Monday, September 28, 2026
More
    HomeOpinionNalgonda Collector B. Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీ ల్, పీఎం సూర్య...

    Nalgonda Collector B. Chandrasekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అప్పీ ల్, పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకంలో నమోదుకు అ వగాహన కల్పించoడి 

    📰 Generate e-Paper Clip

    Nalgonda Collector B. Chandrasekhar : ప్రజా దీవెన నల్లగొండ: “ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజ న” పథకం కింద జిల్లా లో ఎక్కువ మంది లబ్ధిదారులు వి నియోగించుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖర్ అన్నారు.మంగళవారం ఆయన “ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజన” పథకంపై ప్రజల కు అవగాహన కల్పించేం దు కు ఉద్దేశించి ఏర్పాటుచేసిన ప్రచా ర రథాన్ని జిల్లా కలెక్టర్ కార్యాల యం వద్ద ఆయన మంగళవారం ప్రారంభించారు.

    కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేసే ఈ పథకం కింద గృహ విద్యుత్ వినియోగదారులు వారి ఇంటి రూ ఫ్ టాప్ పై ఒక కిలో వాట్ సోలార్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకొంటే ప్ర తినెల 436 రూపాయల ఆదాయా న్ని పొందవచ్చని, 2 కిలో వాట్ల యితే రూ.1328, 3 కిలో వాట్లకు రూ. 2330  ఆదాయం పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. ఒక కిలోవాట్ రూఫ్ టాప్ సోలార్ ప్లాం ట్ ఏర్పాటుకు రూ. 30వేలు ఖర్చవుతుండగా, ప్రభుత్వం రూ. 18 వేల సబ్సిడీని ఇస్తుందని, రెండు కిలోవా ట్లకు 60వేల రూపాయలు, 3 కిలో వాట్లకు 78 వేల రూపా యలు ఖర్చువుతుందని తెలిపారు.

    ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ నేరుగా వి నియోగదారుని బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ రూప్ టాప్ సో లార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం ద్వా రా ప్రతి గృహ విద్యుత్ విని యోగదారునికి నెలకు 360 యూ నిట్ల వరకు విద్యుత్తు వస్తుందని, సోలార్ ప్లాంట్ ద్వా రా నెలసరి వి ద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవడమే కా కుండా, విద్యుత్ బిల్లులు, కాలుష్యాన్ని కూడా తగ్గించుకోవ చ్చని తెలిపారు. దీని ద్వారా గృహ విద్యుత్ వినియోగ దా రులకు అద నపు ఆదాయం వస్తుందని, మిగులు విద్యుత్ ను గ్రిడ్ కు సరఫరా చే స్తే నెట్ మీటరింగ్ ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు అని ఆయన వెల్లడించారు.

    గృహ విద్యుత్ కనెక్షన్ ఉన్న విని యోగదారులందరూ ఈ పథకానికి అర్హులని, సోలార్ కు అనుకూలమైన సొంతరూఫ్ టాప్ ఉండాల ని, గతంలో సోలార్ సబ్సిడీ పొంది ఉండరా దని తెలిపారు .ఆసక్తి ఉ న్నవారు www.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. మూడు కిలో వా ట్ల వరకు సోలార్ వ్యవస్థకు ఎలాంటి ష్యురిటీ అవ సరం లేని వడ్డీ రుణ సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పి స్తుందని ఆయన వెల్లడించారు.సబ్సిడీ పొందేందుకు లబ్ధి దారులు బ్యాంక్ అకౌంట్ వివరాలు, విద్యుత్తు మీటర్ నంబ ర్ ను ఇస్తే సరిపోతుందని ఆయన వెల్లడించారు.

    ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం కిం ద ఎక్కు వ మంది వినియోగదారులు సద్వి నియోగం చేసుకునే విధంగా జిల్లా లో అవగాహన కల్పించాలని, ఆస క్తి ఉన్న వారి పేర్లను ఏప్రిల్ 2న ని ర్వహించే “ప్రజా పాలన -ప్రగతి ప్ర ణాళిక” గ్రామ సభలో రిజిస్టర్ చే సుకోవాలని అధి కారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెడ్ కో జిల్లా మే నేజర్ బి. సంతోష్ కుమార్, జిల్లాఉద్యాన శాఖ డిడి సుభా షిణి, ఉద్యాన అధికారి అనంత రె డ్డి,కలెక్టరేట్ ఏ ఓ మోతి లాల్ తదితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.