Gold Prices crashed: ప్రజా దీవెన, హైదరాబాద్: అంత ర్జాతీయ మార్కెట్‌లో మారు తున్న పరిస్థితుల ప్రభావంతో పసి డి ధరలు వరుసగా ఐదోరోజు కూడా పడిపోతున్నాయి. బంగారం ధరలు ఇలా క్షీణించడం పెట్టుబడి దారులను ఆ శ్చర్యానికి గురిచేస్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే తులం బం గారం ధర దాదాపు రూ.11 వేల వరకు పడిపోవడం మార్కె ట్ లో చర్చనీయాంశంగా మారింది.హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం బాటలోనే వెండి ధర లు కూడా స్వ ల్పంగా తగ్గుముఖం పట్టాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.770 త గ్గి ప్రస్తుతం రూ.1,62,110 వద్ద కొనసా గుతోంది. అదేవిధం గా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా రూ.700 తగ్గి రూ.1,48,600కి చేరింది. పసి డి ధరలు తగ్గుతుండటం తో కొను గోలు దారుల్లో కొంత ఆసక్తి పెరుగుతున్నప్పటికీ, మార్కెట్ పరిస్థితులపై అందరి దృష్టి ఉంది.
బంగారం బాటలోనే వెండి ధరలు కూడా స్వల్పంగా పడి పో యాయి. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని విజయ వాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో కూడా దాదాపు ఇదే ధ రలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం కొనసాగితే బంగారం ధరల్లో ఇంకా మార్పులు వచ్చే అవ కా శముందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.ఇదిలా ఉం డగా శుక్రవారం ఉద యం మార్కెట్లలో ఒక ఆ స క్తికర మైన పరిణామం చోటుచేసు కుం ది. మధ్యప్రాచ్యంలో అమెరికా ఇ రాన్ యుద్ధ ఉద్రిక్తతలు పెరగడం తో ప్రపంచ పెట్టుబడి దారులు మళ్లీ “సురక్షిత పెట్టుబడి”గా భావించే బంగారం, వెండి వైపు పరుగులు తీశారు. ఈ ప్రభావం భారత దే శం లోని Multi Commodity Exc hange (MCX) మార్కెట్ పై నా స్పష్టంగా కనిపించింది.
MCXలో ఏప్రిల్ ఫ్యూచర్స్ కాంట్రా క్ట్‌లకు బంగారం ధర శుక్ర వారం 0. 85 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 1,61,040 వద్ద ప్రారంభ మైం ది. గురువారం ముగింపు ధర రూ. 1,5 9,673తో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. కొంతసే పటికే దేశీయ మార్కెట్లో బంగారం రూ. 1, 61,250 వరకు ఎగబాకింది. వెండి అయితే మరింత వేగంగా ఎగబా కింది. మే ఫ్యూచర్స్ కాంట్రాక్టులకు MCXలో వెండి ధర రూ. 5,7 59 (2. 19%) పెరిగి కిలోకు రూ. 2,67,95 0 వద్ద ప్రారంభ మైంది.మార్కెట్‌లో కొద్ది గంటల్లోనే వెండి రూ. 2,68,9 91 స్థాయిని తాకింది.
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం
ప్రపంచ బులియన్ మార్కెట్లలో కూడా ఇదే ధోరణి కనిపిం చింది.స్పాట్ బంగారం ధర ఔన్సుకు రూ. 5,076.09 వద్ద నిలవగా అమెరికా బంగారం ఫ్యూచర్స్ రూ. 5,084. 50 వద్ద ట్రేడ్ అయ్యాయి. స్పాట్ వెండి ధర రూ. 82.26కి చే రింది.ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటివరకు బంగా రం ధరలు దాదాపు 18 శాతం పెరిగి వరుస రికార్డులు సృ ష్టించాయి.
యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పె రగడం ప్రధాన కారణంగా మారింది. ఇరాన్, ఇజ్రాయిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ లపై దాడులు ప్రారం భించగా పరిస్థితి మరింత ఉద్రిక్తమైందని మార్కెట్ పరిశీల కులు భావిస్తున్నారు.మొత్తం మీద, ప్రపంచ రాజకీయ ఉద్రి క్తతలు పెరిగినప్పుడ ల్లా పెట్టు బడిదారులు బంగారం, వెండి వం టి లోహాలను ఆశ్రయిస్తారనే విష యం మరోసారి స్పష్ట మైందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
