–నల్గొండ జిల్లా పట్టు పురుగుల పెంపకానికి అంతా అనుకూలం
–రైతులు పట్టుపురుగుల పెంపకం పైదృష్టి సారించాలి
— నల్లగొండ జిల్లా కలెక్టర్ బడుగు చంద్ర శేఖర్ పిలుపు
Nalgonda district collector chandrashekhar: ప్రజా దీవెన, నల్లగొండ: పంట మా ర్పిడిలో భాగంగా రైతులు పట్టు పురుగుల పెంపకంపై దృష్టి సారిస్తే అ ధిక లాభాలు పొందవ చ్చని జిల్లా క లెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. బుధవారం అ యన నల్గొండ జిల్లా క నగల్ మండలం నరసింహపురం లో రైతు పుండరీకం సాగు చేస్తున్న పట్టుపురుగుల పెంపకం కేం ద్రాన్ని సందర్శించారు.పట్టుపురుగుల పెం పకానికి ఉపయో గ పడే భూములు, విస్తీర్ణం, పెట్టుబడి ఖర్చు, వాతావరణ అ నుకూలత, కూలీలు త దితర వివరాలను రైతు పుండరీకం ద్వారా జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
పట్టుపురుగుల పెంపకం రైతు పుండరీక మాట్లాడుతూ ప ట్టు పట్టుపు రుగుల పెంపకానికి కేంద్ర రాష్ట్ర ప్ర భుత్వాలు సబ్సిడీ ఇస్తున్నాయని, ఒక ఎకరాకు పెట్టుబడి 8 నుండి 1 0 లక్షలు ఖర్చు అవుతుందని, ప్రతి సంవత్సరం 8 పంటలు తీయవచ్చ ని, ఒక పంటకు లక్ష రూపాయల నుండి నాలు గు లక్షల వరకు ఆదా యం వచ్చిన సందర్భాలు ఉన్నా య ని, తాను రెండు ఎకరాల్లో ప ట్టుపురుగుల పెంపకాన్ని చేప ట్టడం జరిగిందని, 2017 సంవత్సరంలో పట్టుపురుగుల పెం పకం ప్రారంభిం చామని ఇప్పటివరకు నిరంతరాయంగా ద కొనసాగిస్తున్నట్లు తెలి పారు.
రైతులు ఎలాంటి ఇబ్బందులు లే కుండా ఈ పట్టుపురుగుల పెంపకా న్ని చేపట్టవచ్చని, ముఖ్యంగా వరి లాంటి మంటల కు వచ్చే తెగులు, ఎలాంటి చీడపీడల బెడద ఉండదని, కేం ద్ర ప్రభుత్వం 50 శాతం, రాష్ట్రప్రభుత్వం 25 శాతం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. రైతులకు మంచి లాభకారంగా ఇది ఉంద న్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో పట్టుపురుగుల పెంప కానికి ఆసక్తి ఉన్న రైతులను ప్రో త్సహించాలని, ఏప్రిల్ 2న గ్రామా లలో నిర్వహించే ప్రజా పాలన -ప్రగ తి ప్రణాళిక గ్రామసభలలో పట్టు పురుగుల తోటల పెంపకానికి రైతు లకు అవగాహన కల్పించాలని కలె క్టర్ సూచించారు.
పట్టు పురుగుల పెంపకానికి ప్రభుత్వం ఇచ్చే చే యూతను ఉపయోగించుకోవడం, అలాగే వ్యవసాయంలో నూతన సాం కేతికతను, మేలైన పద్ధతు ల ను ఉపయోగించడం ప్రభుత్వ స బ్సిడీ వంటివాటిని పొందడం ద్వా రా మంచి ఆదాయం వస్తుందని అ న్నారు.రైతులు మూస పద్ధతిలో కాకుండా అన్ని రకాల పంటలు పండించాల ని, ముఖ్యంగా జిల్లాలో ఆయిల్ ఫామ్ పట్టు పురుగుల పెంపకానికి ముం దుకు రావాలని,వరి పండిం చడంలో తెలంగాణ దేశంలోనే ముందుందున్నప్పటికి ప్రత్యమ్నయ పంటల పట్ల కూడా రై తులు దృష్టి సారించాలని, ఆయిల్ పా మ్, ఉద్యాన తోటల పెంపకం, ప ట్టు పురుగుల పెంపకం చేపట్టాల న్నారు. ప్రత్యే కించి సెరికల్చర్ లో సబ్సిడీ బాగా ఉందని, అంతే కాక ఈ పంటలో ఎలాంటి వృధా అన్న ది లేనందున నష్టం కూడా రాద ని,సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగు బడులు లాభా లు వస్తాయని, పట్టుపురుగుల పెం పకానికి నల్గొండ జిల్లా భూమి, నీ రు ,అన్నీ అనుకూలంగా ఉన్నా యని, అలాగే సెరికల్చర్ కు మంచి మార్కెట్ ఉందని, మం చి డిమాండ్ ఉందని దీన్ని ఉపయోగిం చు కోవాలని తెలిపా రు.
