Monday, September 28, 2026
More
    HomeOpinionMinister KomatiReddy VenkataReddy : మహిళలు పురుషులతో సమానం గా ఎదగాలి

    Minister KomatiReddy VenkataReddy : మహిళలు పురుషులతో సమానం గా ఎదగాలి

    📰 Generate e-Paper Clip

     

    Minister KomatiReddy VenkataReddy: ప్రజా దీవెన, నల్లగొండ: మహిళల ను పురుషులతో సమానంగా, ఆర్థి కం గా ఎదిగేలా చురుకుగా తయా రు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మం త్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం ఆయన న ల్గొండ జిల్లా కేంద్రంలోని సెట్వి న్ సంస్థలో కుట్టుమిషన్ల ద్వా రా శిక్షణ పొందిన 116 మంది మహిళలకు కుట్టు మిషన్ల ను,సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.

    ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు ఎవరు ఖాళీగా ఉం డవద్దని, పట్టుదలతో ఏదో ఒక కో ర్సులో శిక్షణ పొంది స్వయం ఉపా ధి ఏర్పాటు చేసుకోవాలని అన్నా రు. నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పా టు చేసిన సెట్విన్ శిక్షణ సం స్థ ను రాష్ట్రంలోనే నంబర్ వన్ సంస్థగా తీర్చిదిద్దాలన్నారు. ఈ సంస్థ ద్వా రా ఇప్పటివరకు 27 కోర్సులలో 1250 మం దికి శిక్షణ ఇవ్వడం జరిగిందని, శిక్షణ పొందిన మహిళ లు సంఘాలుగా ఏర్పాటయితే వారు స్వయం ఉపాధి పొందేం దుకు ప్రభుత్వం ద్వారా రుణాలు ఇప్పిస్తామని, అలాగే స్కూలు విద్యార్థుల యూనిఫాం కుట్టే పనిని సంఘాలకే అప్పచెబుతామని మంత్రి తెలిపారు.

    కలెక్టరేట్ కార్యాలయం వద్ద న్యాక్ శిక్షణ సంస్థ ఏర్పాటు చే సి దాని ద్వారా కూడా శిక్షణ ఇస్తున్నామని, 200 కోట్ల రూ పాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పా ఠశాల నిర్మాణంలో ఉందని, అలాగే నూతన కలెక్టరేట్ కూ డా ని ర్మాణంలో ఉందని, ఇవన్నీ పూర్త యితే ఎలక్ట్రిషన్, ప్లంబర్ తదితర కోర్సులలో శిక్షణ పొందిన వారికి ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు దొరు కుతాయని అన్నారు. అలాగే కం ప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ప్రభుత్వ పాఠ లలో ఇన్స్ట్రక్టర్లుగా నియమిస్తామని మంత్రి వెల్లడించారు. నల్గొండ సె ట్ విన్ ద్వారా ఇంకా మరిన్ని కోర్సులను ఏర్పా టు చేయాలని, అందరికీ పని చూయించాలని, మహి ళలు ఎప్పుడు చురుకుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, పిల్ల ల చదువు, అభివృద్ధికి మహిళలు, పు రుషులు కలిసి పని చేస్తేనే సాధ్యమవుతుందని అన్నారు.

    అనంతరం మంత్రి మీడియా ప్రతి నిధులతో మాట్లాడుతూ త్వరలోనే మూసి ప్రక్షాళన చేపట్టనున్నామని, మూసి వల్ల భూగర్భ జలాలు కలు షితమై నల్గొండ జిల్లాలోని 30 లక్ష ల మంది ప్రజలు బాధపడుతున్నా రని, దీనిని దృష్టిలో ఉంచు కొని ప్ర భుత్వం మొదటి దశలో 21 కిలో మీటర్లు, రెండవ ద శలో మరో 21 కిలోమీటర్లు మూసి ప్రక్షాళనకు టెండర్లు పి లువైన ఉన్నదని, ప్ర భుత్వం చేపట్టిన ఈ మంచి కార్యక్ర మానికి ప్రతిపక్షాలు ఎవరు అడ్డు పడవద్దని కోరారు .డిండి ప్రాజెక్టు పై మంత్రి మాట్లాడుతూ గతంలో చెప్పిన ప్రకారం డిండి ప్రాజెక్టు టెండర్లు పిలిచి వెంటనే పనులు ప్రారం భిం చాలని రాష్ట్ర నీతిపారుదల శాఖ మంత్రి కి ముఖ్యమంత్రి ఆదేశిం చిన విషయాన్ని గుర్తుచేశారు.

    సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ నాయిపుణ్య భి వృద్ధి ద్వా రా స్వయం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో గ తంలో కేవలం జంట న గరాగాలకు మాత్రమే పరిమితమై న సెట్విన్ ను జిల్లాలకు విస్తరించ డం జరిగిందని, ప్రతి సంవ త్సరం 25,000 మందికి శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో ముం దుకు వెళుతున్నట్లు తెలిపారు.

    నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మ హి ళలు ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒక కోర్సులో శిక్షణ పొందా ల ని, సెట్విన్ ద్వారా ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా కలెక్ట ర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ శి క్షణ పూర్తి చేసుకు న్న మహిళలు ఖాళీగా ఉండకుండా స్వయం ఉ పాధి చూ సుకోవాలని, స్వయం సహాయక మహిళా సంఘాలలో స భ్యులు చేరితే బ్యాంకు నుండి రు ణాలు ఇప్పిస్తామని, 10 నుండి15 మంది ముందుకు వస్తే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కింద సహకారం అందిస్తామని, ప్రభుత్వం ద్వారా యూనిఫార్మ్స్ కుట్టించే అవకాశం తో పాటు, ఇతర ఉద్యోగా లు కల్పి స్తామని తెలిపారు.

    రాబోయే కాలంలో ఈవి వాహనాలు ,ఆటో ట్రాలీలకు మంచి డిమాం డ్ ఉందని, ఇలాంటివన్నీ నేర్చుకోవాలని, నేర్చుకు న్న శిక్షనను వది లివేయకుండా ఉద్యోగాలు చూసు కోవా ల ని తెలిపారు. సెట్విన్ మేనే జింగ్ డైరెక్టర్ ఉపేందర్ రెడ్డి ,జి ల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆఫీస్ ఖాన్, డిప్యూటీ మేయ ర్ అమీర్ అలీ, తదితరులు మాట్లాడారు. ఈ సం దర్భంగా మంత్రి కుట్టుమిషన్లు, క ళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చే శారు.ఈ కార్యక్రమంలో స్థానిక సం స్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, సెట్విన్ ప్రిన్సిపల్ రే ణుక తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.