–కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రా నికి అన్యాయమైనా చోద్యం చూ స్తున్న కాంగ్రెస్ సర్కార్
–ఆంధ్రాకు దాసోహమై కుట్రలు చే స్తున్న ఏపీ, కేద్ర ప్రభుత్వాలు
–ఢిల్లీ మీటింగ్ మినిట్స్ వచ్చి నెలై నా రేవంత్ స్పందించడం లేదు
–మొద్దు నిద్ర వీడి నీటి హక్కులను కాపాడాలి,లేఖల డ్రామాలుఆపాలి
–అసెంబ్లీ మీడియా హాల్‌లో కాంగ్రె స్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీ శ్ రావు ఫైర్
Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరాబాద్: చే తకాని, బాధ్యతలేని, ముందుచూపు లే ని రేవంత్ రెడ్డి ప్రభు త్వ వైఖరి వల్ల కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలం గాణకు తీవ్ర అన్యాయం జరుగు తోందని, రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్ర దేశ్ కు తాకట్టు పెట్టారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో ధ్వ జమెత్తారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడు తూ నీటి హక్కుల సాధనలో గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషిని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు. కాంగ్రె స్ మొద్దు నిద్రను వదిలించేందుకే బీఆర్ఎస్ పక్షాన పదేపదే నిలదీ స్తున్నామని ఆయన స్ప ష్టం చేశారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు చేసి న వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…
సమైక్య రాష్ట్రంలో నీళ్ల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యా యా న్ని సరిదిద్దేందుకు గత తొ మ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీ ఆర్ నిరంతరం శ్రమించారు. కృష్ణా నదిలో జరిగిన నష్టాన్ని పూడ్చేందు కు కృష్ణా ట్రిబ్యునల్ సాధించి, నీటి పునఃపంపిణీ జరిగేలా చూశారు. గోదావరి నదిలో బ చావత్ ట్రిబ్యు నల్ అవార్డు ప్రకారం తెలంగాణకు ఉన్న హక్కులను కేసీఆర్ శాశ్వ తంగా కాపాడారు. గోదావరిలో ఉన్న 1400 టీఎంసీల నీటిలో 968 టీఎంసీలు తెలంగాణ కు, 518 టీఎంసీలు ఏపీకి కేటా యించారు. మన 968 టీ ఎంసీల హక్కులను స్థిరపరచడానికి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు కట్టి, 400 టీఎంసీల ప్రాజెక్టులకు అనుమతు లు సాధించిన ఘనత కేసీఆర్ దే.ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజే పీ, ఏ పీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం కలిసి తెలంగాణకు తీవ్ర అన్యా యం చేస్తున్నాయి.
కృష్ణాలో నీటి దోపిడీ చేసిన ఏపీ.. ఇప్పుడు ఆదమరిచి నిద్ర పోతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ చేతకానిత నాన్ని ఆసరాగా చేసుకుని గోదావ రి జలాలపై పడింది.మేము ప్రతిప క్షంగా నిలదీసిన ప్రతిసారీ ఉలి క్కి పడి లేచి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రా నికి లేఖలు రాస్తోంది. బహుశా ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగా ను కాబట్టి, సాయంత్రానికి మళ్లీ ఏ దైనా లేఖ రాసే డ్రామా ఆడుతుందేమో.
జనవరి 30న ఢిల్లీలో రెండు రా ష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధి కారుల సమావేశం జరిగింది. ఆ మీటింగ్ ద్వారా తెలంగాణ నీటి హక్కులను హరించేందుకు ఏపీ పక్కా స్కెచ్ వేసింది. కేంద్రంలోని బీజేపీ అండ చూసుకుని గోదావరి నీళ్లను దోచు కునేందుకు టీడీపీ ప్లాన్ చేసింది. గోదావరిలో ఏ రాష్ట్రానికీ బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చే యలేదని ఏపీ వాదించడం దుర్మార్గం.
ఢిల్లీ మీటింగ్‌కు సంబంధించిన మి నిట్స్ ఫిబ్రవరి 12నే రా ష్ట్రానికి వ చ్చాయి. ఈరోజు మార్చి 16. నెల రోజులు దాటి పోయినా అందులో తెలంగాణకు జరుగుతున్న అన్యా యం పై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు స్పందించలే దు.రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రాన్ని చంద్రబాబు కు తాకట్టు పెట్టారా? లేక దాసోహం అయ్యారా? గోదావరి, బనకచర్ల అంశాలు ఎజెండాలో లేకపోతేనే ఢిల్లీ మీటిం గ్‌కు వెళ్తామని ముందు చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ ప్రభు త్వం పోలవరం, నల్లమల్ల సాగర్ అంశాలను ఎ జెండాలో పెట్టినా కూడా మోకాళ్ల మీద పరిగెత్తుకుంటూ వెళ్లి మీటింగ్ లో కూర్చుంది.
