–ఫీజులివ్వని ప్రభుత్వం రూ.5వేల కోట్లతో గాంధీవిగ్రహమనడం సిగ్గు చేటు
–అప్పులు మాపై రుద్ది బడాకాం ట్రాక్టర్లకు దోచిపెడతామనడంన్యా యమేనా
–ఫీజుల రియంబర్స్మెంట్ పథకా న్ని నీరుగార్చాలని ప్రభుత్వం కుట్ర చేస్తుంది
–వారం రోజుల్లో ఫీజుల బకాయి లు విడుదల చేయకపోతే అసెంబ్లీ నీ ముట్టడిస్తాం
–గత రెండు సంవత్సరాల రాష్ట్ర బడ్జెట్ ఖర్చులఫై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి
–అఖిలపక్ష పార్టీలు విద్యార్థి మేధా వుల సమావేశంలో నేతల వెల్లడి
Student Unions Warn : ప్రజా దీవెన, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ము చ్చటగా మూడవసారి రాష్ట్ర బడ్జె ట్ ప్రవేశపెడుతున్న గత ఐదు సం వత్సరాలుగా ఉన్న 7వేల కోట్ల ఫీ జుల బకాయిలు మాత్రం విడుదల చేయకుండా పేద విద్యార్థుల ఉ సు రు తీసుకుంటుందని అఖిలపక్ష పా ర్టీల నేతలు విద్యార్థి సంఘాల నా యకులు, మేధావులు రాష్ట్ర ప్రభు త్వంపై తీవ్రంగా విరుచుకపడ్డారు
మంగళవారం హైదరాబాదులోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ వి ద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కాలేజీ విద్యార్థుల కన్నీటి చదువులు అనే అంశంపై అఖిలపక్ష పార్టీలు విద్యా ర్థి సంఘాలు మేధావులు బీసీ ఎ స్సీ ఎస్టీ సంఘాల విస్తృతస్థాయి సమావేశం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీని వాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్య క్షులు గొడుగు మహేష్ యాదవ్ అధ్యక్షత వహించగా జాతీయ అ ధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ స మన్వయం చేశారు.
ఈ సందర్భంగా హర్యానా మాజీ గ వర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లా డుతూ ప్రభుత్వాలు విద్యాపై పెట్టి న పెట్టుబడిని పెట్టుబడి కోణంలో చూడకుండా మానవ వనరుల అ భివృద్ధిగా చూడాలన్నారు, ము ఖ్యంగా బడుగుల విద్య విషయం లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి తగదని తక్షణమే పేద విద్యార్థుల కు చెల్లించాల్సిన ఫీజుల బకాయి లను చెల్లించాలని ఆయన డిమాం డ్ చేశారు.
బిజెపి పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల రి యంబర్స్మెంట్ సమస్యను ప్రైవేట్ కళాశాల యజమాన్యాల సమస్య గా చూస్తుందని, ఈ సమస్య రా ష్ట్రంలో ఉన్నత విద్యను చదువు కుంటున్న లక్షల మంది విద్యార్థుల బాధగా చూడాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని మార్లు విన్నవిం చిన ప్రభుత్వం బండరాయిలా మా దిరిందని కనీస స్పందన లేదని వి మర్శించారు ఒకవైపు వాస ప్రభు త్వం వేల కోట్లు అప్పులు మీద అ ప్పులు చేస్తూ అప్పుల ఊబిలో కూ రుకుపోయిందన్నారు, పాత బకా యిలు మేమెందుకు ఇస్తామం టు న్న కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభు త్వాలలో రావలసిన రాబడిని బ కాయిల రూపంలో వసూలు చేస్తుం దని, ప్రభుత్వానికి రావలసిన పా త బకాయిలు వసూలు చేసినప్పు డు, విద్యార్థులకు ఇవ్వాల్సిన బకా యిలు ఎందుకు ఇవ్వడం లేదని ఆ యన ప్రశ్నించారు. విద్యార్థుల శక్తి ని, తెలంగాణ స మాజ పోరాట చ రిత్రను రేవంత్ రెడ్డి తక్కువ అంచ నా వేస్తున్నాడని, ఈ వైఖరి మా ర్చుకోకపోతే విద్యార్థులు తెలంగా ణ సమాజం ఏకమై కాంగ్రెస్ ప్రభు త్వం గద్దదింపడానికి సిద్ధంగా ఉ న్నారని ఈటల హెచ్చరించారు.
మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్,ఎల్ రమణ లు మాట్లాడుతూ బీసీ ఎ స్సీ ఎస్టీ విద్యార్థులు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి లెక్క లేదని, అసెంబ్లీ లో, బయట ఫీజుల రియంబ ర్స్మెం ట్ నిధులు విడుదల చేయాలని పోరాటం చేస్తుంటే ప్రభుత్వం న యా పైసా కూడా విడుదల చేయ కుండా పేద విద్యార్థులను ఉసురు తీసుకుంటుందని వారు తీవ్రంగా విమర్శించారు. ఫీజు రియంబ ర్స్మెంట్ కోసం విద్యార్థి సంఘాలు చేస్తున్న పోరాటానికి టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజే స్తుందని, బకాయిల విడుదల కో సం ఈ బడ్జెట్లో నిధులు కేటాయిం చాలని వారు డిమాండ్ చేశారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అ ధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ చలనం లేని గాంధీ విగ్రహానికి 5 వేల కోట్లు ఖర్చు పెడ తామని చెబుతున్న ప్రభుత్వం, 22 లక్షల మంది పేద విద్యార్థులు ఫీజు ల రియంబర్స్మెంట్ రాక ఆత్మహ త్యలు చేసుకుంటే ప్రభుత్వానికి క నికరం లేదని గాంధీ విగ్రహానికి అ య్యే ఖర్చు ఫీజుల రియంబర్స్మెం ట్ కు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ఫీజుల రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా గాంధీ విగ్ర హాన్ని ఏర్పాటు చేస్తామంటే బీసీ స మాజ ఒప్పుకోదని ఆయన తెలిపా రు. దేశంలో ఒకవైపు ఏఐ జాతీ య సెమినార్ జరుగుతుంటే ఇం కొక వైపు ఫీజులు చెల్లించలేక పేద విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవ డం సర్కార్ కు సిగ్గుచేటని, గత రెండు సంవత్సరాల రాష్ట్ర బడ్జెట్ లో పేదలకు ఎన్ని నిధులు ఖర్చు పెట్టారో , బడా కాంట్రాక్టర్లకు ఎన్ని నిధులు విడుదల చేశారు శ్వేత ప త్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బడ్జెట్ ఉన్న ప్ప టికీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యా ర్థుల ఫీజుల నిధులు ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మనసు రావడం లేదని, బడా కాంట్రాక్టర్లకు వేలకో ట్లు దోచిపెడుతున్న ప్రభుత్వం బ డుగుల విద్యకు నయాపైసా విధిం చకుండా అన్యాయం చేస్తుందని ఆ యన ఆరోపించారు.
ఫీజుల రియంబర్స్మెంట్ నిధులు త క్షణమే విడుదల చేయాలని రెండు రోజుల్లోనే సిఎస్ ను, బీసీమంత్రు లను, డిప్యూటీ సీఎంలను కలు స్తామని వారి నుంచి సానుకూల స్పందన రాకుంటే మార్చ్ 16వ తే దీ నుండి జరిగే అసెంబ్లీ సమావేశా లను అడ్డుకుంటామని జాజుల శ్రీ నివాస్ గౌడ్ తీవ్రంగా హెచ్చరించా రు. ఈ సమావేశంలో ఈ సమావే శంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మల్కాజ్ గి రి ఎంపీ ఈటల రాజేందర్, బి ఆర్ ఎస్ మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జూలూరి గౌ రీ శంకర్, తెలంగాణ విటల్, ప్రొఫె సర్ సంఘని మల్లేశ్వర్, బిసి జేఎసి వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వా హక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివా స్ , ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షులు హే మ సబీసీ యువజన సంఘం జా తీయ అధ్యక్షులు కనకాల శ్యాంకు ర్మ, రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ సాగ ర , మహిళా సంఘం అధ్యక్షురాలు మని మంజరి గబీసీ ఉద్యోగుల సంఘం చంద్రశేఖర్ గౌడ్ , ప్రొఫెసర్ చలమల వెంకటేశ్వర్, బీసీ జేఏసీ జాజుల లింగం, టీజేఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు అరుణ్ కుమార్,పీడీఎస్ యు జనరల్ సెక్రె టరీ రాజేష్ టిఆర్ఎస్వి జనరల్ సె క్రెటరీ జంగయ్య, టిఎన్ ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు శివరాజ్, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్య క్షులు నరసింహనాయక్, బీసీ వి ద్యార్థి జెఎసి చైర్మన్ బొల్లెపల్లి స్వా మి, ఓయు జెఎసి నాయకులు వి జయ్, ఈడిగ శ్రీనివాస్ గౌడ్ తదిత రులు పాల్గొన్నారు.





