దళంలోకి కొత్త శునకాలు,...

    Big Breaking : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ పోలీస్ జా గిలాల దళంలోకి కొత్త శునకాలు, ఎస్పీని కలిసిన డాగ్ హాండ్లర్లు

    📰 Generate e-Paper Clip

    Big Breaking : ప్రజా దీవెన నల్లగొండ: నేరపరిశో ధనలో పోలీస్ జాగిలాల పాత్ర ఒ క్కోసారి అనిర్వచనీయమని అం దరికీ తెలిసిందే. కాలక్రమేనా పోలీ స్ జాగిలాలు కొత్తగా వచ్చి చేరడం కూడా జరుగుతూ ఉంటుoది. అం దులో భాగంగా మొయినాబాద్ అ కాడమీలో 72 కెనైన్స్ ఎనిమిది నె లల శిక్షణ పూర్తి చేసుకొని క్రిమిన ల్స్ ట్రాకింగ్, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలను ట్రేస్ చేయడం లో తర్ఫీదు పొందాయి. పోలీస్ శాఖలో 42 కెనైన్స్ పోలీస్ కుక్కలు కొత్తగా విధుల్లో చేరాయి. నేరగా ళ్లను పట్టుకోవడంతో పాటు పేలు డు పదార్థాలు, నార్కొటిక్స్ ను గు ర్తించడంలో 8 నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకొని నేర పరిశోధనలో పోలీసులకు తోడుగా నిలువను న్నాయి.

    రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో(ఐఐటీఏ) శిక్షణ పూర్తి చేసుకున్న 25వ బ్యాచ్ పోలీస్ జా గిలాలు (కెనైన్స్) మoగళవారం ప రేడ్ ముగించుకొని జిల్లాలకు కేటా యించబడిన పోలీస్ జాగిలాలు గురువారం ఆయా ప్రాంతాలకు చేరుకున్నాయి. అందులో భాగంగా నల్లగొండ జిల్లాకు నూతనంగా కే టాయించబడిన స్నిఫర్, ట్రాకర్ శు నకాలు హెడ్ క్వార్టర్ కు చేరాయి.

    *శునకాలతో ఎస్పిని కలిసిన డాగ్ హాండ్లర్లు..* నల్లగొండ జిల్లా పోలీసు విభాగానికి భద్రతా పరం గా మరింత బలాన్నిచ్చే విధంగా రెండు ఎక్స్‌ప్లోసివ్ గుర్తించే స్నిఫర్ (బిట్టు,చింటూ) శునకాలతో పాటు ఒక ట్రాకర్ (సోను) శునకం నూత నంగా చేరినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.ఈ శున కా లు హైదరాబాద్ సమీపంలోని పో లీ స్ డాగ్ ట్రైనింగ్ సెంటర్, (ఐఐ టీఏ) మోహినాబాద్ లో ఎనిమిది నెలలపాటు ప్రత్యేకతో పాటు కఠిన శిక్షణను పూర్తి చేసుకున్నాయి.

    శిక్షణ సమయంలో ఎక్స్‌ ప్లోసివ్ ప దార్థాల గుర్తింపు, అను మానాస్ప ద వస్తువుల తనిఖీ, నేరస్థుల అ డుగుజాడల గుర్తింపు, గందరగోళ పరిస్థితుల్లో విధి నిర్వహణ వంటి అంశాలలో శునకాలు ప్రావీణ్యం పొందాయి. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం డాగ్ హాండ్లర్లు కాని స్టే బుళ్లు ఫకృద్దీన్,సతీష్, దుర్గాప్ర సా ద్ లు జిల్లా ఎస్పీని మర్యాదపూ ర్వకంగా కలిసి శిక్షణ విధానం, శు నకాల సామర్థ్యాలు, ఫీల్డ్‌లో అవి పనిచేసేతీరు తదితర వివరాలను సమగ్రంగా వివరించారు.

    ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లాలో జరి గే దొంగతనాల, మర్డర్ కేసుల విచా రణలో ట్రాకర్ శునకం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. సంఘ ట న స్థలంలో నేరస్థుల అడుగుజాడ లను పసిగట్టి, పోలీసులకు దర్యా ప్తులో దిశానిర్దేశం చేయడంలో ట్రా కర్ శునకం సమర్థవంతంగా పనిచే స్తుందని పేర్కొన్నారు.

    ఇప్పటి వరకు జిల్లాల్లో ఇలాంటి శు నకాలు అనేక క్లిష్టమైన కేసుల చేద నలో కీలక ఆధారాలను అందించా యని ఆయన అన్నారు.అలాగే స్ని ఫర్ శునకాలు ముఖ్యంగా వి.ఐ. పి.ల పర్యటనలు, భారీ ప్రజాసభ లు, ఉత్సవాలు, జాతరలు, ప్ర భు త్వ కార్యక్రమాలు మరియు ఎన్ని కల సమయంలో ముందస్తుగా త నిఖీలు నిర్వహించడంలో అత్యం త కీలకంగా వ్యవహరిస్తాయని తె లిపారు. అనుమానాస్పద బ్యాగు లు, వాహనాలు, భవనాలు మరి యు ప్రాంగణాలలో ఎక్స్‌ప్లోసి వ్ పదార్థాల గుర్తింపులో ఇవి ప్ర త్యేక నైపుణ్యం కలిగి ఉన్నాయని వివ రించారు.జిల్లాలో ఎలాంటి అవాం ఛనీయ సంఘటనలు చోటుచే సు కోకుండా ముందస్తు జాగ్రత్త చ ర్య లలో భాగంగా ఈ శునకాల సే వ లను సమర్థవంతంగా వినియో గించనున్నట్లు ఎస్పీ స్పష్టం చేశా రు.

    ప్రజల ప్రాణాలు మరియు ఆస్తుల రక్షణే పోలీసు శాఖ ప్రధాన ల క్ష్య మని, ఆధునిక సాంకేతిక పరి జ్ఞా నం, సీసీటీవీ నిఘా వ్యవస్థలతో పాటు శునకదళం వంటి ప్రత్యేక వి భాగాలను సమన్వయంతో ఉప యోగించుకుంటూ శాంతి భద్రత ల ను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

    నూతనంగా చేరిన ఈ శునకాలతో నల్లగొండ జిల్లా పోలీసు విభాగం మరింత అప్రమత్తంగా, సమర్థవం తంగా సేవలు అందించేందుకు సి ద్ధంగా ఉందని అధికారులు తెలిపా రు. ప్రజలు కూడా పోలీసులకు స హకరించి అనుమానాస్పద విష యాలను వెంటనే సమీప పోలీసు అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ సీఐ రా ము,అడ్మిన్ ఆర్.ఐ సంతోష్, ఆర్ఎస్ఐలు సాయిరాం, సంతోష్, శ్రావణి, అశోక్,హెడ్ కా నిస్టేబుల్ కరుణాకర్ తదితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.