Monday, September 28, 2026
More
    HomeOpinionAmanagallu Fire Accident : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా ఆమ నగల్లులో అపశృతి, అగ్నిగుండం...

    Amanagallu Fire Accident : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ జిల్లా ఆమ నగల్లులో అపశృతి, అగ్నిగుండం లో చిక్కుకున్న భక్తులు 

    📰 Generate e-Paper Clip

    Amanagallu Fire Accident : ప్రజా దీవెన, మిర్యాలగూ డ: తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలోని వేములపల్లి మండలం ఆమనగల్లులో జరిగిన శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక జాతరలో అనుకోని అపశృతి చో టుచేసుకుంది. భక్తి ఉత్సాహం మధ్య జరిగిన ఈ సంఘటన క్షణాల్లోనే ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించింది.

    జాతరలో భాగంగా భక్తులు అగ్నిగుండం దాటే ఆచారంలో పాల్గొం టుండగా ఒక్కసారిగా తోపులాట జరిగింది. జన సమ్మర్ధం పెరగడంతో కొందరు భక్తులు అదుపు తప్పి ని ప్పు ల గుండంలో పడిపోయారు. ఈ ప్రమాదంలో పది మంది భక్తులకు గాయాలయ్యాయి. అక్కడే విధుల్లో ఉన్న పోలీసు లు, నిర్వాహ కులు వెంటనే స్పందించి నిప్పుల్లో పడ్డ వారిని బయటకు లాగి రక్షించారు.

    గాయపడిన భక్తులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అంది స్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉ న్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరా లు అధికారులు సేకరిస్తున్నారు. ఈ సంఘటనతో జాతరల సమయంలో భద్రతా ఏర్పాట్లు మరింత బలోపేతం చేయా ల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతు న్నా రు. భవిష్యత్తులో ఇలాంటి అపశృతులు పునరావృతం కా కుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.