–
District Collector Badugu Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: పల్లె ప్రకృతి వనాలు శుభ్రంగా, ఆహ్లాదక రంగా ఉండే విధంగా నిర్వ హించాలని జిల్లా కలెక్టర్ బి.చం ద్రశేఖర్ అన్నారు. ఆదివారం ఆయన నల్లగొండ మండలం చందనపల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు లను సందర్శించారు. పల్లె ప్రకృతి వనంలో మంచి పూల మొక్కలు, నీడని చ్చే చెట్లు ఇతర ఉపయోగకరమైన మొక్క లను పెంచాలని సూచించారు. గ్రామ ప్రజలు, పిల్లలు విశ్రాం తి తీసుకునేలా ప్రకృతి వనాన్ని అందంగా తీర్చిదిద్దాలన్నా రు.
అలాగే గ్రామంలో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్‌ను సమర్థ వంతంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చెత్త ను ఎక్కడపడితే అక్కడ వేయకుండా డంపింగ్ యార్డ్ లోనే వేయాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని అధికా రులకు తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పం చాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు కలిసి పనిచేయాలని కలెక్ట ర్ తెలిపారు.పరిశుభ్రతపై ప్రత్యేకశ్రద్ధ తీసుకుం టే గ్రామాలు మరింత అందంగా మారుతాయన్నారు. గ్రామపంచా యతీ సర్పంచ్, కార్యదర్శి తదితరులు ఉన్నారు.

