Monday, September 28, 2026
More
    HomeOpinionNalgondaSP SharathChandra Holifestival : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్రఅప్పీల్, సహజసిద్ధమైన రంగులతోనే హోళీ సంబరాలు...

    NalgondaSP SharathChandra Holifestival : నల్లగొండ ఎస్పీ శరత్ చంద్రఅప్పీల్, సహజసిద్ధమైన రంగులతోనే హోళీ సంబరాలు నిర్వహించాలి

    📰 Generate e-Paper Clip

     

    NalgondaSP SharathChandra Holifestival : ప్రజా దీ వెన, నల్లగొండ: దేశ వ్యాప్తoగా రేపు నిర్వహించుకోనున్న హోళీ పండుగ సందర్భంగా నల్లగొండ జిల్లా ప్రజలందరూ స హజసిద్ధమైన రంగులతోనే హోళీ సంబరాలు నిర్వహించు కోవాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అప్పీల్ చేశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలి పా రు. హోలీ పండుగను సాంప్రదాయబద్ధంగా, పరస్పర గౌర వంతో, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వహించుకోవాలని జిల్లా ప్రజలను కోరారు.

    హోళీ వేడుకల సందర్భంగా సహజసిద్ధమైన రంగులను మా త్రమే ఉపయోగించాలని, హానికరమైన రసాయనిక రంగు లను వాడకూడదని సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలి గించే విధంగా బలవంతoగా రంగులు చల్లడం, నీటి బె లూ న్లు విసరడం వంటి చర్యలు చేయరాదని హెచ్చరించారు. ప్రార్థనా మందిరాలు, ప్రజా ప్రదేశాలు, రహదారులపై వాహ నదారులకు ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తించవద్దని తెలిపారు.

    మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తిం చాలని, ఎవరైనా ఆక తాయిలు వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుం టామని స్పష్టం చేశారు. ఇందుకోసం జిల్లాలో షీటీమ్ బృం దాలను ప్రత్యేకంగా మోహరిం పజేసి, ప్రధాన కూడళ్లలో మ రియు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిఘా ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు.

    పండుగ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడప రా దని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తా మ ని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప రమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత వాహ నాలను అతివేగంగా నడపకుండా జాగ్రత్తగా ఉండాలని, రో డ్డు ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తంగా వ్యవహరిం చాలని సూచించారు.

    ఈత రాని వారు చెరువులు, కుంటలు, కాలువల వద్దకు వెళ్ల కూడదని, చిన్నపిల్లలను అటువంటి ప్రదేశాలకు తీసుకెళ్లరా దని విజ్ఞప్తి చేశా రు. లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాలకు గు రికాకుండా తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూ చించారు.పండుగ వేళ ఎవరైనా గొ డవలు సృష్టించినా, అస త్య ప్రచారం చేసినా, సామాజిక మాధ్యమాల ద్వారా అపో హలు వ్యాప్తి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

    జిల్లా ప్రజలందరూ కలిసిమెలిసి, పరస్పర గౌరవంతో ఇతరు లకు ఆటంకం కలగకుండాసురక్షితంగా హోళీ పండుగను జ రుపుకొని పోలీ సులకు సహకరించాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.