15th Finance Commission Funds : ప్రజా దీవెన, హై దరాబాద్: కేంద్ర ప్ర భుత్వం గ్రామ పంచాయతీలకు మరో మారు తీపికబురు అందించింది. కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్రా మ పంచాయతీల అభివృద్ధికి పచ్చ జెండా ఊపింది. 15 వ ఆర్థిక సంఘం నిధుల మూడో విడత విడుదలతో గ్రామా ల భవిష్యత్తుకు బలమైనబాటలు పడనున్నాయి.ఇప్పటికే కేంద్రం నుంచి మొత్తం రూ.1034.42 కోట్ల నిధులు రా ష్ట్రా నికి అందాయి. తాజాగా మూడో విడతలో రూ.387.53 కో ట్లు విడుదల కావడంతో పంచాయతీల ఖాతాలు నిధులతో కళకళలాడనున్నాయి.
ఎన్నికల ప్రక్రియ పూర్తై కొత్త పాల క వర్గాలు బాధ్యతలు స్వీ కరించడంతో ఈ నిధుల విడుదలకు మార్గం సుగమమైం ద న్న విషయం తెలిసిందే. అయితే మొదటి విడతలో రూ. 25 9.36 కోట్లు, రెండోవిడతలో రూ.387 కోట్లు విడుదల కాగా, ఇప్పుడు మూడో విడత నిధులతో గ్రామాల అభివృద్ధి పను లు మరింత వేగిరం కానున్నాయి. రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, వీధి దీపాలు వంటి మౌలిక వస తుల అభివృద్ధికి ఈ నిధులు ఉపయుక్తం కానున్నాయి.అదే సమయంలో పెండింగ్ బిల్లుల చెల్లిం పులు కూడా త్వరితగ తిన పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు రూ.2,000 కోట్ల పెండింగ్ నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉందని, ఆ మొత్తాన్ని త్వరగా విడుదల చేయాలని రాష్ట్ర మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
గ్రామ స్వయంపాలనకు బలంచేకూర్చే ఈ నిధులు పంచా యతీలను ఆర్థికంగా బలోపేతం చేసి తద్వారా గ్రామీణాభి వృద్ధికి కొత్త ఊపునిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు ఈ నిధులు సక్రమంగా వినియోగమైతే, గ్రామాల రూపురేఖ లు మారే రోజులు దూరంలో లేవని పరిశీలకులు భావిస్తు న్నారు.