తెలంగాణకు ద్రోహం చేసిన ఆది త్యనాథ్ దాస్‌ను చైర్మన్‌గా చేసి దొంగ చేతికే తాళాలు ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీటింగ్ మినిట్స్ పేజీ 3లో రాష్ట్రాల మధ్య గోదావరి జలా ల కేటాయింపులు అసలు లేవని ఏపీ స్పష్టంగా చెప్పి నట్లు ఉంది. దీనిపై ఇప్పటిదాకా ప్రభుత్వం స్పం దించలేదంటే, తె లంగాణకు వాటా లేదని అంగీకరించినట్టే కదా. బచా వత్ ట్రిబ్యునల్ కేటాయింపులు చే యకపోతే గోదావరిపై పలు రాష్ట్రా లలో సెంట్రల్ వాటర్ కమిషన్ 76 ప్రాజెక్టులకు ఎలా అనుమతులు ఇచ్చింది. ట్రిబ్యునల్ అవార్డును ప్రశ్నించే హ క్కు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఎక్కడిది.
ఏపీ సర్కార్ ట్రిబ్యునల్‌ను ధిక్కరించడం అంటే రాజ్యాం గా న్ని ధిక్కరించడమే, తెలంగాణ హక్కులను కాలరాయ డ మే.బీఆర్ఎస్ అధి కారంలో ఉన్నప్పుడు సీతారామ ప్రాజె క్టుకు అనుమతులు తెచ్చాం. అప్పుడు ఏపీకి 531 టీఎం సీ ల వాటా ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టు కునే సీతారామ ప్రాజెక్టుకు (67 టీఎంసీలు) సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చింది. జూన్ 2023లో సీడబ్ల్యూసీ ఇచ్చి న రిపోర్టులో గోదావరిలో 3396 టీ ఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని, అందు లో ఏపీ వాటా పోనూ మిగిలినవన్నీ తెలంగాణవేనని స్ప ష్టం చేసింది.కానీ ఇప్పుడు ఏపీ ఏకంగా 775 టీఎంసీలు కా వాలని కొట్లాడుతోంది.కృష్ణా నదిలో కనీసం 34 శాతం తా త్కాలిక వాటా ను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుకో లేకపోతోంది.
బీఆర్ఎస్ హయాంలో 18 టెలిమె ట్రీలు ఏర్పాటు చేశాం. కానీ, టెలి మెట్రీల నిర్వహణ కోసం ఇచ్చిన రూ. 4.5 కోట్లను కేఆర్ఎంబీ అధి కారులు తమ జీతాలకు వాడుకుని, బ్రిజేష్ కుమార్ అవార్డు వచ్చే దాకా కొత్త టెలిమెట్రీలు పెట్టేది లేదని తేల్చిచెప్పారు. దీనిపై కాం గ్రెస్ ప్రభుత్వం ఎందుకు నోరు మె దపడం లేదు? ఏపీ అసెంబ్లీ బడ్జెట్ స మావేశాల్లో అక్కడి గ వర్నర్ ప్రసంగిస్తూ నల్లమల్ల సాగర్ నుంచి నీళ్లు తీసుకెళ్ల డా నికి పనులు ము మ్మరం చేస్తున్నామని గర్వంగా చెప్పారు.
మరి తెలంగాణ గవర్నర్ స్పీచ్‌లో.. నల్లమల్ల సాగర్‌ను అ డ్డుకుంటామని, గోదావరిలో చుక్క నీటిని కూడా వదులుకో మని ఈ ప్రభుత్వం ఎందుకు చెప్పించలేకపోయింది.రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఢిల్లీ మీ టింగ్ మినిట్స్‌పైనా స్పందించదు. గ వర్నర్ ప్రసంగంపైనా మాట్లాడదు. కృష్ణాలో 80 శాతం నీళ్ల ను ఏపీ తరలించుకుపోతున్నా నోరు మెదపరు. కృష్ణాతో పాటు గోదావరి నీళ్లను కూడా ఏపీ దోచుకు పోకుండా ఇప్ప టికైనా మొద్దు నిద్ర వీడి వెంటనే ఆ మీటింగ్ మినిట్స్‌పై గట్టి గా అభ్యంతరం తెలపాలి.
తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకు నేందుకు గతంలో చంద్రబా బుఎన్ని కుట్రలు చేశారో, ఎన్ని లేఖలు రాశా రో రాష్ట్ర ప్రజల కు తెలుసు. వెంట నే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తె లంగా ణ నీటి హక్కులను కాపాడా లని బీఆర్ఎస్ పక్షాన డిమాం డ్ చేస్తున్నామని వ్యాఖ్యానించారు.


