Monday, September 28, 2026
More
    HomeOpinionSP Sharath Chandra Pawar : తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో నల్లగొండ జిల్లాఎస్పీ శరత్ చంద్ర...

    SP Sharath Chandra Pawar : తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో నల్లగొండ జిల్లాఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆక స్మిక తనిఖీ

    📰 Generate e-Paper Clip

    SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, తిప్పర్తి: నల్లగొండ స బ్ డివిజన్ పరిధిలోని తిప్పర్తి పో లీస్ స్టేషన్ త్వరలోనే ప్రజలకు మ రింత చేరువవుతూ ఆధునిక సేవ లతో ముందుకెళ్ళాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూ చించారు. మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ నిర్వ హించి భవిష్యత్ కా ర్యాచరణకు మార్గదర్శక సూచనలు చేశారు.

    ఈ తనిఖీలో భాగంగా స్టేషన్‌లోని సిబ్బంది పనితీరు, ప్రజల కు అందిస్తున్న సేవలు, పరిధిలోని పరిస్థితులపై ఆరా తీశా రు. ముఖ్యంగా రిసె ప్షన్ మేనేజ్‌మెంట్, ఉమెన్ హెల్ప్ డె స్క్, రికార్డు విభాగం, లాక్ అప్, ఎస్‌హెచ్‌ఓ గది వంటి విభా గాలను పరిశీలించి, భవిష్యత్తులో ఇవి మరింత సాంకేతిక తతో మెరుగుపడే లా చర్యలు తీసుకోవాలని సూచిం చా రు. ఇకపై కేసుల దర్యాప్తు వేగం గా, పారదర్శకంగా జరగా లని, నిందితులకు చట్ట ప్రకారం కఠినశిక్షలు పడేలా సాంకేతి క ఆధారాలను వినియోగించాలని అధికారులు దృష్టి సారిం చాలన్నారు.

    ప్రతి కేసును సమగ్రంగా విచారణ చేసి, న్యాయం త్వరితగ తిన అందే విధంగా వ్యవస్థను బలోపేతం చే యాలని ఎస్పీ స్పష్టం చేశారు. గ్రా మీణ ప్రాంతాల్లో నేర నియంత్రణ కోసం గ్రామ పోలీస్ అధికారులు రోజువారీ పర్యటనలు నిర్వహి స్తూ ప్రజలతో మమేకం కావడం మరింత పెంచాలన్నారు. ప్ర జా ఫిర్యాదు లపై ఆలస్యం లేకుండా స్పందించే డిజిటల్ వ్య వస్థలను కూడా అభి వృద్ధి చేయాలని వెల్లడించారు.

    శాంతి భద్రతల పరిరక్షణలో భా గం గా బ్లూ కోల్ట్, పెట్రో కార్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తూ డయ ల్ 100 కాల్స్‌కు క్షణాల్లో స్పందించే లా సాంకేతిక అప్‌గ్రేడ్లు చేపట్టాల న్నారు. సంఘటన స్థలానికి వేగం గా చేరుకునే సామర్థ్యాన్ని పెంచే చర్యలు అమలు కానున్నాయన్నారు. అదేవిధంగా స్టేషన్ పరిధిలో సీసీటీవీ నెట్‌వర్క్ విస్తరణకు ప్రాధాన్యం ఇస్తూ, ప్రతి ముఖ్య ప్రాంతం నిఘా కళ్ల కిందకు వచ్చేలా చర్య లు చేపట్టేందుకు చర్యలు తీసుకో వాలని తెలిపారు. సైబర్ క్రై మ్‌పై అవగాహన కార్యక్రమాలు విద్యార్థులు, ప్రజలలో మ రింత విస్తృతంగా నిర్వహిoచాలన్నారు.

    గంజాయి, అక్రమ ఇసుక రవాణా, పిడిఎస్ బియ్యం దందా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలపై భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చ రిస్తున్నారు. అలాగే రోడ్డు ప్ర మాదాల నియంత్రణ కోసం డ్రం క్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ల డ్రైవిం గ్‌పై ప్రత్యేక డ్రైవ్‌లు మరింత కఠినంగా అమలు చేయాలని ఎస్పీ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో నల్లగొండడిఎస్పీ శివ రాం రెడ్డి, శాలిగౌరారం సీఐ కొం డల్ రెడ్డి, తిప్పర్తి ఎస్.ఐ శం కర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.