TUWJ journalist health Card : ప్రజా దీవెన, హైదరాబా ద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు క్యా ష్ లెస్ హెల్త్ కార్డులు ఇచ్చి హెల్త్ పాలసీ అమలు చేయాలని మీడి యా అకాడమీ మాజీ చైర్మన్, టీ యూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ డిమాం డ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన త ర్వాత గత ప్రభు త్వంలో జర్నలిస్టు లు పోరాడి సాధించుకున్న హెల్త్ కా ర్డు ను, ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం చేసిందో చె ప్పాలని ఆయన ప్రశ్నించారు. సోమాజి గూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం టీ యూడబ్ల్యూజే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో మా జీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి కాక ముందే, ఉద్య మ సమయంలో తను జర్నలిస్టులకు ఇచ్చిన మాట ప్రకా రం, ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఉద్యోగులతో సమానం గా హెల్త్ కార్డును జి ఓ 64 రూపం లో తీసుకువచ్చి కార్డులు ఇచ్చి అ న్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో చెల్లుబాటు అయ్యే లా అమలు చేశారని అల్లం నారాయణ చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం హాయంలో జర్నలిస్టు లకు ఇచ్చిన క్యాష్ లెస్ హె ల్త్ కార్డు వల్ల జర్నలిస్టులకు కోట్లాది రూపాయల వైద్య సహాయం అందిందని ఆయన గుర్తు చేశారు.
అదే కార్డు ఇప్పటి వరకు నిమ్స్ వంటి హాస్పి టల్స్ లో చెల్లు తుందని అన్నారు. నిన్న కేబినెట్ మీటింగ్ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలో ఉద్యోగులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డు స్కీమ్ లో జర్నలిస్టుల విషయం లేక పోవడం అత్యం త బాధాకరం ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జర్నలి స్టు లకు గత ప్రభుత్వం కంటే మెరు గైన విధంగా సంక్షేమ పథ కాలు అ మలు చేస్తామని చెప్పారని, కానీ కాంగ్రెస్ ప్రభు త్వం రాష్ట్రంలో అధి కారంలోకి వచ్చి రెండు సంవత్సరా లు పూర్తి అయినా జర్నలిస్టులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని అన్నారు.
కొత్తగా ఏమీ ఇవ్వకపోగా, ఉన్న అక్రెడిటేషన్ కార్డులలో కోత విధించడం, ఉన్న హెల్త్ కార్డును కూడా తీసివేయడం అత్యం త శో చనీయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ రా ష్ట్రంలో ఉన్న జర్నలిస్టులు కనబడం లేదా? అని ప్రశ్నిం చా రు. అసలు మీ దృష్టిలో జర్నలిస్టులు ఉన్నట్టా…? లేనట్టా..? అని అల్లం నారాయణ ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమం త్రి రే వంత్ రెడ్డిని నిలదీశారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎ న్నిక లకు ముందు హామీ ఇచ్చినట్టుగా ఉద్యోగులతో సమానం గా జర్నలిస్టులకు హెల్త్ కార్డును అమలు చేయాలని ఆ య న డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఈ హెచ్ ఎస్ మాదిరిగా ఇప్పటికే ఉన్న జె హెచ్ ఎస్ ను కూడా కొన సాగించాలన్నా రు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అమలు చేయకపో తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జర్నలి స్టుల ఉద్యమం ఎలా ఉంటుందో చూపిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్లపాటు పోరాడిన వాళ్లం, జర్నలిస్టుల ప్ర యోజనాల కో సం మరోసారి పోరా డుతామని అయిన హెచ్చరించారు.
టీయూడబ్ల్యూ జే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారు తీ సాగర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభు త్వం తెలంగాణ రాష్ట్రంలో జర్నలి స్టుల పై కక్ష పూరితంగా వ్యవహరి స్తోం ద న్నారు. ఒక వైపు అక్రెడిటేష న్ కార్డులలో కోత, మరో వైపు ఉ న్న హెల్త్ కార్డును కూడా తొలగించ డం దారుణం అన్నా రు. గత ప్రభు త్వంలో లాగే జర్నలిస్టులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డు అమలు చెయ్యా లని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా జ ర్నలిస్టులు ఉద్యమిస్తారని మారు తీ సాగర్ హెచ్చరించారు.
ప్రభుత్వ ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణి స్తే కోటి 20 ల క్షల బీమా సొమ్ము వ చ్చేలా చర్యలు తీసుకుంటున్న ప్ర భు త్వం గత ప్రభుత్వం జి ఓ నెం బర్ 22 తో జర్నలిస్టులకు, ఆ టో డ్రైవర్లకు, హోమ్ గార్డులకు అమ లు చేసిన 5 లక్షల ప్ర మాద బీమా పాలసీని ప్రీమియం కట్టి మరీ రె న్యువల్ చేయ కపోవడం దారుణ మన్నారు.ఈ విషయంలో ఇప్పటికే వారు కూడా ఆందోళన బాట పట్టా రనే విషయాన్ని గుర్తు చేస్తూ వెంటనే బీమా ప్రీమియం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ మీడియా సమావేశంలో తెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, టీయూ డబ్ల్యూ జే రాష్ట్ర కోశాధికారి పి. యోగనంద్, హైదరా బాద్ నగర ఇంచార్జ్ యార నవీన్ కు మార్, టీయూ డబ్ల్యూ జే నగర కోశాధికారి బాపు రావు, కే బుల్ చానెల్స్ జర్నలిస్టుల జేఏసీ నేత కడకంచి వెంకటేష్, టీయూడబ్ల్యూజే నేత లాయక్ పాషా తదితరులు పాల్గొన్నా రు.
