Tuesday, September 29, 2026
More
    HomeOpinionDistrict Collector Chandrasekhar : జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య, హెచ్‌పీవీ వ్యాక్సిన్ తో...

    District Collector Chandrasekhar : జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్య, హెచ్‌పీవీ వ్యాక్సిన్ తో భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షణ

    📰 Generate e-Paper Clip

    District Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్ల గొండ: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 14నుం డి 15 సం వత్సరాలలోపు బాలి క లకు హెచ్‌పీవీ (HPV) వ్యాక్సిన్ కా ర్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించిన ట్లు జిల్లా కలెక్టర్ బడుగు చంద్రశే ఖ ర్ తెలిపారు. ఆదివారం ప్రభుత్వ కేంద్ర ఆస్పత్రిలో బాలికలకు హెచ్ పివి వాక్సికేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీని వాస్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా మొ దటి దశ లో 21 వేల మంది బాలికలను గు ర్తించినట్లు తెలి పారు. వారికి తల్లి దండ్రుల సమక్షంలో టీకా వేయించడం జరుగుతుందని పేర్కొన్నా రు.హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవ డం వల్ల భవిష్యత్తులో వచ్చే సర్వై కల్ క్యాన్సర్ (గర్భాశయ ద్వార క్యాన్సర్) నుండి రక్షణ పొందవచ్చని చెప్పారు. అర్హు లైన బాలికల వి వరాలను ఆధార్ కార్డు ఆధారంగా నమో దు చేయడం జరుగుతుందని, టీకా తీసుకున్న వారికి సం బంధిత సర్టిఫికెట్లు కూడా అందజేస్తామని తెలిపారు.

    జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమంపై తల్లిదండ్రులు, బాలికలకు అవగా హన కల్పించాలని ఆరోగ్యశాఖ అధికారులకు సూ చించారు.వ్యాక్సిన్ అందరు ఉపయోగించుకోవాలని ప్రభు త్వ ఆసుపత్రిలో పిహెచ్ సెం టర్లో వేయించుకోవాలని ప్రైవే ట్ సెంటర్లో వెళ్లినచో డబ్బులు ఖర్చు అవుతుందని ప్రభుత్వ ఆస్పత్రి సెం టర్లో ఫ్రీగా ఇవ్వడం దశలవారుగా వ్యాక్సిన్ వే యడం జరుగుతుంది అన్నారు. అర్హులైన ప్రతి బాలిక ఈ టీకాను తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి లుపునిచ్చా రు.

    నల్లగొండ నగర పాలక సంస్థ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వ్యాక్సిన్ తీసుకోవ డం వల్ల బాలికలు ఆ రోగ్యంగా ఉంటారని క్యాన్సర్ రాకుండా నివారించవచ్చని మహిళలు స్ట్రాంగ్ గా ఉంటే సమాజం బాగుంటుంది మహి ళలు ముందుజాగ్రత్తగా వ్యాక్సిన్ వేసుకోవడం చాలా మంచి దని చెప్పారు.

    ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్ డిప్యూ టీ అధికారి వేణుగోపాల్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సూపర్డెంట్ నగేష్ ఆర్ ఎమ్ఓ మహేష్. మాజీ ము న్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, 42 డివిజన్ కార్పొరేటర్ నాగ ల క్ష్మి, 41 డివిజన్ కార్పొరేటర్ వేణు గో పాల్ రెడ్డి 20 కార్పొ రేటర్ అల్లి సు భాష్ డాక్టర్ పుల్లారావు డాక్టర్ రమేష్ తదిత రులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.