Supreme Court of India : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: కుల హ క్కులపై దేశవ్యాప్తంగా చర్చకు దా రితీసే కీలక తీర్పును ( Supreme Court of India) తాజాగా వెల్ల డించింది. ఈ తీర్పులో క్రైస్తవ మ తంలోకి మారిన వ్యక్తులు ఎస్సీ (షె డ్యూల్డ్ కులాలు) హక్కులను పొం దలేరని స్పష్టంగా పేర్కొం ది. ఇప్ప టికే ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh Hig h Court) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు స మర్థిస్తూ అదే నిర్ణయాన్ని ఖరారు చేసింది. తన వివరణలో కోర్టు హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందినవారికే ఎస్సీ హక్కులు వర్తిస్తాయని మరోసారి పునరుద్ఘాటించింది.
ఈ కీలక తీర్పును జస్టిస్ పి కే మి శ్రా( Justice P. K. Mish ra), జస్టి స్ కేవి విశ్వనాథన్ అంజరియా (J ustice KV. Vi swanathan Anj aria )లతో కూడిన ధర్మాసనం వెలువ రించింది. ఈ నిర్ణయం భవిష్యత్తులో మత మార్పిడి, కుల హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలపై మరింత చ ర్చకు దారితీసే అవకాశo లేకపోలేదు.
సుప్రీంకోర్టు తీర్పు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి
క్రైస్తవ మతం లో కి మారితే ఎస్సీ హోదా కొనసాగుతుందా అనే అంశం దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఒక కీలక ప్ర శ్నకు సుప్రీంకోర్టు తాజాగా స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఈ తీర్పు భ విష్యత్తులో మతమార్పిడి, రిజర్వేషన్లు, అట్రా సిటీ చట్టాల అమలుపై పెద్ద ప్రభావం చూపనుంది.
గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో జరిగిన ఒక సంఘ టన ఈ చర్చకు కారణమైంది. అక్కడ పాస్టర్ గా పనిచేస్తు న్న వ్యక్తిపై దాడి జరగగా, అతను అట్రాసిటీ కేసు నమో దు చేయించాడు. తనకు ఎస్సీ హోదా ఉందని పేర్కొంటూ రక్ష ణ కోరాడు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ ప్ర శాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియా లు కొన్ని కీలక విష యాలను పరిశీలించారు.
బాధితుడు దాదాపు పది సంవత్సరాలుగా క్రైస్తవ మతంలో పాస్టర్‌గా సేవలం దిస్తున్నాడని, ఘటన సమయంలో కూడా ప్రార్థనలు నిర్వహిస్తున్నా డ ని కోర్టు గుర్తించింది.క్రైస్తవ మ తంలో కులవ్యవస్థకు స్థానం లేదని. అందువల్ల, ఎస్సీ వర్గా నికి సంబంధించిన ప్రత్యేక రక్షణలు, ముఖ్యంగా అట్రాసిటీ చట్టం కింద లభించే ప్రయోజనాలు, మత మార్పిడి తర్వాత వర్తించవని తెలిపింది.
ఇంకా ఒక ముఖ్యమైన అంశం తహశీల్దార్ జారీ చేసిన కు లధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ, అది మత మార్పిడి తర్వా త ఆటోమేటిక్‌గా రక్షణ ఇవ్వదని కోర్టు పేర్కొంది. అంటే ఒక వ్యక్తి మతం మార్చు కున్న తర్వాత, అతని సామాజిక స్థితి కూడా చట్టపరంగా మారిపోతుందని ఈ తీర్పు సూచిస్తోం ది.
ఈ నిర్ణయం కేవలం ఒక కేసుకే పరి మితం కాకుండా భవి ష్యత్తులో మత మార్పిడి చేసుకునే వారి హక్కులు, రిజర్వే షన్ ప్రయోజనాలు, చ ట్టపరమైన రక్షణలపై పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఇప్పుడే ప్రశ్న ఈ తీ ర్పు తరువాత దేశవ్యా ప్తంగా ఏ మార్పులు చోటుచేసుకుంటాయని వేచిచూడాల్సి ఉంటుంది. ఏది ఏ మైనా దేశ అత్యున్నత న్యాయస్థా నం వెలువరించిన కీలక తీర్పు సంచలనం రేకెత్తించిందని చెప్ప వచ్చు.
