Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ జిల్లా తెలంగాణ ఐక్య ఉపా ధ్యా య ఫెడరేషన్, జ్ఞాన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కె. రాఫెల్ తో పాటు నర్రా శేఖర్ రెడ్డి అధ్యక్షతన నల్లగొండ గడియారం సెంటర్ వద్ద నిర్వహించిన ఉగాది పచ్చడి వితరణ కార్యక్ర మానికి నల్లగొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ముఖ్యఅ తి థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృ తిలో సహజంగా దొరికే పానీయాలను తాగాలని కృత్రి మంగా తయారై పానీయాల వల్ల ఆరోగ్యం చెడిపోతుందని తెలుపుతూ ఉగాది ప ర్వదినాన్ని పురస్కరించుకొని కృత్రి మ పానీయాలు మానేద్దాం సహజ పానీయాలు సేవిద్దాం అ నే నినాదం తో ఉగాది పచ్చడి వితరణ కార్య క్రమాన్ని చేప ట్టిన టీఎస్ యుటి ఎఫ్ నల్లగొండ జిల్లా కమిటీని అభి నం దించారు.
నల్లగొండ కార్పొరేషన్ మొదటి మే యర్ చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు నూతన సంవ త్సరమైన ఉగాది యొక్క విశిష్టత ను కాలంలో వచ్చే మార్పులు కనుగుణంగా మన శరీరానికి సరైన పోషకాలు ఇచ్చేటటువంటి సహజ పా నీయాలను తాగాలనే మోటీవ్ ఇలాంటి కార్యక్రమం చేప ట్ట డం అభినందనీయమన్నారు. ఆ రాష్ట్ర సంఘ ఉపాధ్యక్షు లు ఎం రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ టీఎస్ యుటిఎఫ్ అ ధ్యయనం అధ్యాపనం సామాజిక స్పృహలో భాగంగా స మాజంలో కృత్రిమ పానీయాల వల్ల జ రిగేటటువంటి అన ర్ధాలను ప్రజల కు వివరించి సహజ పానీయాలను సేవించ డం ద్వారా జరిగే లాభాల ను ప్రజలకు వివరించడం మా సం ఘ బాధ్యత అని అన్నారు.
రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం మాట్లాడుతూ యు వత ఈ నాడు శీతల పానీయాలను విచ్చల విడిగా తాగు తూ తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని అందుకే గత కొన్ని సంవత్సరాలుగా నల్లగొం డ జిల్లా కమిటీ జన విజ్ఞాన వేదిక కలిసి ప్రతి ఉగాది రోజున షడ్రుచులు కలిగిన టువంటి ఉగాది పచ్చడిని పంపిణీ చేస్తూ శీతల పానీ యా లతో జరిగేటటువంటి అనర్ధాల పట్ల అవగాహన కల్పిస్తూ హ క్కులతో పాటు బాధ్యతగా సమా జంలో కృత్రిమ పానీ యాల వల్ల జరిగే అనర్ధాలు తగ్గించడానికి తమ వంతు కృ షి చేస్తున్నట్లు తెలిపారు.
ఉగాది పచ్చడి వితరణ కేంద్రాన్ని సందర్శించినటువంటి డి ఎస్పి శివ రాంరెడ్డి మాట్లాడుతూ సా మాజిక స్పృహ కలి గి న టీఎస్ యుటిఎఫ్ ఉపాధ్యాయ సంగం సహజ పానీ యా ల వల్ల కలిగే ఎ టువంటి లాభాలను సమాజానికి తెల పడం ఎంతో మంచి పరిణా మం అని అందరూ ఈ వేసవిలో కొ బ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మకాయ ర సం, చెరుకురసం వంటి సహజపా నియాలే తాగాలని అన్నారు.
మాజీ నల్లగొండ ము న్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మా ట్లాడుతూ ఈ రోజు నుండి తెలుగువారికి నూతన సంవ త్స రం ప్రారంభం అవు తుందని పంచాంగం పఠనం చేసి రా బో యే సంవత్సర కా లంలో రాశులు, నక్షత్రాలు, కాలాల గు రిం చి ఎలా ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుందని ఇది హిందువులకు గొప్ప పండుగన్నారు.
ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి న న్నూరి రమణారెడ్డి, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎఫ్ డ బ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎడ్ల సైదులు జిల్లా కార్యద ర్శు లు గేర నరసింహ, మురలయ్య, నలపరాజు వెంకన్న, కొమ ర్రాజు సైదులు, మధుసూదన్, జన విజ్ఞాన వేదిక బాధ్యులు చంద్రశేఖర్ రెడ్డి, సమతా కన్వీనర్ విమల, సంతోష్, టాప్రా జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్, రవీందర్, రమణ మరియు వివిధ మండలాల బాధ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు.