అనంతరం జిల్లా కలెక్టర్ రైతు పుం డరీకంకు కేంద్ర ప్రభు త్వం ద్వారా మంజూరు చేసిన సెరికల్చర్ రిసో ర్స్ సెంటర్ ను సందర్శించి రైతుల తో మాట్లాడారు. అన్ని గ్రామాల స ర్పంచ్ లు సేరికల్చర్ పంట పట్ల ప్రో త్సహించాలని ఈ సంద ర్భంగా తె లిపారు. కాగా ఇందిరమ్మ ఇండ్ల గురించి జిల్లా కలె క్టర్ సర్పంచుల తో మాట్లాడుతూ గృహప్రవేశా ల కు సిద్ధం చేయాలని అన్నారు. వ్య క్తిగత మరుగుదొడ్ల బిల్లులు గురిం చి ఆరాతీశారు. సెక్రటరీతో మా ట్లా డి వ్యక్తిగత మరుగు దొ డ్లకు బుక్ చే సుకోవడం ద్వారా వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లు లను పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లా ఉద్యాన శాఖ డిడి సుభాషిని మాట్లాడారు. హర్టికల్చర్ అధికారి అనంత రెడ్డి, నరసింహపురం సర్పంచు రాజేశ్వ రి, ఇతర గ్రామాల సర్పంచులు త దితరులు ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశాలకు సిద్ధం చేయాలి
నిర్మాణాలు పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లను గృహప్రవే శాల కు సిద్ధం చే యాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశే ఖర్ కోరారు. బుధవారం ఆయన నల్గొండ జిల్లా కనగల్ మండలం, తెల కంటి గూడెంలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. తెల కంటి గూడెంలో ఇందిరమ్మ పథకం కింద నిర్మిస్తున్న మొత్తం ఇండ్లు, ఇప్పటి వరకు ప్రారంభించినవి, ప్రారంభా నికి సిద్ధం గా ఉన్న ఇండ్లు అడిగి తె లుసుకున్నారు. నిర్మాణాలు పూర్త యి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఇందిరమ్మ ఇండ్లను ప్రారం భోత్స వాలకు సిద్ధం చేయాలని ఈ సంద ర్భంగా కలెక్టర్ సూచించారు.
కాగా ఇందిరమ్మ ఇళ్ల కాలనీలో నీ టి ఎద్దడి ఉందని, ఎండా కాలం స మస్య ఎక్కువగా ఉంటుందని, అందువల్ల తాగునీ టి సమస్య తీర్చా లని ఇందిరమ్మండ్ల గృహాలబ్ధిదా రులు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశా రు.ప్రస్తుతం దూరం నుండి పై పు లై ను వేసుకుని నీటిని తెచ్చుకుంటు న్నట్లు వారు తెలిపారు. ఈ విష యమై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ని తేల కంటి గూడెంకు పంపిస్తానని కలెక్టర్ చెప్పారు. తాగు నీటిని సర ఫరా చే సేందుకు ఉన్న అవకాశాలను పరిశీ లించి తెలకంటి గూడెంకు తాగునీ రు అందించేలా చర్యలు తీసుకుం టామ ని చెప్పారు. తాగునీటి పను లు మంజూరు ఇచ్చిన వెంటనే ప నులు ప్రారంభించాల్సిందిగా ఆయ న పంచాయతి కార్యదర్శిని ఆదేశించారు.



